బిగ్ బాస్ కంటెస్టెంట్‌పై కేసు పెట్టిన పోలీసులు

తమిళ బిగ్ బాస్ రియాలిటీ షో 3వ సీజన్లో పాల్గొంటున్న కొందరు కంటెస్టెంట్లు కేవలం హౌస్‌లో మాత్రమే కాదు... బయటకు వచ్చిన తర్వాత కూడా పలు వివాదాలతో హాట్ టాపిక్ అవుతున్నారు. కొన్ని రోజుల క్రితం షో నుంచి ఎలిమినేట్ అయిన మీరా మిథున్ వ్యవహారం ముందు నుంచీ వివాదాస్పదమే. ఆమెపై చీటింగ్ ఆరోపణలు కూడా ఉన్నట్లుగా తమిళ మీడియాలో గతంలో వార్తలు వచ్చాయి.

తాజాగా జో మైఖేల్ అనే వ్యక్తి మీడియాకెక్కి మీరా మిథున్‌పై ఆరోపణలు చేశారు. అతడి కంప్లయింట్ ఆధారంగా చెన్నై ఎగ్మూరు పోలీసులు రెండు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సమాచారం. అసభ్యపదజాలం ఉపయోగించి మాట్లాడటం, ప్రాణహాని బెదిరింపుల నేపథ్యంలో ఈ కేసు నమోదైనట్లు తెలుస్తోంది. మీరా మిథున్ తనతో పాటు తన ఫ్యామిలీపై దాడి చేసేందుకు ప్లాన్ చేసినట్లు మైఖేల్ ఆరోపించారు.

Egmore police registered a case on Bigg Boss Tamil 3 contestant

మీరా మిథున్‌పై గతంలోనూ వివాదాలు ఉన్నాయి. 2016లో మిస్ ఇండియా సౌత్ కిరీటం దక్కించున్న ఆమె దాన్ని దుర్వినియగం చేయడంతో నిర్వాహకులు వెనక్కి తీసుకున్నారు. మీరా తనను మోసం చేసినట్లు ఓ డిజైనర్ గతంలో కేసు పెట్టారు. అంతే కాదు ఆమె మనీలాండరింగ్‌కు పాల్పడినట్లుగా కూడా ఆరోపణలు చేశారు.

మీరా 2017లో '8 తొట్టక్కాయ్' సినిమా ద్వారా నటిగా కెరీర్ ప్రారంభించారు. బిగ్ బాస్ షో ద్వారా మరింత పాపులారిటీ పెంచుకోవడానికి ప్రయత్నించారు కానీ తన కోరిక తీరకుండానే షో నుంచి మధ్యలోనే ఎలిమినేట్ అయ్యారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X