Bigg Boss Nominations: 9వ వారంలో 8 మంది నామినేట్.. ఆ ముగ్గురికి ఓట్లు పడ్డా సేఫే.. అదే అసలు ట్విస్ట్

పాశ్చత్య సంస్కృతికి అద్దం పట్టే కథతో వస్తూ.. బుల్లితెరపై ఉన్న సరిహద్దులను చెరిపేసిన షోనే బిగ్ బాస్. ముఖ్యంగా తెలుగులో అంతకు ముందెన్నడూ కనిపించని కాన్సెప్టుతో వచ్చినా.. దీనికి ప్రేక్షకులు ఆదరణను అందించారు. ఫలితంగా ఈ షో వరుసగా సీజన్ల మీద సీజన్లను పూర్తి చేసుకుంటూ వెళ్తోంది.

ఇలా ఇప్పుడు నిర్వహకులు ఏడో దాన్ని విజయవంతంగా నడుపుతున్నారు. ఇప్పటికే ఎనిమిది వారాలను పూర్తి చేసుకున్న ఈ సీజన్.. తొమ్మిదో వారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ వారం నామినేషన్స్ ప్రక్రియ ఎలా జరిగింది? అనే వివరాలను చూద్దాం పదండి!

Eight Contestants Nominated in Bigg Boss Telugu 7 Ninth Week

అన్నింటికి మించే కంటెంట్: బిగ్ బాస్ ఆరో సీజన్ చప్పగా సాగడంతో ఏడో దాన్ని నిర్వహకులు పట్టుదలగా తీసుకున్నారు. దీన్ని సక్సెస్ చేయడానికి ఉల్టా పుల్టా అనే కాన్సెప్టుతో ప్రసారం చేస్తున్నారు. అందుకు తగ్గట్లుగానే ఈ సీజన్‌లో ఊహకే అందని కొత్త కంటెంట్‌ను చూపిస్తున్నారు. దీంలో ప్రేక్షకులకు మజాను అందిస్తూ భారీ స్థాయిలో రెస్పాన్స్‌ను రాబడుతున్నారు. ఇలా ఇది సక్సెస్‌ఫుల్‌గా సాగుతోంది.

ఎలిమినేట్ అయింది వీళ్లేగా: ఏడో సీజన్‌లోకి 14 మంది కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇచ్చారు. వీరి నుంచి మొదటి వారం కిరణ్ రాథోడ్, రెండో వారంలో షకీలా, మూడో వారం దామిని, నాలుగో వారం రతికా రోజ్, ఐదో వారంలో శుభశ్రీ రాయగురులు వెళ్లిపోయారు. ఆ తర్వాత మరో ఐదుగురు అడుగు పెట్టారు. ఈ క్రమంలోనే ఆరో వారంలో నయని పావని, ఏడో వారంలో పూజా మూర్తి, ఎనిమిదో వారంలో సందీప్ వెళ్లారు.

నామినేషన్ కోసం పాముతో: బిగ్ బాస్ ఏడో సీజన్‌లో ప్రతి టాస్కునూ కొత్తగా ఆలోచించి పెడుతున్నారు. అత్యంత ముఖ్యమైన నామినేషన్స్ టాస్కులో కొత్తదనం చూపిస్తున్నారు. ఇందులో భాగంగానే 9వ వారం జరగబోయే నామినేషన్స్ ప్రక్రియను పాముతో డిజైన్ చేశారు. ప్రతి కంటెస్టెంట్ తాను నామినేట్ చేయాలనుకున్న ఇద్దరిని స్నేక్ ముందు నిల్చోబెట్టి.. అందుకు తగ్గట్లుగా కారణాలను చెప్పాల్సి ఉంటుంది.

వాళ్ల మధ్య పెద్ద గొడవలు: బిగ్ బాస్ షో మొత్తంలో నామినేషన్స్ టాస్కే ఎంతో ప్రాధాన్యమైనది అని తెలిసిందే. అందుకే ఈ టాస్కు జరుగుతున్న సమయంలో గొడవలు కనిపిస్తుంటాయి. ముఖ్యంగా తొమ్మిదో వారం నామినేషన్స్‌లో అశ్వినీ - ప్రిన్స్ యావర్, ప్రశాంత్ - అమర్‌దీప్, రతికా రోజ్ - శోభా శెట్టిల మధ్య పెద్ద గొడవలు జరిగినట్లు తెలిసింది. మిగిలిన వాళ్లు కూడా వాదనలకు దిగారని తెలుస్తోంది.

నామినేషన్స్‌లో 8 మంది: బిగ్ బాస్ ఏడో సీజన్‌లోని తొమ్మిదో వారానికి సంబంధించి జరిగిన నామినేషన్స్ ప్రక్రియ ఇప్పటికే ముగిసింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఇందులో మొత్తం ఎనిమిది మంది కంటెస్టెంట్లు నామినేట్ అయ్యారని తెలిసింది. అందులో ప్రిన్స్ యావర్, ప్రియాంక, అమర్‌దీప్ చౌదరి, శోభా శెట్టి, అంబటి అర్జున్, రతికా రోజ్, టేస్టీ తేజ, భోలే షావలిలు ఉన్నారని సమాచారం.

Eight Contestants Nominated in Bigg Boss Telugu 7 Ninth Week

ఆ ముగ్గురికి ఓట్లు పడినా: బుల్లితెర వర్గాల ద్వారా అందుతోన్న మరో సమాచారం ప్రకారం.. ఏడో సీజన్‌లోని తొమ్మిదో వారానికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియలో శివాజి, పల్లవి ప్రశాంత్, అశ్వినీ శ్రీలకు కూడా తలో ఒక ఓటు పడినట్లు తెలిసింది. కానీ, బిగ్ బాస్ ఒక్క ఓటు పడిన వాళ్లను పరిగణలోకి తీసుకోలేట. అందుకే ఈ ముగ్గురినీ ముగ్గురు నామినేట్ చేసినా సేఫ్ చేశారనే టాక్ వినిపిస్తోంది.

Eight Contestants Nominated in Bigg Boss Telugu 7 Ninth Week

ఎక్కువ ఓట్లు ఆ ఇద్దరికే: బిగ్ బాస్ ఏడో సీజన్ తొమ్మిదో వారానికి సంబంధించిన నామినేషన్స్ టాస్కులో ఎక్కువ ఓట్లు శోభా శెట్టి, అమర్‌దీప్‌కు పడినట్లు ఓ న్యూస్ వైరల్ అవుతోంది. గత వారంలో గ్రూప్ గేమ్ ఆడడంతో పాటు ఓవర్ చేసిన శోభా శెట్టిని ఏకంగా ఐదుగురు నామినేట్ చేశారని సమాచారం. అలాగే, అమర్‌దీప్‌ చౌదరిని నలుగురు ఇంటి సభ్యులు నామినేట్ చేశారని తెలిసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X