టీవీ పోగ్రామ్ లో రూ.50 లక్షల ప్రైజ్ విజేత ఆమే
ముంబై : సెలబ్రిటీ డ్యాన్స్ రియాలిటీ షో 'ఝలక్ దిక్లా జా - 6' విజేతగా ద్రష్టిదామి నిలిచారు. ఆమె తన సహచరుడైన సల్మాన్ యూసఫ్‌ఖాన్‌తో కలసి ఈ ట్రోఫీని చేజిక్కించుకున్నారు. దీంతో రూ.50 లక్షల ప్రైజ్ మనీని సొంతం చేసుకుంది. రెండో స్థానాన్ని లారెన్ గాటెలిబ్, మూడో స్థానాన్ని సోనాలి, సమంత్‌లు కలసి చేజిక్కించుకున్నారు.
ఇంతకీ ద్రష్టిదామి ఎవరంటే... మధుబాల సీరియల్ ద్వారా టాప్ స్ధాయికి ఎదిగిన టెలివిజన్ స్టార్. ఆమె తన డాన్సింగ్ ఫెరఫార్మెన్స్ తో ఆడియన్స్ కి విందు చేసింది. ఈ సందర్భంగా ద్రష్టిదామి మాట్లాడుతూ అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం తన తల్లి ఇక్కడ లేరని, తన తల్లికి మరింత కృతజ్ఞతలు తెలిపారు. ఈ షోకు న్యాయ నిర్ణేతలుగా కరణ్‌జొహార్, మాధురీ దీక్షిత్, రియోడిసౌజాలు వ్యవహరించారు.

ఝలక్ దిక్లా జా - 6' పోగ్రాం మంచి రేటింగ్స్ తో దూసుకుపోతోంది. దాంతో యాడ్స్ వాళ్లూ ఎగబడుతున్నారు. ముఖ్యంగా ఈ పోగ్రాంకి హాజరయ్యే సెలబ్రెటీలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. అంతేకాకుండా ఈ స్టేజీపై సినిమా ప్రమోషన్స్ సైతం జరుగుతున్నాయి. త్వరలో విడుదల కానున్న 'క్రిష్ 3' సినిమాకు ప్రచార కార్యక్రమం సందర్భంగా మాధురి, హృతిక్ తాజాగా ఒకే వేదికపై కలిసి నృత్యం చేశారు. 'కలర్స్' చానల్‌లో ప్రసారమయ్యే 'ఝలక్ దిక్లా జా 6' టీవీ షో సందర్భంగా 'క్రిష్ 3' ప్రచార కార్యక్రమాన్ని మాధురి, హృతిక్ సందడిగా నిర్వహించారు.
ఈ సందర్భంగా 'మిషన్ కాశ్మీర్', 'రాజా' సినిమాల్లో అత్యంత జనాదరణ పొందిన పాటలకు వీరిద్దరూ స్టేజిపై కలిసి 'స్టెప్పులు' వేయడం అభిమానుల్లో కోలాహలం సృష్టించింది. మాధురి నటన అన్నా, ప్రత్యేకించి ఆమె నవ్వు అన్నా తాను ఇష్టపడతానని హృతిక్ ఎంతో ఉద్వేగంతో చెప్పాడు. బాలీవుడ్‌లో మాధురి 'ఆదర్శవంతమైన మహిళ' అని కూడా కితాబిచ్చాడు. విలక్షణమైన చిరునవ్వుతో అందరినీ కట్టిపడేసే మాధురీ దీక్షిత్ అంటే తనకు చిన్నప్పటి నుంచి ఎంతో ఇష్టమని బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ తన మనసులోని మాటను బయట పెట్టాడు.


Click it and Unblock the Notifications











