Double Elimination: బిగ్‌బాస్‌లో డబుల్ ఎలిమినేషన్.. రాము రాథోడ్ అవుట్.. మరో కంటెస్టెంట్ ఎవరంటే?
బిగ్‌బాస్ తెలుగు 9 రియాలిటీ షో ఆసక్తికరంగా సాగుతూ ముగింపు దశకు చేరుకొంటున్నది. ఈ క్రమంలో ప్రతీవారం నామినేషన్లు, ఎలిమినేషన్ ప్రక్రియ జోరుగా, జోష్‌తో సాగుతున్నది. అయితే ఇప్పటికే 8 వారాల ఆట ముగిసి.. 9 వారం గేమ్ కూడా పూర్తి అవ్వడానికి వచ్చింది. ఈ క్రమంలో 9వ వారం అనూహ్యమైన పరిస్థితి చోటు చేసుకొన్నది. దాంతో మిస్టీరియస్‌గా డబుల్ ఎలిమినేషన్‌కు దారి తీసింది. ఈ క్రమంలో ఈ వారం ఇంటి నుంచి ఎలిమినేట్ అయ్యే ఇద్దరు కంటెస్టెంట్లు ఎవరనే వివరాల్లోకి వెళితే...
9వ వారం నామినేషన్‌లో 7 మంది నిలిచారు. ఈ వారం ఇంటిలో ఉండటానికి అర్హత లేని వారు అంటూ కంటెస్టెంట్లు నామినేట్ అయిన వారిలో శ్రీనివాస్ సాయి, రాము యాదవ్, సంజన గల్రానీ, తనూజా గౌడ, భరణి శంకర్, సుమన్ శెట్టి, కల్యాణ్ పడాల ఉన్నారు. ఈ వారం అందరూ స్ట్రాంగ్ కంటెస్టెంట్లు ఉండటంతో ఎలిమినేషన్ ప్రక్రియ ఆసక్తికరంగా మారింది.

నామినేట్ అయిన వారిలో తనూజ పుట్టస్వామి అత్యధికంగా ఓట్లు సంపాదించింది. ఆ తర్వాత కల్యాణ్ పడాల, సుమన్ శెట్టి రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. ఇక చివరి స్థానంలో రామ రాథోడ్, సంజన గల్రానీ, శ్రీనివాస సాయి నిలిచారు. అయితే అందరూ శ్రీనివాస సాయి ఎలిమినేట్ అవుతారనేకొనే అంతా భావించారు. కానీ అనూహ్యంగా ఈ వారం రెండో ఎలిమినేషన్ కూడా ఊహించని విధంగా తెరపైకి వచ్చింది.
ఇక శనివారం, ఆదివారం ఎలిమినేషన్ ప్రక్రియను నాగార్జున మొదలుపెట్టారు. గేమ్స్ ఆడిస్తూ.. శివ మూవీ తరఫున అమల, రాంగోపాల్ వర్మ వేదికపైకి వచ్చారు. ఈ క్రమంలో ఇంటిలో స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా ఉన్న రాము రాథోడ్ సెల్ఫ్ ఎలిమినేషన్‌కు పూనుకొన్నాడు. దాంతొ రాము నిర్ణయంతో ఇంటి సభ్యులందరూ షాక్ గురయ్యారు. అయితే నాగార్జున తనదైన శైలిలో నచ్చ జెప్పే ప్రయత్నం చేశారు. కానీ చివరకు తాను ఇంటి నుంచి బయటకు వెళ్లడానికే సిద్దం కావడంతో అతడి జర్నీ చూపించకుండా షో నుంచి బయటకు పంపించారు.
ఇక ఓటింగ్ ప్రకారం ఈ వారం రెండో ఎలిమినేషన్ ఆదివారం జరుగనున్నది. ఈ వారం తక్కువ ఓటింగ్ సాధించిన శ్రీనివాస సాయిపై ఎలిమినేషన్ వేటు పడే అవకాశం ఉంది. అయితే ఈ వేటు నుంచి ఆయన తప్పించుకొంటారా? లేదా మరో వ్యక్తి ఎలిమినేట్ అవుతారా? అనేది ఆసక్తికరంగా మారింది.
ప్రస్తుతం బిగ్‌బాస్ తెలుగు 9 సీజన్‌లో ఇప్పటి వరకు 8 వారాల్లో మొత్తం 9 మంది కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యారు. ఫస్ట్ వీక్‌లో శ్రష్టి వర్మ, ఆ తర్వాత మర్యాద రామన్న, మూడో వారం ప్రియా శెట్టి, నాలుగో వారం హరిత హరీష్, 5వ వారం ఆశా సైనీ, శ్రీజ దమ్ము, 6వ వారం భరణి శంకర్, 7వ వారం రమ్య పికిల్, 8వ వారంలో దివ్వెల మాధురి ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











