వ్యభిచారం కేసులో దొరబాబు అరెస్ట్.. జబర్దస్త్ కమెడియన్‌పై భార్య షాకింగ్ కామెంట్స్

ప్రముఖ టెలివిజన్ ఛానెల్‌లో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షోతో అత్యంత ప్రేక్షకాదరణను పొందిన కమెడియన్ దొరబాబు, పరదేశి వ్యభిచారం కేసులో అరెస్ట్ కావడం వినోద పరిశ్రమను షాక్ గురిచేసింది. టెలివిజన్ రంగంలో మంచి క్రేజ్ ఉన్న ఈ కమెడియన్లు ఇలాంటి చర్యలకు పాల్పడుతారా? అంటూ అందరూ ముక్కున వేలేసుకొన్నారు. సోషల్ మీడియాలో దొరబాబుపై రకరకాల కథనాలు వెలుగుచూశాయి. అయితే అప్రతిష్టపాలైన దొరబాబుకు ఒకరు మాత్రం కొండంత అండగా నిలిచారు. అలా కష్టకాలంలో వెన్నంటి నిలిచిన వారెవరంటే దొరబాబు భార్య అమూల్య. వ్యభిచారం కేసులో అరెస్టైన నేపథ్యంలో భర్త గురించి అమూల్య ఏమన్నారంటే..

దొరబాబు భార్య అమూల్య గురించి

దొరబాబు భార్య అమూల్య గురించి

జబర్దస్ట్ ఆర్టిస్టు దొరబాబు భార్య అమూల్య విషయానికి వస్తే.. ఆమె టిక్‌టాప్ యాప్‌లో స్టార్ స్టేటస్ ఉన్న నెటిజన్. అంతేకాకుండా నెల్లూరు లోకల్ టెలివిజన్‌లో యాంకర్‌గా పనిచేశారు. దొరబాబు జబర్దస్త్ కార్యక్రమంలో పేరు తెచ్చుకొంటున్న సమయంలోనే వారిద్దరు ప్రేమలో పడి పెళ్లి చేసుకొన్నారు. వారిద్దరిక ఓ కూతురు కూడా ఉంది. ఇలా హ్యాపీగా జీవితం సాగిపోతుందనుకొంటున్న సమయంలో దొరబాబు కేసులో ఇరుక్కోవడంతో వారి వైవాహిక జీవితంలో ఏదో జరుగుతుందని ఆశించారు. అలాంటి ఊహాగానాలకు తెరదించుతూ అమూల్య భర్తకు అండగా నిలబడటం చర్యనీయాంశమైంది.

నా భర్త అలాంటోడు కాదు

నా భర్త అలాంటోడు కాదు

తన భర్తపై నమోదైన కేసు, అరెస్ట్‌పై అమూల్య సోషల్ మీడియాలో స్పందించారు. దొరబాబును ఉద్దేశించి స్పందిస్తూ.. ఓ వ్యక్తి అపార్థం చేసుకొనేటప్పుడు గతంలో ఆ వ్యక్తి మనతో ఎలా ఉన్నాడనే విషయాన్ని మరిచిపోకూడదు. ఒక్కోసారి మన కళ్లు మనల్ని మోసం చేస్తాయి. మన కళ్లను నమ్మలేని పరిస్థితి వస్తుంది అంటూ ఆమె సోషల్ మీడియాలో ఓ పోస్టును పెట్టింది. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

నా భర్త ఏంటో నాకు బాగా తెలుసు

నా భర్త ఏంటో నాకు బాగా తెలుసు

అంతేకాకుండా నా భర్త గురించి తనకంటే మరొకరి ఎక్కువ తెలుసా? దొరబాబు ఎన్ని ఆరోపణలు వచ్చినా నేను నమ్మే పరిస్థితి ఉండదని అమూల్య స్పష్టం చేశారు. తమ ప్రమేయం లేకుండానే కొందరు ఇలాంటి ఉచ్చులో ఇరుక్కొంటారు. కాలమే ఇలాంటి సమస్యలకు పరిష్కారం చెబుతుందని తన సన్నిహితులతో అమూల్య అన్నట్టు సమాచారం. దీంతో అమూల్యపై తన స్నేహితులు ప్రశంసలు గుప్పిస్తున్నట్టు సమాచారం.

Recommended Video

Actress Latha Sri Reveals Interesting Facts In Ali's Show || Filmibeat Telugu
దొరబాబు అరెస్ట్‌పై పలురకాల కథనాలు

దొరబాబు అరెస్ట్‌పై పలురకాల కథనాలు

తాజాగా దొరబాబు అరెస్ట్ తర్వాత ఓ కథనం మీడియాలో ప్రచారం అవుతున్నది. అరెస్ట్ సమయంలో దొరబాబు తన స్నేహితులతో పేకాట అడుతున్నారనే ఆ కథనం సారాంశం. ఏదో సమాచారం అందుకొన్న పోలీసులు తనిఖీలు చేపట్టగా దొరబాబు అడ్డంగా దొరికిపోయారు. ఆ నేపథ్యంలో వ్యభిచారం కేసులోనే అరెస్ట్ అయినట్టు ప్రచారం గుప్పుమన్నది. అయితే దొరబాబు నిజంగానే అలాంటి పనులకు పాల్పడ్డారా లేదా అనేది పోలీసుల దర్యాప్తులో తేలడం ఖాయమని సన్నిహితులు పేర్కొంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X