Guppedantha Manasu April 15th: మను తండ్రి మహేంద్రే.. అందరి ముందు రివీల్.. ఏమైందంటే?

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ రోజురోజుకూ అద్భుతంగా సాగుతోంది. ముఖ్యంగా ఈ రోజుటి ఎపిసోడ్ లో వసుధార పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ లో ఓ విద్యార్థిని లేపి ఎందుకు అటెండెన్స్ తగ్గిందని అనగా కాలేజీకి రావట్లేదని చెబుతాడు. ఎందుకు రావట్లేదంటూ ఎంతకూ సమాధానం చెప్పకపోగా.. వాళ్ల తల్లిదండ్రులు ఎవరని అంటారు. వెంనటే ఆ విద్యార్థి తల్లి లేచి నిలబడి చెడు సావాసాలు చేస్తున్నాడని.. ఎంత చెప్పిన తమ మాట వినట్లేదని చెబుతున్నాడని అంటుంది. మీరు కూర్చోండని చెప్పి.. నువ్వు రాకపోతే ఇక నుంచి నాకే నేరుగా ఫోన్ వస్తుందని వసు అంటుంది. మీరు కచ్చితంగా రావాలని అంటుంది.

ఇక ఆ తర్వాత మరో విద్యార్థిని లేపి ఎందుకు అటెండెన్స్ తగ్గిందని అనగా.. నాకు ఇంట్రెస్ట్ రావట్లేదని అంటాడు. అలా అయితే కాలేజీలో ఎందుకు జాయిన్ అయ్యావు.. ఇప్పుడలాగే అనిపిస్తుందని.. భవిష్యుత్తులో జీవితం అంతా వేరేలా ఉంటుందని అంటుంది. ఆ తర్వాత మహేంద్ర, ఫణీంద్రలు కూడా కాలేజీకి రావలని సక్సెస్ లో ఉన్న ఎంజాయ్ ఇంకేదీ ఇవ్వదని అంటారు. అవసరం ఉన్న వాళ్లకి సాయం చేయడం, డబ్బు సంపదించడం బాగా కిక్ ఇస్తాయని.. వాటిని అస్సలే మిస్ కావొద్దని అంటారు. ఆ తర్వాత మరికొంత మంది విద్యార్థులను లేపి మాట్లాడతారు. అప్పుడే మను ఓ విద్యార్థి గురించి మాట్లాడుతూ.. ఉంటాడు.

DRS Big Plan to Defame Vasu and Manu on Guppedantha Manasu April 15th 2024 Episode 1050

ముఖ్యంగా ఆర్థికంగా ఇబ్బంది ఉందని తన కొడుకును పనికి తీసుకు వెళ్తున్నట్లు చెప్పగా.. తండ్రి అనే వాడు చాలా బాధ్యతగా ఉండాలని.. మీ సమస్యలకు పిల్లలను ఇబ్బంది పెట్టకూడదని అంటారు. అంతలోనే అతడి తండ్రి లేచి తండ్రి బాధ్యతల గురించి బాగా చెప్పారని.. మీ తండ్రి గురించి చెప్పండంటూ అడుగుతాడో విద్యార్థి తండ్రి. మను సైలెంట్ అయిపోగా.. పదే పదే గుచ్చి గుచ్చి అడుగుతాడు. డీఆర్ఎస్ ప్లాన్ ప్రకారమే అంతా అతడి తండ్రి గురించి చెప్పాలని అంటారు. మీ తండ్రి గురించి మీకు తెలియదా అనగా శైలేంద్ర తెలియదని దానికి మీరింత రచ్చ చేయాల్సిన అవసరం లేదని అంటాడు. ఆతర్వాత దేవయాని మాట్లాడుతూ.. తండ్రి గురించి తెలియకపోవడం మన తప్పు కాదని అంటుంది.

