హైపర్ ఆదిపై జబర్ధస్త్ కమెడియన్ సంచలన ఆరోపణలు: అలా చేయడం వల్లే బ్యాడ్ నేమ్ వచ్చిందంటూ!

తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న షోలలో జబర్ధస్త్‌ది ప్రత్యేకమైన స్థానం. దీనికి కారణం దాదాపు ఎనిమిదేళ్లుగా ఈ షో విజయవంతంగా ప్రసారం అవుతుండడమే. మొదటి నుంచీ ఇప్పటి వరకూ దీనికి ప్రేక్షకులు చూపించే ఆదరణ వల్లే ఇది సాధ్యమవుతోంది. మరోవైపు.. ఈ షో ద్వారా ఎంతో మంది ఆర్టిస్టులు బుల్లితెరకు పరిచయం అయ్యారు. అలా వచ్చి తక్కువ సమయంలోనే ఫేమస్ అయిన వారిలో హైపర్ ఆది ఒకడు. జబర్ధస్త్‌లో ప్రస్తుతం టాప్ కమెడియన్‌గా వెలుగొందుతోన్న అతడిపై దొరబాబు షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

 అతడి ద్వారా వచ్చాడు.. లీడర్ అయ్యాడు

అతడి ద్వారా వచ్చాడు.. లీడర్ అయ్యాడు

జబర్ధస్త్ కామెడీ షో ద్వారా కొన్ని వందల మంది ఆర్టిస్టులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అలా అదిరే అభి ద్వారా షోలోకి ఎంట్రీ ఇచ్చాడు హైపర్ ఆది. ఆ టీమ్‌లో పని చేస్తున్న సమయంలోనే అతడి టాలెంట్‌ను గుర్తించిన నిర్వహకులు.. టీమ్ లీడర్‌గా ప్రమోషన్ ఇచ్చారు. అప్పటి నుంచి హైపర్ ఆది.. రైజింగ్ రాజుతో కలిసి దుమ్ము దులిపేస్తున్నాడు.

పంచులతో దండయాత్ర... వన్ మ్యాన్ షో

పంచులతో దండయాత్ర... వన్ మ్యాన్ షో

టీమ్ లీడర్‌గా అవతరించిన తర్వాత హైపర్ ఆది మరింత ఉత్సాహంగా పని చేస్తున్నాడు. ఈ క్రమంలోనే తన స్కిట్లలో పంచులతో దండయాత్ర చేస్తున్నాడు. గుక్కతిప్పుకోకుండా డైలాగులు చెబుతూ సత్తా చాటుతున్నాడు. అంతేకాదు, దాదాపు పది నిమిషాల పాటు ఉండే స్కిట్‌లో అన్నీ తానై ఉంటూ ప్రతి దానిని వన్ మ్యాన్ షోగా మార్చేసుకుంటున్నాడీ యంగ్ కమెడియన్.

వాళ్లతో పాటు అందరినీ టార్గెట్ చేస్తున్నాడు

వాళ్లతో పాటు అందరినీ టార్గెట్ చేస్తున్నాడు

తన స్కిట్లతో సమాజంలో జరిగే ఎన్నో విషయాలను ప్రస్తావిస్తుంటాడు హైపర్ ఆది. ట్రెండింగ్‌లో ఉన్న అంశాలను టచ్ చేస్తూ ఎన్నో పంచులు వేస్తుంటాడు. ఈ క్రమంలోనే తన జట్టులోని సభ్యులతో పాటు యాంకర్లు, మిగిలిన టీమ్ లీడర్లనూ వదలడం లేదు. అలాగే, జబర్ధస్త్ జడ్జ్‌లపైనా కామెంట్లు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే కొన్ని వివాదాల్లోనూ చిక్కుకున్నాడు హైపర్ ఆది.

వాళ్లిద్దరి కేసును ఫోకస్ చేసి పంచులేస్తూ

వాళ్లిద్దరి కేసును ఫోకస్ చేసి పంచులేస్తూ

జబర్ధస్త్‌లో పని చేస్తున్న ఇద్దరు కమెడియన్లు దొరబాబు, పరదేశి ఇటీవల వ్యభిచారం చేస్తూ పట్టుబడిన విషయం తెలిసిందే. వీళ్లిద్దరూ హైపర్ ఆది జట్టులో సభ్యులుగా చేస్తున్నారు. సెకెండ్ లీడ్‌గా ఉన్న ఆర్టిస్టులు అలా దొరికిపోవడం సంచలనం అయింది. ఇలాంటి పరిస్థితుల్లో వీళ్లిద్దరినీ టార్గెట్ చేస్తూ ఆది ఎన్నోసార్లు పంచులు వేశాడు. ఇప్పటికీ దీన్నే కంటిన్యూ చేస్తున్నాడు.

వాళ్లిద్దరిపై మరోసారి పంచ్ పేల్చిన ఆది

వాళ్లిద్దరిపై మరోసారి పంచ్ పేల్చిన ఆది

వచ్చే వారానికి సంబంధించిన జబర్ధస్త్ ప్రోమో విడుదలైంది. ఇందులో ఆదిని హైలైట్ చేశారు. అతడి టీమ్ స్కిట్‌లో భాగంగా ‘అక్కడ ట్రంప్ ఎందుకు ఓడిపోయాడో తెలుసా? అవతలి వైపు మేము ప్రచారం చేశాము కాబట్టి' అని దొరబాబు అంటాడు. దీనికి హైపర్ ఆది ‘ఇక్కడ మీరు కంపు ఎందుకు అయ్యారో తెలుసా? ఇక్కడ కూడా మీరు ప్రచారం చేశారు కాబట్టి' అని పంచ్ వేశాడు.

నీ వల్లే బ్యాడ్ నేమ్ వచ్చిందని దొరబాబు

నీ వల్లే బ్యాడ్ నేమ్ వచ్చిందని దొరబాబు

మీకు మీరు ప్రచారం చేసుకోబట్టే కంపు అయిందని హైపర్ ఆది పంచ్ వేయగానే స్పందించిన దొరబాబు.. ‘మేము కాదు.. నువ్వే మొత్తం చేశావ్' అంటూ కౌంటర్ ఇచ్చాడు. ఇది నవ్వుకుంటూ వేసిన పంచే అయినప్పటికీ.. అతడు తన మనసులోని బాధను బయట పెట్టాడన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. దీంతో ఈ జబర్ధస్త్ ప్రోమో తెగ వైరల్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X