జబర్దస్త్‌పై దొరబాబు ఎఫెక్ట్.. దెబ్బకు మార్చేశారు! దానికి ఓకే చెబితేనే చేయండి.. లేదంటే!!

బుల్లితెర ఖతర్నాక్ కామెడీ షో జబర్దస్త్‌ విషయమై ఆ షో నిర్వాహకులు పలు రూల్స్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ షోలో పార్టిసిపేట్ చేసే కమెడియన్స్ కదలికలపై ప్రత్యేక దృష్టి సారించేలా కొన్ని కండిషన్స్ పెట్టారని వార్తలు వస్తున్నాయి. ఇందుకు కారణం వ్యభిచారం కేసులో దొరబాబు పట్టు బడటమే అంటున్నారు. ఇంతకీ జబర్దస్త్‌ మేనేజ్‌మెంట్ ఏం రూల్స్ పెట్టింది? అసలు మ్యాటర్ ఏంటి? వివరాల్లోకి పోతే..

Recommended Video

Jabardasth Comedy Show Management New Rules To Comedians | Filmibeat Telugu
జబర్దస్త్ నవ్వులు.. బుల్లితెర కిక్

జబర్దస్త్ నవ్వులు.. బుల్లితెర కిక్

బుల్లితెరపై ప్రసారమవుతున్న షోలన్నింటిలో జబర్దస్త్ షోకే ఎక్కువ ప్రాధాన్యత ఉందనడంలో అతిశయోక్తిలేదు. డబుల్ మీనింగ్ డైలాగులు, వల్గారిటీ ఉందని కొంతమంది వాదించినా కూడా జబర్దస్త్‌పై పెద్దగా ఎఫెక్ట్ పడలేదు. జబర్దస్త్ నవ్వులు బ్రేక్ పడలేదు. ప్రతీవారం బుల్లితెర కిక్ అలాగే కొనసాగుతూనే ఉంది.

నాగబాబు దెబ్బ.. నెట్టుకొస్తున్న రోజా

నాగబాబు దెబ్బ.. నెట్టుకొస్తున్న రోజా

ఇంతలో జబర్దస్త్ నుంచి నాగబాబు తప్పుకోవడంతో.. ఏడేళ్ల పాటు సక్సెస్‌ఫుల్ గా సాగిన ఈ షోకి పెద్ద దెబ్బే అనుకున్నారంతా. కానీ జబర్దస్త్ జడ్జ్ గా రోజా ఏ మాత్రం టీఆర్ఫీ పడిపోకుండా నాగబాబు లేనిలోటును పూడ్చుతూ నెట్టుకొస్తోంది. అలా అలా షో సాగిపోతుండగానే.. జబర్దస్త్ కమెడియన్ దొరబాబు ఇష్యూ వైరల్ అయి జబర్దస్త్ వార్తలు మరోసారి హాట్ టాపిక్ అయ్యాయి.

 దొరికిపోయిన దొరబాబు.. వ్యభిచారం చేస్తూ

దొరికిపోయిన దొరబాబు.. వ్యభిచారం చేస్తూ

జబర్ధస్త్ కామెడీ షోలో కమెడియన్‌గా కొనసాగుతున్న దొరబాబు వ్యభిచారం చేస్తూ పోలీసులుకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిన సంగతి తెలిసిందే. దొరబాబు, పరదేశీ వ్యభిచారం చేస్తున్నారని తెలియడంతో బుల్లితెర ప్రేక్షకులు షాకయ్యారు. దీంతో మీడియా వర్గాల్లో, ప్రేక్షకుల్లో ఈ అంశం హాట్ హాట్ చర్చలకు దారి తీసింది.

ఆ రోజు రాత్రి ఏం జరిగింది?

ఆ రోజు రాత్రి ఏం జరిగింది?

అసలు దొరబాబు, పరదేశీ ఆ వ్యభిచార గృహంలో ఎందుకున్నారు. దొరబాబు పోలీసులకు దొరికిన రోజు రాత్రి ఏం జరిగింది? అనేదానిపై పెద్ద ఎత్తున చర్చలు సాగుతున్నాయి. కొందరైతే దొరబాబు, పరదేశీ వ్యభిచార గృహం నడిపిస్తున్నారని కూడా అంటుండటం వార్తల్లో నిలిచింది. ఏది ఏమైనా దొరబాబు వ్యవహారం జబర్దస్త్‌పై కాస్త ఎఫెక్ట్ చూపించింది.

 కలుగజేసుకున్న హైపర్ ఆది.. జబర్దస్త్ రూల్స్

కలుగజేసుకున్న హైపర్ ఆది.. జబర్దస్త్ రూల్స్

దీంతో జబర్దస్త్ నుంచి దొరబాబును బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలనుకుంది జబర్దస్త్ మేనేజ్‌మెంట్. అయితే హైపర్ ఆది కలుగజేసుకొని సర్దిచెప్పి మరలా దొరబాబు జబర్ధస్త్ టీమ్‌లో వచ్చేలా వాళ్లను కన్విన్స్ చేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో జబర్దస్త్ పార్టిసిపెంట్స్ విషయంలో మేనేజ్‌మెంట్ కొన్ని రూల్స్ పాస్ చేసినట్లు తెలిసింది.

దానికి ఓకే చెబితేనే చేయండి.. లేదంటే

దానికి ఓకే చెబితేనే చేయండి.. లేదంటే

జబర్దస్త్ షో మెంబర్స్ ఎక్కడైనా బయట ఈవెంట్ చేయాలనుకుంటే మేనేజ్‌మెంట్ పర్మిషన్ తీసుకోవాలని ఓ రూల్ పెట్టారట. దానికి ఓకే చెబితేనే జబర్ధస్త్‌ షోలో పార్టిసిపేట్ చేయాలనే కండిషన్స్ పెట్టినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ లెక్కన చూస్తే ఇకపై జబర్దస్త్ పార్టిసిపెంట్స్ కదలికపై మేనేజ్‌మెంట్ ప్రత్యేక దృష్టి పెడుతున్నట్లు తెలుస్తోంది కదూ!.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X