Bigg Boss: ఫ్యామిలీ ఎపిసోడ్‌లో రేవంత్‌కు షాక్.. కనికరించని బిగ్ బాస్.. ఆమె కోసం పెద్ద త్యాగం

రియల్ కంటెంట్‌తో నడుస్తూ.. ఎన్నో ఊహించని పరిణామాలు.. షాక్‌కు గురి చేసే ట్విస్టులతో సాగుతోన్న ఏకైక షో బిగ్ బాస్. ఎప్పటికప్పుడు వినూత్నమైన కంటెంట్‌ను తీసుకొస్తూ ప్రేక్షకుల మన్ననలు అందుకుంటోన్న ఈ షో.. తెలుగులో ఇది ఏకంగా ఐదు రెగ్యూలర్, ఒక ఓటీటీ సీజన్లను పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ఇటీవలే ఆరో సీజన్ కూడా ఆరంభం నుంచే ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. ఇక, ఇప్పుడు హౌస్‌లో ఫ్యామిలీ ఎపిసోడ్‌ నడుస్తోంది. ఇందులో భాగంగా రేవంత్‌కు బిగ్ బాస్ షాక్ ఇచ్చి.. సర్‌ప్రైజ్ చేశాడు. ఆ సంగతులేంటో మీరే చూడండి!

ఆ సీజన్ల కంటే.. పెరుగుతోంది

ఆ సీజన్ల కంటే.. పెరుగుతోంది


ఇప్పటి వరకూ వచ్చిన సీజన్లు సూపర్ డూపర్ హిట్ అవడంతో ఆరో దానిపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే దీన్ని ఆరంభం నుంచే ఆసక్తికరంగా నడుపుతున్నారు. మరీ ముఖ్యంగా ఇందులో సరికొత్త టాస్కులు, రొమాన్స్, ప్రేమ కహానీలు సహా ఎన్నో ఆసక్తికరమైన అంశాలను హైలైట్ చేస్తున్నారు. మొదట్లో రేటింగ్ రాకున్నా ఇప్పుడు ఇది పుంజుకుంటోంది.

ఫ్యామిలీ వీక్‌లో అందరూ రాక

ఫ్యామిలీ వీక్‌లో అందరూ రాక


బిగ్ బాస్ ప్రతి సీజన్‌లోనూ చివరి వారాల్లో కంటెస్టెంట్లకు సంబంధించిన కుటుంబ సభ్యులు ఎంట్రీ ఇస్తుంటారన్న విషయం అందరికీ తెలిసిందే. గతంలో అన్ని సీజన్లలోనూ ఇదే తరహాలో వాళ్లను తీసుకొచ్చారు. ఇక, ఆరో సీజన్‌కు సంబంధించి ఇప్పుడు అది జరుగుతోంది. మంగళవారం రాత్రి నుంచి జరుగుతోన్న ఇందులో దాదాపు అందరు కంటెస్టెంట్ల ఫ్యామిలీ మెంబర్లు వచ్చారు.

ఎమోషనల్‌గా.. రేవంత్ వంతు

ఎమోషనల్‌గా.. రేవంత్ వంతు


ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్‌లో జరుగుతోన్న ఫ్యామిలీ వీక్‌లో మంగళవారం ఆది రెడ్డి, రాజశేఖర్ ఫ్యామిలీలు.. బుధవారం ఫైమా, శ్రీ సత్య, రోహిత్ కుటుంబాలు.. గురువారం శ్రీహాన్, ఇనాయా, కీర్తి భట్ ఫ్యామిలీ మెంబర్లు వచ్చారు. వీళ్ల రాకతో మూడు రోజులూ ఎమోషనల్ సీన్స్ ఎక్కువగా కనిపించాయి. ఇక, ఇందులో రేవంత్ మాత్రామే మిగలడంతో ఈరోజు ఎపిసోడ్‌పై అంచనాలు ఏర్పడ్డాయి.

రేవంత్ భార్య వీడియో4 కాల్‌లో

రేవంత్ భార్య వీడియో4 కాల్‌లో


శుక్రవారం ప్రసారం కాబోతున్న ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను స్టార్ మా కాసేపటి క్రితమే విడుదల చేసింది. ఇందులో రేవంత్ భార్య అన్విత్ మాటలను ముందుగా వినిపించారు. దీంతో ఆమె వచ్చిందేమో అనుకున్న రేవంత్ హౌస్ అంతా పరుగులు పెట్టాడు. కానీ, ఆమె మాత్రం కనిపించలేదు. చివర్లో సోఫా దగ్గరున్న ఎల్ఈడీ స్క్రీన్ ద్వారా ఆమె వీడియో కాల్ మాట్లాడింది.

కాసేపటికే వీడియో కాల్ కట్

కాసేపటికే వీడియో కాల్ కట్

స్క్రీన్‌లో తన భార్యను చూసిన రేవంత్ బాగా ఎమోషనల్ అయ్యాడు. దీంతో అన్విత అతడిని ఓదార్చింది. అనంతరం ఆమె హెల్త్ గురించి అడిగాడు. దీనికామె 'ఎంత మంది ఉన్నా నువ్వు లేవన్న బాధ ఎక్కువగా ఉంది' అని చెప్పుకొచ్చింది. అంతలోనే కాల్ కట్ అయిపోయింది. దీంతో షాకైపోయిన రేవంత్.. ఏడుస్తూనే బిగ్ బాస్‌ను మళ్లీ కాల్ కనెక్ట్ చేయమంటూ వేడుకున్నాడు.

బిగ్ బాస్‌లోకి రేవంత్ మదర్

బిగ్ బాస్‌లోకి రేవంత్ మదర్


తన భార్యతో సరిగా మాట్లాడలేకపోయానని బాధ పడుతోన్న రేవంత్‌కు బిగ్ బాస్ అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చాడు. ఇందులో భాగంగానే అతడి తల్లిని లోపలికి పంపించాడు. ఆమె అడుగు పెట్టగానే రేవంత్ వెళ్లి హగ్ చేసుకున్నాడు. ఆ తర్వాత ఆమె శ్రీహాన్‌ను కూడా మెచ్చుకున్నారు. ఇక, కీర్తి భట్‌ను పిలిచి 'ఎవరూ లేరని బాధ పడొద్దు. నీకు మేమున్నాం' అని ధైర్యం చెప్పారు.

తల్లి కోసం త్యాగం చేసేశాడు

తల్లి కోసం త్యాగం చేసేశాడు

రేవంత్‌తో మాట్లాడుతోన్న సమయంలో అతడి తల్లి 'రేవంత్ గడ్డం లైటుగా తీసుకోవచ్చుగా' అని అన్నారు. దీనికతడు 'తను ప్రెగ్నెంట్‌గా ఉందిగా' అని అన్నాడు. దీంతో తల్లి 'ఏం పర్లేదట. తీయొచ్చట' అని చెప్పారు. అంతే.. ఆ వెంటనే వాష్ రూమ్‌లోకి వెళ్లిన రేవంత్ క్లీన్ షేవ్ చేసుకుని వచ్చాడు. అతడిని అలా చూసి అందరూ సంతోషం వ్యక్తం చేసేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X