బట్టల్లేకుండా తిరగడమేంటి? కంటెస్టెంట్ల మధ్య గొడవ.. ‘బిగ్ బాస్’ హౌస్‌లో మరో రచ్చ

'బిగ్ బాస్' సీజన్ - 3 ప్రారంభం నుంచే హాట్ హాట్‌గా సాగుతోంది. మొదటి వారం నుంచే కంటెస్టెంట్ల మధ్య వాగ్వాదాలు, ఏడ్పులు, రాజకీయాలు స్టార్ట్ అవడంతో ఈ రియాలిటీ షో ఆసక్తికరంగా సాగుతోంది. దీనికితోడు, మొదటి వారంలో హేమ ఎలిమినేషన్ అయిపోయిన తర్వాత నుంచి సరికొత్త పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దీనికి కారణం ఆరోజే ఇంటిలోకి ప్రవేశించిన తమన్నా సింహాద్రి. ఈమె ఇంట్లోకి వచ్చిన వెంటనే వరుణ్, వితికలను టార్గెట్ చేయడంతో పాటు కొన్ని సరదా సంఘటనలను కూడా సృష్టిస్తోంది. వివరాల్లోకి వెళ్తే...

మహేశ్‌కు మద్దతు

మహేశ్‌కు మద్దతు

తమన్నా వచ్చిన వెంటనే మహేశ్ విట్టాకు మద్దతుగా మాట్లాడింది. ఇక హౌస్‌లో మహేష్ విట్టాతో వరుణ్, వితికాలు వ్యవహరించిన తీరు తనకు నచ్చలేదని.. అసలు మహేష్ వాళ్లకు సారీ చెప్పాల్సిన అవసరం లేదన్నారు తమన్నా. నేను హౌస్‌లో వరుణ్ సందేశ్ ఆడుకుందామని వచ్చానని.. అతని ప్రవర్తన తనకు నచ్చలేదన్నారు తమన్నా.

వాళ్లిద్దరిని విడగొడతానని

వాళ్లిద్దరిని విడగొడతానని

వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ‘బిగ్ బాస్' హౌస్‌లోకి వచ్చిన తమన్నా సింహాద్రి.. వరుణ్ సందేశ్, వితిక షేరును నామినేట్ చేసింది. వీళ్లిద్దరి తీరు తనకు నచ్చలేదని తెలిపింది. అలాగే, తామంతా ఒంటరిగా ఉంటే వాళ్లిద్దరూ మాత్రం కలిసి ఉన్నారని, ఎలాగైనా విడదీయాలనే లక్ష్యంతో వీళ్లను నామినేట్ చేస్తున్నానని ఆమె చెప్పింది.

అలీ రెజాతో గొడవ

అలీ రెజాతో గొడవ

అప్పుడే స్నానం చేసి, టవల్ కట్టుకుని వస్తున్న అలీ రేజాను తమన్నా ఒక ఆట ఆడుకుంది. హౌస్‌లో ఈ ఎక్స్‌పోజింగ్ ఏంటి అంటూ ప్రశ్నించింది. ‘నువ్వు అలా విప్పుకొని తిరిగితే కుదరదు' అంటూ ఫైర్ అయింది. అయితే, దీన్ని లైట్‌గానే తీసుకున్న అలీ.. నా డ్రెస్ గురించి మీరు ఎందుకు అడుగుతున్నారు..? మీ డ్రెస్ ల గురించి నేనేం మాట్లాడలేదు కదా అంటూ సమాధానమిచ్చాడు. దీంతో ఈ గొడవకు పుల్‌స్టాప్ పడింది.

రవికృష్ణకు ఇరిటేషన్

రవికృష్ణకు ఇరిటేషన్

తమన్నా హౌస్‌లో రవికృష్ణతో చాలా క్లోజ్‌గా ఉండడానికి ప్రయత్నిస్తుంది. ఇంట్లోకి ఎంటరైనప్పటి నుంచి అతడిని పండు పండు అంటూ వెంట పడుతోంది. సైకిల్ టాస్క్ సమయంలో కూడా ఇదే జరగడంతో రవికృష్ణ అసహనం వ్యక్తం చేశాడు. దీంతో తమన్నా అతడి నుంచి దూరంగా వెళ్లిపోయింది.

హౌస్‌మేట్స్‌కు వార్నింగ్

హౌస్‌మేట్స్‌కు వార్నింగ్

లంచ్ చేసిన తర్వాత తమన్నా ప్లేట్ కడగలేదని ఎవరో అనడంతో.. రోహిణి వచ్చి ఆమెను అడిగింది. దీంతో తమన్నా ఒక్కసారిగా ఫైర్ అయింది. ‘నేను బౌల్‌లో తిన్నాను.. అది కడిగేశాను. నన్ను అంటే బాగోదు. ఫ్యామిలీలుగా ఏర్పడి అనడమేంటి?' అని వరుణ్, వితికలను ఉద్దేశ్యించి సీరియస్ అయింది. దీంతో అందరూ షాక్ అయ్యారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X