Bigg Boss Telugu 8: షోలోకి 8 మంది మాజీ కంటెస్టెంట్లు.. కన్ఫార్మ్ అయిన వాళ్లు ఎవరంటే!

బుల్లితెర చరిత్రలోనే ఎన్నో రకాల కార్యక్రమాలు ప్రసారం అయ్యాయి. కానీ అందులో కొన్ని మాత్రమే బీభత్సమైన స్పందనను అందుకుని సంచలనంగా మారాయి. అలాంటి వాటిలో బిగ్ బాస్ ఒకటి. ఇండియాలో సూపర్ హిట్ అయిన ఇది.. తెలుగులోకి ఆలస్యంగా వచ్చింది. అయితేనేం ఇక్కడ ఎవరూ ఊహించని రీతిలో సక్సెస్‌ను సొంతం చేసుకుంది. దీంతో నిర్వహకులు వరుసగా సీజన్లను తీసుకు వస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఎనిమిదో దాన్ని ప్లాన్ చేశారు. ఇందులోకి మాజీ కంటెస్టెంట్లు కూడా వస్తున్నారని తాజాగా తెలిసింది. ఆ సంగతులు మీరే చూసేయండి!

రికార్డు రేటింగ్‌తో టాప్‌లో
తెలుగు బుల్లితెరపై అంతకు ముందెన్నడూ ప్రసారం కాని కాన్సెప్టుతో వచ్చినా బిగ్ బాస్ ఇక్కడ భారీ రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంది. దీంతో నిర్వహకులు వరుసగా సీజన్ల మీద సీజన్లను పూర్తి చేస్తున్నారు. ఇలా ఇప్పటికే ఒక ఓటీటీ, ఏడు రెగ్యూలర్ సీజన్లను పూర్తి చేశారు. వీటన్నింటికి రికార్డు స్థాయిలో రేటింగ్ కూడా వచ్చింది. దీంతో తెలుగు బిగ్ బాస్ దేశంలోనే టాప్ షోగా మారింది.

Eight Ex Contestants Likely Entry To Bigg Boss Telugu 8 Show

ఎనిమిదో సీజన్ కాన్సెప్ట్

బిగ్ బాస్ షోలో మొదటి నుంచీ వచ్చిన సీజన్లను ఒకే రకమైన కంటెంట్‌తో తీసుకు వచ్చారు. ఫలితంగా ఆరో సీజన్ నుంచి దీనికి రేటింగ్ డౌన్ అయింది. దీంతో ఏడో సీజన్‌ను ఉల్టా పుల్టా కాన్సెప్టుతో తీసుకు వచ్చి సక్సెస్ చేసుకున్నారు. ఇదే ఊపులో ఇప్పుడు ఎనిమిదో సీజన్ కోసం 'అంతులేని వినోదం' అనే కాన్సెప్ట్ తీసుకు వస్తున్నారు. దీంతో దీనిపై అంచనాలు ఏర్పడ్డాయి.

ఆరోజే.. అన్నీ కంప్లీట్‌గా
బిగ్ బాస్ ఎనిమిదో సీజన్‌ను మరింత ముందుగానే తీసుకు రావాలని ప్లాన్ చేశారు. కానీ, ఇది సెప్టెంబర్ 1వ తేదీ నుంచే ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రోమోలు కూడా విడుదల అయ్యాయి. సెట్ వర్క్ కూడా దాదాపుగా కంప్లీట్ అయిపోయింది. ప్రస్తుతం మాత్రం అత్యంత ముఖ్యమైన కంటెస్టెంట్ల ఎంపికపై తుది కసరత్తు జరుగుతున్నట్లు టాక్ వినిపిస్తోంది.

14 మంది.. వీళ్లనంటూ

బిగ్ బాస్ ఎనిమిదో సీజన్‌పై అంచనాలు క్రమంగా పెరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇందులో పాల్గొనే కంటెస్టెంట్ల పేర్లు కూడా బయటకు వస్తున్నాయి. మొత్తంగా తొలి రోజు ఇందులోకి 14 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇవ్వబోతున్నారట. అందులో జబర్ధస్త్ పవిత్ర, నిఖిల్, బేబక్క, విష్ణుప్రియ, ఆదిత్య ఓం, నాగ మణికంఠ, శేఖర్ బాషా, నైనిక తదితరులు ఉన్నారని తెలిసింది.

మాజీ కంటెస్టెంట్లు రాక
ఎన్నో అంచనాల నడుమ ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ ఎనిమిదో సీజన్‌కు సంబంధించి కంటెస్టెంట్ల ఎంపికలో వైవిధ్యాన్ని చూపించబోతున్నట్లు తెలుస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి ఇందులోకి మాజీ కంటెస్టెంట్లను తీసుకు వస్తున్నారట. గతంలో జరిగిన ఎనిమిది సీజన్లు (ఓటీటీతో కలిపి) నుంచి ఎనిమిది మంది మాజీ కంటెస్టెంట్లను తీసుకు వస్తున్నారని సమాచారం.

కన్ఫార్మ్ అయింది వీళ్లే

బిగ్ బాస్ ఎనిమిదో సీజన్‌కు సంబంధించి ఇప్పటి వరకూ మాజీ కంటెస్టెంట్లలో చాలా మందితో నిర్వహకులు చర్చలు జరిపినట్లు తాజాగా తెలిసింది. అందులో ఓటీటీ సీజన్‌లో పాల్గొన్న యాంకర్ శివ, ఏడో సీజన్ కంటెస్టెంట్ శోభా శెట్టి, ఫస్ట్ సీజన్ నుంచి హరితేజ, మూడో సీజన్ నుంచి పునర్నవి ఇప్పటికే కన్ఫార్మ్ అయినట్లు ఓ న్యూస్ బుల్లితెర వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X