దూరదర్శన్‌లో మళ్లీ ప్లాఫ్ షో.. రామాయణం, మహాభారతం తర్వాత..
దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతున్న సమయంలో నేషనల్ దూరదర్శన్ తీసుకొన్న నిర్ణయం మంచి ఫలితాలను ఇచ్చింది. రామాయణం, శక్తిమాన్, మహాభారత్ సీరియల్స్ పున: ప్రసారానికి దేశవ్యాప్తంగా అనూహ్యమైన స్పందన వచ్చింది. ప్రేక్షకుల అభిరుచిని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం జస్పాల్ భట్టీ హోస్ట్ చేసిన ఫ్లాప్ షోను మళ్లీ ప్రసారం చేయడానికి దూరదర్శన్ సిద్ధమైంది.
1989లో జస్పాల్ భట్టి హోస్ట్‌గా ప్రసారమైన వ్యంగ్యంతో కూడిన హాస్య కామెడీ షోకు ప్రేక్షకుల నుంచి అద్బుతమైన రెస్పాన్ వచ్చింది. ఈ ప్లాప్‌షో అప్పట్లో దూరదర్శన్‌లో హిట్ షోగా బుల్లితెర ప్రేక్షకుల నీరాజనాలు అందుకొన్నది. ఇటీవల ప్రసారమైన పాత సీరియల్స్‌కు మంచి స్పందన వస్తున్న నేపథ్యంలో ప్లాష్ షోను ప్రేక్షకులకు అందించాలని నిర్ణయించింది.

ప్రేక్షకులను తనదైన కామెడీతో అలరించిన జస్పాల్ భట్టి ప్రస్తుతం లేరు. దూరదర్శన్ నిర్ణయం నేపథ్యంలో స్వర్గీయ జస్పాల్ భట్టీ భార్య సవితా భట్టి స్పందిస్తూ.. ఫ్లాష్ షోను మళ్లీ ప్రసారం చేయడం హ్యాపీగా ఉంది. నా జీవితంలో మళ్లీ సంతోషకరమైన క్షణాలు రానున్నాయి. మా ఐడెంటీని మళ్లీ ఒకసారి ప్రేక్షకులకు చెప్పే కార్యక్రమం ఇది అని సవితా భట్టి అన్నారు.
దూరదర్శన్‌లో ప్రేక్షకాదారణ పొందిన ఫ్లాప్ షోకు సవితా భట్టి దర్శకత్వం వహించగా ఆమె భర్త, సహనటుడు జస్పాల్ భట్టి హోస్ట్‌గా వ్యవహరించారు. ఇలాంటి అత్యంత ప్రేక్షకాదరణ పొందిన షోలో భాగం కావడం గొప్ప అనుభూతి. జీవితంలో ఇంతకంటే గొప్ప ఆశించే క్షణాలు మరేవి ఉండవేమో అని సవితా భట్టి అన్నారు.


Click it and Unblock the Notifications











