‘ఈగ’ రేటింగ్ అదిరింది : రాజమౌళి

'టీఆర్పీ రేటింగుల్లో ఈగ 3వ స్థానం దక్కించుకుంది. 22 పాయింట్లతో 'మగధీర' 1వ స్థానంలో, 19 పాయింట్లతో 'రోబో' 2వ స్థానంలో, 18 పాయింట్లతో 'ఈగ' 3వ స్థానంలో నిలిచింది. ఫస్ట్ టెలికాస్ట్‌లోనే ఈగ చిత్రానికి 3వ స్థానం దక్కడం ఆనందంగా ఉంది' అంటూ రాజమౌళి తన ట్విట్టర్లో ట్వీట్ చేసాడు.
ఈగ చిత్రానికి రాజమౌళి దర్శకత్వం వహించగా....వారాహి చలన చిత్రం పతాకంపై సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో సాయి కొర్రపాటి నిర్మించారు. భారీ సాంకేతిక విలువలతో రూపొందిన ఈచిత్రం బాక్సాఫీసు వద్ద మంచి ఫలితాలు సాధించింది. ముఖ్యంగా గ్రాఫిక్స్ పరంగా మంచి టాక్ తెచ్చుకుంది.
రాజమౌళి విషయానికొస్తే...ఈగ చిత్రం తర్వాత రాజమౌళి ప్రభాస్ తో భారీ చిత్రానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. గతంలో ఛత్రపతి చిత్రంతో ప్రభాస్‌కు భారీ విజయాన్ని అందించిన రాజమౌళి ఈ సారి సరికొత్త కోణంలో యంగ్ రెబల్ స్టార్‌ను చూపెట్టబోతున్నారు. హై ఓల్టేజ్ తో కూడాని యాక్షన్, ఎంటర్ టైన్మెంట్, డ్రామాతో కూడిన ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్టు వర్క్ ఇప్పటికే పూర్తయింది. మూవీ లవర్స్‌కి ఈచిత్రం ద్వారా సరికొత్త అనుభూతి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.


Click it and Unblock the Notifications











