twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వారి సినిమాలపై ఈసీ నిషేధం

    By Srikanya
    |

    లక్నో: ఎలక్షన్స్ లో ఏ అంశాలు ప్రజలను ప్రబావితం చేస్తాయో...వాటిపై ఈసీ ఓ కన్నేస్తూ ఉంటుంది. తాజాగా వారి దృష్టి సినిమా వారిపై పడింది. వారు సినిమాల ద్వారా ఎలక్షన్స్ లో పబ్లిసిటీ యాంగిల్ లో లబ్ది పొందే అవకాసం ఉంది. దాంతో ప్రస్తుత ఎన్నికల్లో పోటీ చేస్తున్న సినీతారలు నటించిన సినిమాలను దూరదర్శన్‌లో ప్రసారం చేయడాన్ని ఎన్నికల సంఘం నిషేధించింది.

    ఈ మేరకు ఉత్తరప్రదేశ్‌ ముఖ్య ఎన్నికల అధికారి ఉమేశ్‌ సిన్హా.. 'ఎన్నికల కోడ్‌ అమలవుతున్న కాలంలో.. లోక్‌సభ బరిలో ఉన్న నటుల సినిమాలను దూరదర్శన్‌లో ప్రసారం చేయడాన్ని ఈసీ నిషేధించింది' అని చెప్పారు. కాగా సినిమా హాళ్లలో ప్రదర్శనలు, ప్రైవేటు టీవీ ఛానళ్లలో వాటిని ప్రసారం చేయడంపై మాత్రం నిషేధం విధించలేదన్నారు.

    వీటిల్లో ఎలక్షన్స్ లో నిలబడ్డ హేమమాలిని, జయప్రధ, నగ్మా, స్మృతి ఇరాని, జావేద్ జాఫ్రి చిత్రాలు ఉన్నాయి. మరి తెలుగు నుంచి ఎవరెవరుపై ఈ బ్యాన్ పెట్టారో, లేక పెట్టనున్నారో చూడాలి.

    Election Commission bars films of actors contesting polls

    మరో ప్రక్క నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీనుల కాంబినేషన్ లో రూపొందిన "లెజెండ్'' చిత్రానికి ఇలాంటి సమస్య ఎదురైంది. ఈ చిత్రం షోలు ఆపేయండని అనంతపురం కలెక్టరకు వినతి పత్రం అందచేసారు. వైఎస్ ఆర్ సీపీ లీగల్ సెల్ జిల్లా కన్వీనర్ నారాయణ రెడ్డి, కో ఆర్డినేటర్ ఆదినారాయణ కలెక్టర్ లోకేషన్ కుమార్ ని కలిసి వినతిపత్రం అందచేసారు.

    ఆ సినిమా హీరో బాలకృష్ణను తెలుగుదేశం పార్టీ హిందూపురం అసెంబ్లీ అభ్యర్దిగా ప్రకటించిన నేపధ్యంలో ఓటర్లు ప్రభావితం అయ్యే ప్రమాదం ఉందని అన్నారు. అలాగే లెజండ్ సినిమా టీడీపి కి అనుకూలంగా ఉందని, అందులో డైలాగులు ఆ పార్టికి ప్రచారం చేకూర్చేలా ఉన్నాయని చెప్పారు. సీమాంధ్ర, తెలంగాణాలో ఎన్నికలు పూర్తయ్యే వరకూ ఆ సినిమా ప్రదర్శనను నిలిపివేయాలని కోరారు. దీనికి జిల్లా కలెక్టర్ స్పందిస్తూ...తెలుగుదేశం అభ్యర్ది బాలకృష్ణ అని తమకు బీ ఫాం అందాక ఈ కంప్లైంట్ ని పరిశీలిస్తామని అన్నారు.

    English summary
    Election Commission has banned telecast of movies of actors on Doordarshan, who are contesting Lok Sabha polls. “According to the EC directive, during the period of implementation of model code of conduct, the films of actors contesting polls should not be telecast on Doordarshan”, CEO Uttar Pradesh Umesh Sinha said.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X