Brahmamudi july 19th:కావ్య ప్లాన్​ సూపర్​.రాజ్‌కు దొరక్కుండా భలే తప్పించుకుందిగా..కానీ అడ్డంగా బుక్కైన స్వ‌ప్న

బ్రహ్మముడి సిీరియల్ రోజురోజుకు ఇంట్రెస్టింగ్ గా మారుతోంది. రాజ్.. కావ్య మధ్యలో ప్రేమ చిగురుస్తుండటంతో.. ఇప్పుడిప్పుడే అసలు కథలోకి ఈ సీరియల్ అడుగుపెడుతోంది. ఇక ఈరోజు తాజా ఎపిసోడ్‌లో స్వప్న మరో పెంట పని చేస్తుంది. దీంతో ఇంట్లో మళ్లీ పంచాయితీ జరుగుతుంది. అయితే ఈసారి రుద్రాణి కూడా స్వప్నపై ఫైర్ అవుతుంది. మరోవైపు రాజ్... కావ్య వేసిన డిజైన్స్ బయట పెట్టాలని ప్రయత్నం చేస్తూంటాడు. ఇక ఈ రోజు పూర్తి ఎపిసోడ్‌ వివరాల్లోకి వెళితే...

శృతికి రాజ్ ఫోన్...:ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలో కావ్య గీసిన డిజైన్స్.. లాప్ టాప్ లో ఉన్న డిజైన్స్ చెక్ చేసుకుంటాడు రాజ్. అవి ఇవి ఒకటే అని నిర్ధారించుకొని శృతికి ఫోన్ చేసి ఫ్రీ లాన్సర్ డిజైనర్ పేరు చెప్పమని అడుగుతాడు. కంగారుపడుతూ శిరీష అని చెప్తుంది శృతి. ఫోన్ పెట్టేసిన రాజ్ శృతి అబద్ధం చెప్తుందని అర్థం చేసుకుంటాడు. ఎలాగైనా నిజం బయట పెడతాను అనుకుంటాడు. మరోవైపు టీబీ అంటువ్యాధి అనుకొని తనకోసం సపరేట్గా గ్లాసు కంచం తెచ్చుకుంటుంది అన్నపూర్ణ. అప్పు.. పెద్ద క్లాస్ ఇచ్చి.. అన్నపూర్ణకు అన్నం తిసిపిస్తుంది.

Duggirala Family Fires on Swapna For Her Behaviour in July 19th 2023 Episode number 152 in Brahmamudi Telugu Serial

కావ్య డిజైన్స్ చూసి రాజ్ షాక్..:మరోవైపు నిద్రపోతున్న రాజ్ కి మెలకువ వచ్చేసరికి పక్కన కావ్య లేకపోవడంతో డిజైన్స్ వేయడానికి వెళ్లి ఉంటుంది.. ఎలాగైన పట్టుకోవాలి అని సడన్ గా కావ్య దగ్గరికి వెళ్లి ఏం చేస్తున్నావ్ అని ఆ పేపర్స్ తీసుకుంటాడు. అందులో ఏమీ లేకపోవడంతో ఏం చేస్తున్నావ్ అని అడుగుతాడు. మీరు ఎవరు డిజైర్ ని పొగుడుతున్నారు కదా అందుకే నాకు కోపం వచ్చింది నేను కూడా డిజైన్స్ గీయడానికి కూర్చున్నాను అంటుంది కావ్య. అయితే గీయు ఇక్కడే ఉంటాను అంటాడు రాజ్. మంచి డిజైన్ చేస్తే దొరికిపోతానని పిచ్చి డిజైన్ గీసి రాజ్ చేతిలో పెడుతుంది కావ్య. రాజ్.. కావ్య కావాలనే పిచ్చి డిజైన్ గీసింది అని అర్థం చేసుకుంటాడు. రాజ్ అక్కడ నుంచి వెళ్లిపోయిన తర్వాత కావ్య డిజైన్స్ గీయడం ప్రారంభిస్తుంది.

