Eesha Rebba: పెళ్లి కాకుండా తల్లైన హీరోయిన్.. తొందరపడ్డప్పుడే ఆ పని.. ఇంతకీ పిల్లలకు తండ్రి ఎవరంటే!
తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పుడు కొందరు లోకల్ అమ్మాయిలు మాత్రమే హీరోయిన్లుగా సందడి చేస్తున్నారు. అందులో క్యూట్ లేడీ ఈషా రెబ్బా ఒకరు. చాలా కాలం క్రితమే హీరోయిన్‌గా పరిచయమైన ఈ చిన్నది.. కెరీర్‌ను మాత్రం ఆశించిన రీతిలో ముందుకు తీసుకు వెళ్లడం లేదు. కానీ, అడపాదడపా ఆఫర్లను అందుకుని ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ షోలో పాల్గొన్న ఈషా రెబ్బా.. తనకు ఇద్దరు పిల్లలు పుట్టారని చెప్పి షాకిచ్చింది. ఇంతకీ ఏం జరిగింది? దానికి సంబంధించిన పూర్తి వివరాలను మీరే చూసేయండి!
సరికొత్తగా వస్తున్న సుమ అడ్డా:సుమ యాంకర్‌గా చేస్తోన్న షోలలో క్యాష్ చాలా ప్రత్యేకం అనే చెప్పాలి. జబర్ధస్త్, ఎక్స్‌స్ట్రా జబర్ధస్త్ తర్వాత అంతటి ప్రేక్షకాదరణను అందుకుంటోన్న షో ఇది. పేరుకు గేమ్ షోనే అయినా కామెడీ ప్రధానంగా రన్ అయింది. ఫలితంగా ఇది సక్సెస్‌ఫుల్‌గా నడిచింది. అలాంటిది ఈ షోను ఇటీవలే నిలిపేసి.. దీని స్థానంలో 'సుమ అడ్డా' అనే షోతో సుమ సరికొత్తగా సందడి చేసేస్తోంది.

సుమ షోలోకి మాయా జబర్:వచ్చే శనివారం ప్రసారం కాబోతున్న 'సుమ అడ్డా' ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఇందులో 'మాయా జబార్ ఫర్ సేల్' అనే వెబ్ సిరీస్‌లో నటించిన ఈషా రెబ్బా, రవి వర్మ, జెస్సీ, గౌతమి చల్లగుళ్లలు గెస్టులుగా వచ్చారు. వీళ్లతో కలిసి సుమ తెగ సందడి చేసింది. ముఖ్యంగా ఈ సెలెబ్రిటీలతో కలిసి ఆమె కొన్ని ఆటలు ఆడి ఆడియెన్స్‌కు మజా పంచింది.
దేహమే దేవాలయం అంటూ:'సుమ అడ్డా' షోలోకి వచ్చిన గౌతమి చల్లగుళ్ల చెప్పులు లేకుండానే కనిపించారు. దీంతో యాంకర్ సుమ 'చెప్పులు ఎందుకు వేసుకోలేదు' అని ప్రశ్నించింది. దీనికామె 'దేహమే దేవాలయం' అంటూ పంచ్ వేసింది. ఆ తర్వాత సుమ 'అవునండీ చెప్పులేనా? బంగారం కూడానా' అనగా.. గౌతమి 'నా మనసే బంగారం' అంటూ మరో కౌంటర్ వేయడంతో షాకైంది.

జెస్సీకి పెళ్లి చూపులు పెట్టేసి:'సుమ అడ్డా' షోలో భాగంగా కంటెంస్టెంట్‌గా వచ్చిన జస్వంత్ పడాల అలియాస్ జెస్సీకి సుమ పెళ్లి చూపులు ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా అక్కడ ఉన్న కొందరు లేడీ స్టూడెంట్లను పిలిచి వాళ్ల టాలెంట్లకు పరీక్ష పెట్టింది. ఇదంతా ఎంతో ఫన్నీగా సాగింది. ఇక, ఈ స్కిట్ చివర్లో జెస్సీ 'కొట్టేస్తాను మిమ్మల్ని' అంటూ బొమ్మరిల్లులో జయసుధ డైలాగ్‌ను ఇమిటేట్ చేశాడు.

పుల్లటివి.. తొందరపడ్డప్పుడు:ఆ తర్వాత 'సుమ అడ్డా' షోలో సుమ ఓ బొమ్మ ఆవును తీసుకొచ్చి మా ఆవుకు ఒంట్లో బాలేదు అని చెప్పింది. దీంతో డాక్టర్‌లా వచ్చిన ఓ అమ్మాయి 'కంగ్రాట్స్ మీరు అమ్మమ్మ కాబోతున్నారు' అనేసింది. దీంతో సుమ ఆ ఆవును పుల్లటివి ఏమైనా తింటావా అని ప్రశ్నించి నవ్వించింది. అనంతరం ఆమె 'తొందరగా పెళ్లి చేసుకోవాలని ఎప్పుడు అనిపిస్తుంది' అని ఓ క్వశ్చన్ అడగ్గా.. ఈషా రెబ్బా 'తొందరపడ్డప్పుడు' అంటూ షాకింగ్ ఆన్సర్ ఇచ్చింది.

నాకు ఇద్దరు పిల్లలున్నారు:'సుమ అడ్డా' షోలో అందరి ప్రేమల గురించి అడిగిన సుమ.. చివర్లో 'ఈషా ఇప్పుడు నీ ప్రేమ గురించి చెప్పు' అని ప్రశ్నించింది. దీనికి ఈషా రెబ్బా 'వాస్తవానికి నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు' అని బాంబ్ పేల్చింది. దీంతో సుమ 'వాళ్ల నాన్న ఎక్కడ ఉంటారు' అని అడిగింది. దీనికి ఈషా చెప్పిన ఆన్సర్లను సస్పెన్స్‌గా ఉంచారు. దీంతో ఈ ప్రోమో వైరల్ అవుతోంది.
ఈషా కెరీర్ సాగుతుందిలా:ఈషా రెబ్బా ప్రధాన పాత్రలో నటించిన 'మాయా బజార్ ఫర్ సేల్' వెబ్ సిరీస్ జూలై 14 నుంచి జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. దీనికి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. అలాగే ఈ చిన్నది సుధీర్ బాబు 'మామా మశ్చీంద్రా'తో పాటు తమిళంలో 'ఆయిరామ్ జన్మంగళ్' అనే మూవీ చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతోంది. వీటితో పాటు 'దయా' అనే మరో సిరీస్‌లో కూడా నటించింది.


Click it and Unblock the Notifications