కేవలం తండ్రి ఎవరో తెలీదా, తల్లి కూడా ఎవరో తెలియదా అంటూ అడుగుతాడు. అప్పుడే ఒకామె అనుపమ గారే మను తల్లి అని చెప్పగా.. ఆవిడకు కూడా మన తండ్రి ఎవరో తెలియదా అని అంటాడు. మను ఫైర్ అయి కొట్టేందుకు రాగా.. వసు ఆపుతుంది. ఎవరు, ఏంటని ప్రశ్నిస్తుంది. అంతలోనే అతడి తండ్రి ఎవరో చెప్పి తీరాలని అంతా గొడవ చేయగా.. మను నాకు తండ్రి లేడని గట్టిగా చెప్పబోతాడు. అప్పుడే మహేంద్ర లేచి మనుకు తండ్రి ఉన్నాడని అంటాడు. ఆ తండ్రి ఉన్నాడు, ఉన్నాడు అంటూ గట్టి గట్టిగా రిపీట్ చేస్తాడు. అంతా అతడిని ఆశ్చర్యంగా చూడగా.. నేనే మను తండ్రిని అని రివీల్ చేస్తాడు.

మహేంద్ర అలా చెప్పగానే అంతా షాకింగ్ గా చూస్తారు. ముఖ్యంగా అనుపమ కన్నీళ్లు పెట్టుకుంటూ చూడగా.. అందరికీ వినపడిందా మళ్లీ చెప్పాలా అంటాడు. మనుయే నా కొడుకు అని మరింత గట్టిగా అరుస్తాడు. ఆల్ ఆర్ క్లియర్.. అని అనగా.. మధ్యలో ఒకతను లేచి మరి ఇంతకాలం ఎందుకు చెప్పలేదని అనబోతుండగా... మీకు పర్సనల్ డీటెయిల్స్ అన్నీ అవరం లేదని అంటాడు. ఇక మీరంతా వెళ్లిపోండని చెబుతాడు. మీటింగ్ అయిపోయిందని వివరించగా.. ఫణీంద్ర ఏమైందని అంటాడు. పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ అయిపోయిందని.. అంతా వెళ్లాలని వివరిస్తారు. ఇక ఆ తర్వాత ఫణీంద్ర అదేంటి మహేంద్ర అలా చేశావంటాడు.

DRS Big Plan to Defame Vasu and Manu on Guppedantha Manasu April 15th 2024 Episode 1050

అంతలోనే దేవయాని కల్గజేసుకుని కొంపలు ముంచే పని చేస్తే ఇంత కూల్ గా మాట్లాడతారేంటని అంటుంది. అప్పుడే మహేంద్ర నేను ఎవరి కొంపలు కూల్చలేదని అంటాడు. మను నీ కొడుకు ఏంటని అనగా.. అదే నిజం అని మహేంద్ర అంటాడు. ఇంతకు మించి ఇంక దీని గురించి మాట్లాడొద్దంటూ చెప్పుకొస్తాడు. అంతలోనే దేవయాని మన కుటుంబం పరువు తీశారని అనగా.. ఫణీంద్ర ఆపే ప్రయత్నం చేస్తాడు. దీని మీదే మన కుటుంబం పరువు ఆధారపడి ఉందని.. దేవయాని మరింత ఫైర్ అవుతుంది. ఇది నేను కావాలనే చేశానంటూ మహేంద్ర చెప్పగా.. మీ తమ్ముడి చేసిన ఘనకార్యం గురించి అడగరేంటని దేవయాని తన భర్తపై ఫైర్ అవుతుంది.

ఆరోజు డ్రింక్ చేసి ఉంటే.. ఏదో రెండు మాటలు అనగానే ఇంట్లోంచి వెళ్లిపోయాడని.. నన్ను ఆడిపోసుకున్నారని కదా అంటుంది. చూడు మీ అన్నయ్య మొహం ఎలా అయిపోయిందో.. ఆయన ఇంతలా బాధ పడడం నేనిప్పుడే చూస్తున్నానంటూ వివరిస్తుంది. ఫణీంద్ర కూడా.. అనుపమ నీ స్నేహితురాలే కదా అని అడుగుతాడు. అలాగే మను తన కొడుకే కదా.. మరి నువ్వెలా తండ్రివి అవుతావంటూ అడుగుతాడు. ఇంతటితో సీరియల్ అయిపోతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X