బిగ్‌బాస్‌లో గాడిద..కంటెస్టెంట్లకు అలాంటి పెంట.. ఆ తలనొప్పితో!

బిగ్‌బాస్ హిందీ రియాలిటీ షోలో రకరకాల వింతలు చోటు చేసుకొన్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా బిగ్‌బాస్ షోలో కంటెస్టెంట్‌గా గాడిదను ప్రవేశపెట్టారు. దాంతో ఈ షో అభిమానులందరూ షాక్ గురయ్యారు. అయితే 16 మందితోపాటు గాడిద కూడా కంటెస్టెంట్‌గా మారడంతో ఇంటి సభ్యులందరికీ కష్టాలు వచ్చిపడ్డాయి. అయితే ఇంటిలో గాడిద సృష్టించిన సమస్యలు ఏమిటనే వివరాల్లోకి వెళితే..

బిగ్‌బాస్ 18 షోలో 16 మందిని పరిచయం చేసి ఇంట్లోకి పంపించిన తర్వాత హోస్ట్ సల్మాన్ ఖాన్ సర్‌ప్రైజ్ ఇస్తూ.. గాడిదను ప్రవేశపెట్టారు. వేదికపైకి గాడిద (గదేరాజ్)‌ను చూపించి.. ఇంటిలో సెలబ్రిటీలతోపాటు గాడిద కూడా ఇంటిలో ఉంటుందని చెప్పారు. గాదేరాజ్ కూడా వేదికపై ఎలాంటి బెదురు లేకుండా సల్మాన్ చెప్పిన విషయాలు వింటూ కనిపించింది.

Donkey Gadharaj ruckus in Salman Khan s Bigg Boss 18

ఇక గదేరాజ్‌తో సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ.. ఇంటిలో నీవు జాగ్రత్తగా ఆట ఆడాలి. నీకు కోపం వస్తే.. ఎవరినీ కూడా ఏమీ అనకూడదు. ఎవరైనా అంటే ఏడవకూడదు. అలాగే ఎవరైనా నిన్ను ఏమైనా అంటే నీవు వారిని కొట్టకూడదు. తన్న కూడదు అని మంచి విషయాలు చెప్పి.. ఇంటిలోకి పంపించారు. అలా బిగ్‌బాస్‌లో గాడిద కూడా కంటెస్టెంట్ అయ్యారు.

అయితే గదేరాజ్ మాత్రం ఇంటి సభ్యులకు కొన్నిసార్లు చికాకు పెట్టింది. ఉన్నట్టుండి అరవడం.. గట్టిగా కేకలు పెట్టడంతో సెలబ్రిటీలు ఇరిటేట్ అయ్యారు. దాని కోసం ప్రత్యేకంగా ఓ ప్రదేశాన్ని కేటాయించి దానికి అన్ని రకాల వసతులు కల్పించారు. దానిని చూసుకొనేందుకు ఓ కంటెస్టెంట్‌ను గార్డియన్‌గా పెట్టారు. అది అరిచినప్పుడు దానికి తినడానికి కావాల్సిన ఏర్పాట్లు చేసేలా చేసుకొన్నారు.

అయితే ఒకసారి ఉన్నట్టుండి గదేరాజ్ కేకలు పెట్టింది. ఇద్దరు కంటెస్టెంట్లు బయటకు వచ్చి దానిని చూస్తూ.. అది మరుగుదొడ్డికి వెళ్లాలని చూస్తున్నట్టుంది. నీవు వెళ్లి టిష్యూతో దాని పేడ తీసి బాత్రూంలో వేసి ఫ్లష్ చేయండి తోటి కంటెస్టెంట్‌కు మరో కంటెస్టెంట్ సలహా ఇచ్చారు. ఆ తర్వాత వాటర్ పైప్ పెట్టి క్లీన్ చేయండి అని సలహా ఇచ్చింది.

ఇదిలా ఉండగా, గదేరాజ్‌తో ఎలాంటి ఆటను ఆడిస్తారు? దానిని ఎందుకు షోలొకి తెచ్చారు? దానితో కంటెస్టెంట్లకు ఎలా ముడిపెడుతారు? ఈ షోలో ఎన్నాళ్లు గాడిద ఉంటుంది? అనే విషయాలు ఆసక్తికరంగా మారాయి. ఈ గదేరాజ్ వ్యవహారాన్ని బిగ్‌బాస్ ఎలా డీల్ చేస్తారో అనేది అభిమానులు వేచి చూస్తున్నారు.

More from Filmibeat

Read more about: donkey salman khan bigg boss 18
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X