బిగ్ బాస్ లీక్: వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఇంట్లోకి అడుగుపెట్టనున్న తెలుగు హీరోయిన్.. అందుకే అలా..

Recommended Video

Bigg Boss Telugu 3 : Eesha Rebba To Enter In Bigg Boss House || Filmibeat Telugu

బిగ్గెస్ట్ తెలుగు రియాలిటీ షో 'బిగ్ బాస్'.. మూడు గొడవలు.. నాలుగు ఫైటింగులుగా సాగుతోంది. గత రెండు సీజన్లతో పోల్చుకుంటే ఇందులో కంటెస్టెంట్ల మధ్య సమన్వయం కుదరడం లేదు. దీంతో తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీంతో సీజన్ -3లో ఎన్నో కొత్త కొత్త సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అదే సమయంలో రొమాన్స్, లవ్, ఏడుపులు సహా పలు ఎమోషన్స్ కూడా కనిపిస్తున్నాయి. దీంతో బిగ్ బాస్ షో ఆసక్తికరంగా సాగుతోంది. తాజాగా ఈ షో గురించి ఓ సెన్సేషనల్ న్యూస్ బయటకు వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే...

ఈ వారం జాబితాలో ఏడుగురు

ఈ వారం జాబితాలో ఏడుగురు

ఈ వారం నామినేషన్ విషయానికి వస్తే.. ఈ సారి జాబితాలో ఏడుగురు ఉన్నారు. పునర్నవి, శివజ్యోతి, హిమజ, అషు రెడ్డి, రాహుల్‌, బాబా భాస్కర్, మహేశ్ విట్టాలు ఎలిమినేట్ అవడానికి నామినేట్ అయిన విషయం తెలిసిందే. వీరిలో నుంచి ఎవరు బిగ్ బాస్ హౌస్‌ను వదిలి వెళ్లిపోతారు అన్నది ఆసక్తికరంగా మారింది. వీరిలో ఎక్కువ మంది నామినేట్ చేసిన రాహుల్ ఎలిమినేట్ అవుతాడని బాగా ప్రచారం జరుగుతోంది.

వైల్డ్ కార్డ్ ఎంట్రీ

వైల్డ్ కార్డ్ ఎంట్రీ

బిగ్ బాస్ హౌస్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ అనే విధానం ఉంటుందన్న విషయం తెలిసిందే. గత రెండు సీజన్లలో ఇద్దరేసి సభ్యులు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా షో మధ్యలో ఇంటిలోకి ప్రవేశించారు. ఈ సీజన్‌లో కూడా మొదటి వారం పూర్తయిన తర్వాతనే వైల్డ్ కార్డ్ ఎంట్రీ జరిగింది. ఫస్ట్ వీక్‌లో సీనియర్ నటి హేమ ఎలిమినేట్ అవగా.. అదే రోజు ట్రాన్స్‌జెండర్ తమన్నా సింహాద్రి ఇంటిలోకి ఎంటర్ అయింది.

మరో వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా...

మరో వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా...

ఎంతో రసవత్తరంగా సాగుతున్న బిగ్ బాస్ సీజన్ - 3లో శనివారంతో ఐదు వారాలు ముగుస్తాయి. ఇప్పటికే హేమ, జాఫర్, తమన్నా సింహాద్రి, రోహిణి ఎలిమినేట్ అయిపోయారు. ఈ వారం కూడా మరొకరు వెళ్లిపోతారు. ఏడుగురు సభ్యులు ఈ వారం నామినేట్ అయ్యారు. వారిలో ఎవరు వెళ్తారో తెలియదు కానీ, ఈ వారం ఒకరిని వైల్డ్ కార్డ్ ద్వారా ఇంట్లోకి పంపించబోతున్నారని తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది.

వెళ్లేది తెలుగు హీరోయిన్ అంటున్నారు

వెళ్లేది తెలుగు హీరోయిన్ అంటున్నారు

తెలుగు సినీ ఇండస్ట్రీలో లోకల్ హీరోయిన్లు కనిపించడం చాలా అరుదు. అప్పట్లో ఇక్కడి వాళ్లనే హీరోయిన్లుగా తీసుకున్న సినీ నిర్మాతలు.. ఇప్పుడు మాత్రం వేరే ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. దీంతో తెలుగు హీరోయిన్లు కనిపించడమే లేదు. ఇలాంటి పరిస్థితుల్లో సైతం పోటీని తట్టుకుని నెట్టుకు వస్తున్న ఈషా రెబ్బానే ఈ వారం బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంటర్ అవబోతుందని సమాచారం. అందుకే ఆమె ఈ మధ్య ఫొటో షూట్లు చేస్తుందంటూ ప్రచారం జరుగుతోంది.
ఏదో అనుకుంటే ఇంకేదో జరిగింది

ఏదో అనుకుంటే ఇంకేదో జరిగింది

‘అంతకు ముందు ఆ తర్వాత' సినిమాతో సినీరంగ ప్రవేశం చేసిన ఈషా రెబ్బ.. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసినా అవకాశాలను అందిపుచ్చుకోవడంలో సక్సెస్ కాలేకపోతోంది. అందం, టాలెంట్ ఉన్నా అవకాశాలు దొరకడం లేదు ఈ హాట్ బ్యూటీకి. ఆ మధ్య జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘అరవింద సమేత.. వీరరాఘవ'లో అవకాశం వచ్చినా.. ఆ పాత్రకు అంతగా ప్రాధాన్యత లేకపోవడంతో ఆమె ఫ్యాన్స్ నిరాశ పడ్డారు.

రాగల 24 గంటల్లో అంటూ...

రాగల 24 గంటల్లో అంటూ...

ఆ తర్వాత సుమంత్ సరసన ‘సుబ్రహ్మణ్యంపురం'లో చేసినా ఇది కూడా ఆమెను గట్టెక్కించలేకపోయింది. దీని తర్వాత మాత్రం సీనియర్ దర్శకుడు శ్రీనివాస్‌రెడ్డి సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది. లేడీ ఓరియెంటెడ్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘రాగల 24 గంటల్లో' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ‘అదిరిందయ్యా చంద్రం', ‘టాటా బిర్లా మధ్యలో లైలా', ‘ఢమరుకం' వంటి చిత్రాలను తెరకెక్కించిన శ్రీనివాస్‌రెడ్డి దర్శకత్వంలో, శ్రీనవ్‌హాస్‌ క్రియేషన్స్‌ పతాకంపై శ్రీ కార్తికేయ సెల్యులాయిడ్స్‌ సమర్పణలో ఈ సినిమా వస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X