Brahmamudi October 6th: స్వప్న అబార్షన్ డ్రామా... ఇంట్లోంచి వెళ్లిపోయిన కావ్య..
బ్రహ్మముడి సీరియల్ లో ఈరోజు ఎపిసోడ్ లో రాజ్ డాక్యూమెంట్స్ ఇవ్వడంతో... కావ్య తల్లిందండ్రులు ఎమోషనల్ అవుతారు. ఇక కల్యాణ్ ఇది ఎమోషనల్ అయ్యే టైం కాదు.. డ్యాన్స్ చేద్దాం అంటాడు. ఇక కల్యాణ్ డ్యాన్స్ చేస్తాను అని స్టేజ్ మీద చెప్పగానే అందరూ చప్పట్లు కొడతారు. అప్పుతో కలిసి డ్యాన్స్ అని చెప్తాడు. ఇక అప్పు కూడా డ్యాన్స్ వేసేందుకు వస్తుండగా.. అనామిక బ్రో నేను వేస్తాను అని చెప్తుంది. ఇక అప్పు వెనక్కి వెళ్తుంది. కల్యాణ్ రా అప్పు అంటే... మీ జంట బాగుంది మీరు వేయండి అని చెప్తుంది. ఇక స్టేజ్ పైన కల్యాణ్, అనామిక డ్యాన్స్ వేస్తారు.
ఇక ఆ తర్వాత రుద్రాణి కూడా డ్యాన్స్ వేస్తుంది. ఆ డ్యాన్స్ చూసి అందరూ షాక్ అవుతారు. నెక్ట్స్ కల్యాణ్ తల్లిందండ్రులు కూడా డ్యాన్స్ వేసి అలరిస్తారు. ఇక కనకం, కృష్ణమూర్తి కూడా డ్యాన్స్ వేసి.. అందరినీ ఆశ్చర్యపరుస్తారు. పుష్ప సినిమాలోని అమ్మి అమ్మి సాంగ్ కు సీతారామయ్య, ఇందిరాదేవి కలిసి స్టేప్పులు వేస్తారు. అది చూసిన ఇంట్లో వాళ్లంతా అవాక్ అవుతారు. రాజ్, కావ్య ఫెర్మామెన్స్ వచ్చేసరికి ఇద్దరు కలిసి స్టేజ్ మీదకు వెళ్తారు.

నువ్వు నాకు నచ్చావ్ లోని ఒక్కసారి చెప్పాలేవా నువ్వు నచ్చావని అనే పాటకు ఇద్దరు కలిసి డ్యాన్స్ చేస్తారు. అయితే డ్యాన్స్ లో భాగంగా కావ్య రాజ్ కు ముద్దు పెడుతుంది. అది చూసి ఇంట్లో వాళ్లంతా షాక్ అవుతారు. ఇక అపర్ణ మాత్రం కోపంతో ఉంటుంది. ఇక ఇంట్లో వాళ్లంతా చప్పట్లు కొడతారు. ఇక ఆ తర్వాత దుగ్గిరాల వారసులు రాహుల్, కల్యాణ్, కల్యాణ్ వచ్చి డ్యాన్స్ లు చేస్తారు. ఇక కావ్య, స్వప్న, అనామిక కూడా వచ్చి డ్యాన్స్ చేస్తారు.
స్వప్న డ్యాన్స్ చేస్తుండగా... తన పొట్టకు పెట్టుకునే ప్యాడ్ ఊడిపోతుంది. అలానే డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. ఇక కావ్య గమనించి... దాన్ని ఎవరి కంట పడకుండా.. స్వప్నను పక్కకు తీసుకువెళ్లి ప్యాడ్ గురించి మాట్లాడుతుంది. ఈ నాటక ఆడటం ఆపేయమని చెప్తుంది. కాసేపు అక్క చెల్లెల్ల మధ్య మళ్లీ పంచాయితీ పెట్టుకుంటారు. ఇక కావ్యను స్వప్న బెదిరిస్తుంది. ఈ మోసంలో నువ్వు కూడా భాగం అయ్యావు అంటుంది. దీంతో కావ్య ఇంట్లో వాళ్లకి చెప్తాను అని చెబుతుంది. వద్దు అని మళ్లీ బతిమిలాడుతుంది స్వప్న.

స్వప్న మళ్లీ ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తుంది. ఇక ఎంత కాలం అక్క... ఎప్పుడు మారుతావ్.. నిజంగా ఎప్పుడు బతుకుతావ్ అంటూ కావ్య మాట్లాడుతుంది. కట్టుకున్నవాడిని, కన్నవాళ్లని మొసం చేశావ్ అంటుంది కావ్య. త్వరలోనే ఈ నాటకానికి తెర వేస్తాను అని స్వప్న మాట ఇస్తుంది. ఇక ఇదే చివరి అవకాశం అని చెప్తుంది కావ్య. ఇక కావ్య వెళ్లి పోయాక... స్వప్న ఆలోచిస్తూ ఉంటుంది. ఈ కడుపు వల్లే కదా ఈ సమస్యలు.. అబార్షన్ అయినట్లు ఇంట్లోవాళ్లను నమ్మిస్తే బాగుంటుందని ఆలోచిస్తుంది.

ఇక అందరూ ఇంట్లో భోజనాలు చేస్తూ ఉంటారు. ఇక స్వప్న వచ్చి నాకు ఒక ఆకు వేయండని అపర్ణతో అంటుంది. కింద కూర్చొని తీనకూడదు పక్కకు వెళ్లు అంటుంది. ఇక సీరియస్ గా వెళ్తుంది. కల్యాణ్ కవిత చెప్పబోతుంటే.. అందరూ వద్దు అంటారు. ఇక అప్పు కోసం కనకం బయటకు వెళ్తుంది. ఇక ఎపిసోడ్ ముగుస్తుంది. తదుపరి ఎపిసోడ్ లో... రాజ్ రాసిన చీటీని చదివి కన్నిటీ పర్యాంతం అవుతుంది కావ్య. ఇక ఒంటరిగా ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోతుంది. రాజ్ ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ వస్తుంది. కావ్య లేదని ఇంట్లో వాళ్లంతా కంగారు పడుతారు. ఏం జరిగిందో తెలియాలంటే రేపటి ఎపోసోడ్ వరకు ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











