బిగ్‌బాస్‌లో వరల్డ్ ఫేమస్ లవర్‌, అర్జున్‌రెడ్డి, పెదరాయుడు హంగామా, అభిజిత్, లాస్య, అఖిల్ అలా..

సండే ఫన్‌డే కావడంతో డమ్ చరేడ్ ఆటను ఆడించారు. ఇంటి సభ్యుల్లో ఒకరిని పిలిచి ఒక చీటిని తీసి అందులో ఉండే సినిమా పేరును సైగల ద్వారా మరో వ్యక్తికి తెలిపితే వారు ఆ సినిమా పేరును చెప్పాలి. మొదట అఖిల్ వచ్చి ఊహలు గుసగుసలాడే పోస్టర్‌ను చూపించి అవినాష్‌కు సైగల ద్వారా చెప్పారు. దానికి సమాధానంగా ఊహలు గుసగుసలాడే అంటూ అవినాష్ చెప్పారు. ఇక ఇంటిలో అలాంటి వ్యక్తి ఎవరంటే సుజాత అని చెప్పారు. అయితే బిగ్‌బాస్ అభిప్రాయం ప్రకారం కూడా సుజాతే అని కన్ఫర్మ్ అయింది. అందుకు సాక్ష్యంగా ఓ ఫోటోను డిజైన్ చేసి పెట్టారు.

అభిజిత్ వరల్డ్ ఫేమస్ లవర్‌గా

అభిజిత్ వరల్డ్ ఫేమస్ లవర్‌గా

సోహైల్ వచ్చి హారికకు తన సైగల ద్వారా ఓ సినిమా పేరు చెప్పడంతో హారిక కరెక్టుగా ఊహించి వరల్డ్ ఫేమస్ లవర్ అని చెప్పింది. అంత త్వరగా, ఎలా గుర్తు పట్టావని నాగార్జున అడిగారు. ఇంటిలో వరల్డ్ ఫేమస్ లవర్ ఎవరు అంటే అందరూ అభిజిత్ పేరు చెప్పారు. బిగ్‌బాస్ అంచనాల ప్రకారం కూడా అభిజిత్ వరల్డ్ ఫేమస్ లవర్‌గా గుర్తింపు పొందారు. బిగ్‌బాస్ వేసిన పోస్టర్ అందర్నీ నవ్వించింది. అయితే వరల్డ్ ఫేమస్ లవర్ నాకు సరిపోతుందంటూ అవినాస్ అనడంతో అందరూ నవ్వారు.

ఇంటిలో హ్యాపీ బర్త్ డే సెలబ్రేషన్స్

ఇంటిలో హ్యాపీ బర్త్ డే సెలబ్రేషన్స్

ఇక వెంటనే అభిజిత్ అంటూ సీరియస్‌గా పిలిచాడు. దాంతో అభిజిత్ కంగారు పడటంతో.. నీవు ఇంట్లో విషయాలను దాస్తున్నావు.. నీ విషయాలు బట్టబయలు చేస్తాను అంటూ నాగ్ అనే సరికి అభిజిత్ షాక్ అయ్యారు. అంతలోనే హ్యాపీ బర్త్ డే అంటూ నాగ్ చెప్పడంతో ఇంటి సభ్యులందరూ అభిజిత్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

నోయల్ శంకర్ దాదా ఎంబీబీఎస్‌గా

నోయల్ శంకర్ దాదా ఎంబీబీఎస్‌గా

మోనాల్ వచ్చి చీట్టి తీయగా అందులో శంకర్ దాదా ఎంబీబీఎస్ టైటిల్ వచ్చింది. అమ్మా రాజశేఖర్‌కు సైగల్ చేసి చూపిస్తే.. సినిమా పేరును కరెక్టుగా చెప్పారు. దాంతో ఇంటి సభ్యుల్లో శంకర్ దాదా ఎంబీబీఎస్ ఎవరు అంటే నోయల్ అని చెప్పారు. నోయల్‌కు ఆ టైటిల్ ఎందుకు అనగా.. ఎవరైనా బాధలో ఉంటే.. ఒక కౌగిలి ఇచ్చి వారిని శాంత పరుస్తుంటాడు. అందుకే ఆయనను శంకర్ దాదా అంటూ ఇంటి సభ్యులందరూ చెప్పారు.

హిగ్గింగ్ డాక్టర్.. ఏదైనా సరే హగ్‌తోనే

హిగ్గింగ్ డాక్టర్.. ఏదైనా సరే హగ్‌తోనే

నోయల్‌కు హగ్గింగ్ డాక్టర్ అంటారు. ఏది ఏమైనా అందరికి ఓ హగ్ ఇస్తాడు. అంతా హగ్ తోనే మొదలవుతుంది అంటూ అమ్మా రాజశేఖర్ చెప్పారు. బిగ్‌బాస్ వేసిన పోస్టర్ కూడా నోయల్‌దే కావడం గమనార్హం. ఇక ఇంటి సభ్యుడు మెహబూబ్‌తో కలిసి నోయల్ శంకర్ దాదా ఎంబీబీఎస్ పాటకు డ్యాన్స్ చేశారు.

అఖిల్ అర్జున్ రెడ్డిగా

అఖిల్ అర్జున్ రెడ్డిగా

అలాగే హరిక వచ్చి చిట్టి తీయగా అర్జున్ రెడ్డి వచ్చింది. హారిక చేసిన సైగలను సుజాత వెంటనే పసిగట్టి సినిమా టైటిల్‌ను చెప్పింది. దాంతో అంత త్వరగా ఎలా చెప్పావు అంటే అర్జున్ రెడ్డిని గుర్తు పట్టడం ఈజీ అంటూ అన్నారు. ఇంటిలో అర్జున్ రెడ్డి టైటిల్ అఖిల్ సరిపోతుందని ఇంటి సభ్యులు వెల్లడించారు. బిగ్‌బాస్‌ కూడా అర్జున్ రెడ్డి టైటిల్‌ను అఖిల్‌కే ఇవ్వడం గమనార్హం. ఆ తర్వాత అర్జున్ రెడ్డి సినిమాలోని డైలాగ్‌ను చెప్పి అందరూ ఆకట్టుకొన్నారు.

Recommended Video

Birthday Wishes For The Bollywood Legend From Tollywood Stars
ఇంటిల్లో పంచాయితీలు తీర్చే లాస్య

ఇంటిల్లో పంచాయితీలు తీర్చే లాస్య

చివర్లో కుమార్ సాయి వచ్చి ఒక చిట్టి తీశాడు. అందులో పెద రాయుడు టైటిల్ ఉంది. కుమార్ సాయి సైగలను అర్ధం సైగలను చేసుకోలేకపోయాడు. ఆ తర్వాత పెద రాయుడు అంటూ అందరూ చెప్పడంతో కరెక్ట్ అంటూ నాగ్ అన్నారు. ఇంటిలో పెద రాయుడు టైటిల్ ఎవరికి సరిపోతుందంటే.. అందరూ ఏకగ్రీవంగా యాంకర్ లాస్య అంటూ చెప్పారు. పెదరాయుడు టైటిల్ లాస్కకే ఎందుకని నాగ్ అడిగితే.. ఇంట్లో పెద్దరికం ఆమెదే. ఏదైనా సమస్య ఉంటే ఇంటికి పెద్దగా సమస్యలను పరిష్కరిస్తుంటుందని చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X