Bigg Boss Voting : షాకిచ్చేలా ఓటింగ్ .. బిగ్ ట్విస్ట్ ఇవ్వనున్న బిగ్‌బాస్? ఆ ఇద్దరు ఔట్?
బిగ్‌బాస్ తెలుగు 8వ సీజన్ మరో రెండ్రోజుల్లో 13వ వారం పూర్తి చేసుకుని 14వ వారంలోకి అడుగుపెట్టనుంది. మరో రెండు వారాల్లో బిగ్‌బాస్ తెలుగు 8 సీజన్‌కి ఎండ్ కార్డ్ పడనుంది. దీంతో ఈ సీజన్ విజేతగా ఎవరు నిలుస్తారోనని ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో ఫైనలిస్టులను ఎంపిక చేసే పనికి శ్రీకారం చుట్టారు బిగ్‌బాస్. గత కంటెస్టెంట్స్‌ని హౌస్‌లోకి పంపించి వారితో టికెట్ టూ ఫినాలే టాస్కులు ఆడిస్తున్నారు . మరి 13వ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరు? సోషల్ మీడియాలో జరుగుతున్న ఓటింగ్‌లో ఎవరు టాప్‌లో ఉన్నారు? ఎవరు డేంజర్ జోన్‌లో ఉన్నారో చూస్తే:
టికెట్ టూ ఫినాలే టాస్క్‌లో భాగంగా పోటీదారులను ఎంపిక చేయడానికి బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్స్ పునర్నవి, వితికలు హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. పునర్నవి అయితే రావడం రావడమే పృథ్వీ , విష్ణుప్రియలను ఓ ఆట ఆడుకుంది. మేం ఇద్దరం ఫ్రెండ్స్ అని చెప్పినా పునర్నవి వినిపించుకోకుండా పాయింట్లు తీసి మరి క్లాస్ పీకింది.

టికెట్ టూ ఫినాలే చివరి కంటెండర్‌షిప్ కోసం నిఖిల్, గౌతమ్‌లను పునర్నవి, వితికలు సెలెక్ట్ చేశారు. అయితే మీతో పోటీపడేందుకు మరో ఇద్దరిని ఎంపిక చేసుకోవాల్సిందిగా బిగ్‌బాస్ చెప్పడంతో వారు ప్రేరణ, పృథ్వీల పేర్లు చెప్పారు. ఇక వీరికి జారుతూ గెలువు అనే టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఇందులో నిఖిల్ గెలిచినా.. పృథ్వీ చాలా బాగా ఆడాడు . మరోవైపు.. ప్రేరణకు బ్లాక్ బ్యాడ్జ్ ఇచ్చి టికెట్ టూ ఫినాలే రేసు నుంచి తప్పించారు సంచాలక్‌లు.
వారి నిర్ణయంతో ప్రేరణ మండిపడింది. చివరికి మిగిలిన నిఖిల్, పృథ్వీ, గౌతమ్‌లకు ఐ టాస్క్ పెట్టాడు బిగ్‌బాస్. ఇందులో నిఖిల్ గెలిచి టికెట్ టూ ఫినాలే కంటెండర్‌షిప్ గెలుచుకున్నారు. ఇప్పటి వరకు రోహిణి, అవినాష్, నిఖిల్‌లు టికెట్ టూ ఫినాలే కంటెండర్‌షిప్‌ను గెలుచుకున్నారు. శుక్ర, శనివారాల్లో మరికొందరు కంటెస్టెంట్స్ కూడా పోటీకి రావొచ్చుననే సంకేతాలు కనిపిస్తున్నాయి.

ఇకపోతే.. 13వ వారం నామినేషన్స్ విషయానికి వస్తే .. ఈ వారం నబీల్, నిఖిల్, ప్రేరణ, విష్ణుప్రియ, పృథ్వీ, అవినాష్, టేస్టీతేజ, గౌతమ్‌లు నామినేషన్స్‌లో ఉన్న సంగతి తెలిసిందే. మెగా చీఫ్ కావడంతో ఒక్క రోహిణి మాత్రమే నామినేషన్స్‌లో లేరు. ఈ నేపథ్యంలో 13వ వారానికి సంబంధించి సోషల్ మీడియాలో అనధికారికంగా జరుగుతున్న ఓటింగ్‌ని ఒకసారి పరిశీలిస్తే . గౌతమ్ కృష్ణ దాదాపు 27 శాతం ఓటింగ్‌తో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
తర్వాత ప్రేరణ (14.81 శాతం), నిఖిల్ (14.26 శాతం), టేస్టీ తేజ (9.34 శాతం), అవినాష్ (8.91 శాతం), నబీల్ (8.35 శాతం), పృథ్వీ (8.25 శాతం), విష్ణుప్రియ (8.09 శాతం) ఓటింగ్‌తో నిలిచారు. ఏకంగా నలుగురు కంటెస్టెంట్స్ ( పృథ్వీ, విష్ణుప్రియ, నబీల్, అవినాష్)లు డేంజర్ జోన్‌లో నిలిచారు. అయితే ఆ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండే అవకాశం ఉందని సోషల్ మీడియాలో డిస్కషన్స్ జరుగుతున్నాయి. మరి అది ఎంత వరకు నిజమో తెలియాలంటే కొద్దిగంటలు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