Duggirala Family Fires on Swapna For Her Behaviour in July 19th 2023 Episode number 152 in Brahmamudi Telugu Serial

స్వప్న పంచాయితీ...:కట్ చేస్తే... ఉదయాన్నే ఎక్సర్సైజులు చేస్తూ ఉంటుంది స్వప్న. ఇదేంటి ఒలంపిక్స్ కి ప్రిపేర్ అవుతున్నట్లు ఇంత ఓవర్ చేస్తుంది అంటుంది రుద్రాణి. నేనే చెప్పాను మమ్మీ కడుపుతో ఉన్నవాళ్లు ఇలా చేయకూడదని కూడా తనకి తెలియదేమో. ఇప్పుడు అందరూ చూసి తనని అసహ్యించుకుంటారు అంటాడు రాహుల్. స్కిప్పింగ్ చేస్తున్న స్వప్నని చూసి షాక్ అవుతుంది కావ్య. అందరి ముందు దొరికిపోతుంది అని కంగారుపడుతూ స్వప్న దగ్గరికి వస్తుంది. అంతలోనే సీతారామయ్య-ఇందిరాదేవి వాళ్ళు బయటినుంచి వచ్చి స్వప్న చేసిన పనికి షాక్ అవుతారు అలా చేయకూడదని తెలియదా అంటూ కోప్పడుతుంది ఇందిరాదేవి. ఆ హడావుడికి ఇంట్లో వాళ్ళందరూ బయటకు వస్తారు.

Duggirala Family Fires on Swapna For Her Behaviour in July 19th 2023 Episode number 152 in Brahmamudi Telugu Serial

రాజ్ ఫైర్...:స్వప్న అసలు కడుపుతో ఉన్నట్లే ప్రవర్తించడం లేదు అంటాడు ప్రకాష్. కావ్య కూడా స్వప్నని మందలిస్తుంది. పరిస్థితిని అర్థం చేసుకున్న స్వప్న ఇలా చేయకూడదని నాకు తెలియదు అని సారీ చెప్పి ఇంట్లోకి వెళ్ళిపోతుంటే రుద్రాణి ఆపి వాళ్ళ పుట్టింటి వాళ్ళని పిలవండి లేదంటే ఇది చేసిన పిచ్చి పనులకి ఆ కడుపు పోతే మళ్ళీ అంటారు అంటుంది.ఆ మాటలు విన్న రాజ్ రుద్రాణిని కోప్పడతాడు. అలా ఏ అత్తింటివారైనా చేస్తారా అని నిలదీస్తాడు. మరి ఏం చేయమంటావు ఇది ఎప్పుడు ఏదో ఒక తింగరి పనిచేసే నెత్తి మీదకి తీసుకొస్తుంది అంటుంది రుద్రాణి. తను అలా చేయకుండా చూడవలసిన బాధ్యత మన అందరిదీ.. ముఖ్యంగా అత్తగారిగా భర్తగా మీ ఇద్దరి మీద ఆ బాధ్యత మరింత ఎక్కువగా ఉంటుంది అని రుద్రాణికి, రాహుల్ కి చెప్తాడు రాజ్.

Duggirala Family Fires on Swapna For Her Behaviour in July 19th 2023 Episode number 152 in Brahmamudi Telugu Serial

కావ్య దొరికిపోనుందా...:తరువాయి భాగంలో శృతి తీసుకొచ్చిన డిజైన్స్ చూసి డిజైన్ చాలా బాగుంది నేను ఆ డిజైనర్ని అప్రిషియేట్ చేస్తాను ఫోన్ చేయ్ అంటాడు రాజ్. కంగారు పడుతూనే శృతి కావ్య కి ఫోన్ చేస్తుంది. శిరీష నిన్ను సార్ అప్రిషియేట్ చేస్తారంట అంటుంది శృతి. శృతి మాటలను బట్టి రాజ్ అక్కడ ఉన్నాడని అర్థం చేసుకుంటుంది కావ్య. శృతి దగ్గర నుంచి ఫోన్ తీసుకున్న రాజ్ శిరీష గారు కంగ్రాట్స్ అని వెటకారంగా చెప్తాడు. కంగారుపడుతుంది కావ్య. ఇదండీ ఈరోజు ఎపిసోడ్ రేపటి ఎపిసోడ్ తో మళ్లీ కలుద్దాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X