బిగ్ బాస్2: ఆ ఐదుగురిలో మూడింది ఎవరికి.. బాబు జోడి గురించి ఉత్కంఠ, కనికరం లేకుండా నాని!

Recommended Video

Bigg Boss Season 2 Telugu : Day 50 Highlights Kamal Hassan Enters Into The Show

నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ షో రసవత్తరంగా సాగుతోంది. ఎలిమినేట్ అయిన నూతన్ నాయుడు, శ్యామల తిరిగి హౌస్ లోకి ప్రవేశించారు. దీనితో ఆడియన్స్ లో మరింతగా ఆసక్తి పెరిగింది. గత వారం ఎటువంటి ఎలిమినేషన్ జరగలేదు. ఆ క్రమంలో నాని మాట్లాడుతూ ఇకపై ఏమైనా జరగొచ్చు అని అంటూ డబుల్ ఎలిమినేషన్ గురించి కూడా ప్రస్తావించాడు. ఈ నేపథ్యంలో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండే అవకాశాలు ఉన్నట్లు ఆడియన్స్ లో చర్చ జరుగుతోంది. ఈవారం నాని ఎలిమినేషన్ విషయంలో కనికరం లేకుండా వ్యవహరించబోతున్నాడనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

నామినేషన్

నామినేషన్

ఈ వారం ఐదుగురు ఇంటి సభ్యులు నామినేషన్ లో ఉన్నారు. బాబు గోగినేని, నందిని, గణేష్, దీప్తి, కౌశల్ నామినేషన్ లో ఉండడం విశేషం. వీరిలో ఈ ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.

దీప్తి పంతంతో

దీప్తి పంతంతో

బిగ్ బాస్ 2 షోలో ఎక్కువగా అభిమానుల మద్దత్తు అందుకుంటున్న వ్యక్తి కౌశల్. నెంబర్ గేమ్ టాస్క్ లో దీప్తి పంతం వలన కౌశల్ కూడా నామినేట్ అయ్యాడు. కౌశల్ కు ఆడియన్స్ మద్దత్తు ఉండడం వలన అతడు ప్రొటెక్టెడ్ జోన్ లోకి వెళ్లే అవకాశం ఉంది.

నెగిటివిటి అతడిపైనే

నెగిటివిటి అతడిపైనే

ఇక బాబు గోగినేనిపై ఆడియన్స్ లో ఎక్కువగా వ్యతిరేకత కనిపిస్తోంది. ఆయన ఎలిమినేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదైనా అద్భుతం జరిగితే బాబు ఎలిమినేషన్ నుంచి తప్పించుకోవచ్చు.

గణేష్ ప్రతి వారం

గణేష్ ప్రతి వారం

తొలి వారం నుంచి కూడా బిగ్ బాస్ 2 లో గణేష్ నామినేట్ అవుతూనే ఉన్నాడు. కానీ ప్రతిసారి ప్రొటెక్టెడ్ జోన్ లోకి వెళుతున్నాడు. ఈ సారి కూడా గణేష్ పై బిగ్ బాస్ జాలి చూపించే అవకాశాలు ఉండొచ్చు.

దీప్తి, నందిని

దీప్తి, నందిని

ఇక దీప్తి, నందిని లో ఎలిమినేట్ కాబోయేది ఎవరంటే స్పష్టంగా చెప్పడం కష్టం. ఆడియన్స్ లో నందినిపై చెడు అభిప్రాయం లేదు. కానీ ఆమె ఎక్కువగా ఫోకస్ కావడం లేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. దీప్తి గతంలోనే ఎలిమినేషన్ అంచువరకు వెళ్లి వచ్చింది. ఆడియన్స్ లో మాత్రం బాబు ఖచ్చితంగా ఎలిమినేట్ అవుతాడనే అభిప్రాయం నెలకొని ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X