twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తప్పతాగి నడిరోడ్డుపై టీవీ నటి రచ్చ.. డ్రంక్ డ్రైవ్‌లో పోలీసులపై దాడి.. అరెస్ట్‌కు రంగం సిద్ధం

    |

    టెలివిజన్ నటి, మోడల్ రుషీ సింగ్ చట్టపరమైన కేసుల్లో కూరుకుపోయింది. తప్పతాగి వాహనం డ్రైవింగ్ చేయడమే కాకుండా పోలీసు అధికారిపై చేయి చేసుకోవడంతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. ఈ ఘటన ముంబైలోని ఖార్ ప్రాంతంలో సోమవారం తెల్లవారు జామున జరిగింది. దీంతో మద్యం సేవించి వాహనం నడుపుతూ చట్టవ్యతిరేకంగా వ్యవహరించే సెలబ్రిటీల తీరు మరోసారి చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళితే..

    తెల్లవారు జామున రోడ్డు మీద

    తెల్లవారు జామున రోడ్డు మీద

    ముంబై పోలీసులు వెల్లడించిన ప్రకారం.. ఖార్ రోడ్డులో డ్రంక్ డ్రైవ్ నిర్వహిస్తుండగా సోమవారం తెల్లవారు జామున 2 గంటల ప్రాంతంలో తన స్నేహితులు రాహుల్, స్వాప్నిల్‌తో కలిసి ఫుల్లుగా మద్యం సేవించిన రుహీ సింగ్ వాహనం నడుపుకుంటూ వచ్చింది. లింక్ రోడ్డులోని ఫుడ్ కోర్టులో తినడానికి కారు ఆపారు. కానీ అప్పటికీ మూసి ఉండటంతో ఫుడ్ ఇవ్వడానికి సిబ్బంది నిరాకరించారు.

     ఫుడ్ స్టోర్ సిబ్బందిపై దుర్బాషలు

    ఫుడ్ స్టోర్ సిబ్బందిపై దుర్బాషలు

    తమకు ఫుడ్ ఇవ్వడానికి నిరాకరించిన స్టోర్ యజమాని, సిబ్బందిని నానా దుర్బాషలాడారు. గొడవ పెరిగి పెద్దది కావడంతో వారు పోలీసు కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేశారు. దాంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని గొడవను సద్దుమణిచే ప్రయత్నం చేశారు. దాంతో వారు రెచ్చిపోయి పోలీసుల టీమ్‌‌పై దాడి చేశారు. మమల్ని గాయపరిచారు అని పోలీసులు తెలిపారు.

     ఫుల్లుగా తప్పతాగి రోడ్డుపై విచ్చలవిడిగా

    ఫుల్లుగా తప్పతాగి రోడ్డుపై విచ్చలవిడిగా

    పోలీసులపై దాడి తర్వాత రూహీ వేగంగా, దురుసుగా కారును నడిపేందుకు ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో ఐదు కార్లను గుద్దేసింది. ఆమెను శాంతాక్రజ్ పోలీసులు అదుపులోకి తీసుకొని వారి నుంచి మెడికల్ శాంపిల్స్ తీసుకొన్నారు. అనంతరం ఆమెపై కేసులు నమోదు చేసి అక్కడి నుంచి పంపించారు. ఆమె నుంచి రక్తపు నమూనాలను తీసుకొన్నాం. మెడికల్ రిపోర్టుల వచ్చిన తర్వాత ఆమెపై చర్య తీసుకొంటాం అని పోలీసులు వెల్లడించారు.

    రూహీపై పలు సెక్షన్లతో కేసు నమోదు

    రూహీపై పలు సెక్షన్లతో కేసు నమోదు

    రూహీ సింగ్‌పై శాంతక్రజ్ పోలీసులు పల కేసులు పెట్టారు. ఆమెపై ఐపీసీ సెక్షన్ 323, సెక్షన్ 332, సెక్షన్ 504, సెక్షన్ 510, సెక్షన్ 34 కింద కేసు నమోదు చేశారు. మద్యం సేవించి వాహనం నడిపినందున మోటార్ వెహికిల్ చట్టం ప్రకారం సెక్షన్ 279 కింద కేసు ఫైల్ చేశాం అని శాంతాక్రజ్ పోలీస్ అధికారి మనోజ్ కుమార్ శర్మ మీడియాకు తెలిపారు. త్వరలోనే ఆమెను అరెస్ట్ చేస్తామని వెల్లడించారు.

     రూహీ సింగ్ స్నేహితుల అరెస్ట్

    రూహీ సింగ్ స్నేహితుల అరెస్ట్

    షాపు యజమానిపై దాడి కేసులో వారి ఫిర్యాదు మేరకు రూహీ సింగ్ స్నేహితులు రాహుల్, స్వాప్నిల్‌ను అరెస్ట్ చేశాం. అర్ధరాత్రి మహిళలను అరెస్ట్ చేయరాదనే నిబంధన లోబడి రూహీని వదలిపెట్టాం. ఆమెను అరెస్ట్ చేయడానికి మెడికల్ రిపోర్టుల ఆధారంగా అధికారుల అనుమతి తీసుకొంటామని రూహీ పేర్కొన్నారు.

    English summary
    TV actress and model Ruhi Singh was booked for allegedly misbehaving with police officers and driving under the influence of alcohol in two separate incidents that occurred early on Monday early morning. While Khar Police have arrested Ruhi's friends, Rahul Singh and Swapnil Singh for assaulting police officers, Ruhi is yet to be arrested.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X