Bigg Boss Voting : టికెట్ టూ ఫినాలే దెబ్బ.. లాస్ట్ డే మారిపోయిన ఓటింగ్, ఎలిమినేట్ ఎవరంటే?
బిగ్‌బాస్ తెలుగు 8లో 13వ వారం మరికొద్దిగంటల్లో ముగియనుంది. ఇక మరో రెండు వారాల్లో బిగ్‌బాస్ తెలుగు 8 సీజన్‌కి ఎండ్ కార్డ్ పడనుంది. దీంతో ఈ సీజన్ విజేతగా ఎవరు నిలుస్తారోనని ప్రేక్షకుల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో టికెట్ టూ ఫినాలే టాస్కుల ద్వారా ఫైనలిస్టులను ఎంపిక చేసే పనికి శ్రీకారం చుట్టారు బిగ్‌బాస్. గత కంటెస్టెంట్స్‌ని హౌస్‌లోకి పంపించి వారితో టాస్కులు ఆడిస్తున్నారు . అయితే 13వ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరు? సోషల్ మీడియాలో జరుగుతున్న ఓటింగ్‌లో ఎవరు టాప్‌లో ఉన్నారు? ఎవరు డేంజర్ జోన్‌లో ఉన్నారో చూస్తే:
టికెట్ టూ ఫినాలే టాస్క్‌లలో ఇప్పటికే నిఖిల్, రోహిణి, అవినాష్‌లు ఫినాలే కంటెండర్స్ అయ్యారు. అయితే విష్ణుప్రియ, నబీల్, ప్రేరణలకు బ్లాక్ బ్యాడ్జ్‌లు రావడంతో ఈ ముగ్గురిని రేస్ నుంచి తప్పించారు బిగ్‌బాస్. కానీ గౌతమ్, పృథ్వీ, టేస్టీ తేజాలకు అసలు బ్లాక్ బ్యాడ్జ్‌లే రాకపోవడంతో ఈ ముగ్గురిలో ఒకరికి ఫినాలే కంటెండర్ అయ్యే ఛాన్స్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఈ ముగ్గురిలో ఒకరిని కంటెండర్‌గా ఎంపిక చేయాలని నిఖిల్, రోహిణి, అవినాష్‌లకు చెప్పాడు. దీంతో వారు ముగ్గురు కలిసి టేస్టీ తేజాను నాలుగో కంటెండర్‌గా ఎంపిక చేశారు. అయితే టేస్టీ తేజాని కంటెండర్‌గా ఎంపిక చేయడాన్ని పృథ్వీ తప్పుబట్టాడు.

టికెట్ టూ ఫినాలే టాస్క్‌ను ఆడించడానికి యాంకర్ శ్రీముఖి హౌస్‌లో అడుగుపెట్టారు. ముందు వేరేవాళ్లకి పెట్టి తింటావ్.. కానీ అప్పుడప్పుడు మన కోసం కూడా ఉంచుకోవాలని రావడం రావడంతోనే విష్ణుప్రియకి క్లాస్ పీకింది. అందరి ముందు కాదని ఏకంగా ఓ రూంలోకి తీసుకెళ్లి మరి తన ఫీలింగ్స్‌ని కంట్రోల్ చేసుకోమని చెప్పింది శ్రీముఖి. అందిరినీ ఎంకరేజ్ చేయ్.. ఒక్క పర్సన్ వద్ద ఆగిపోవద్దని సూచించింది. అంతా వినేసిన తర్వాత ఓ నవ్వు నవ్వి విష్ణుప్రియ ఊరుకుందే కానీ, శ్రీముఖి చెప్పిన విషయాన్ని మాత్రం పట్టించుకోలేదు.
ఇకపోతే.. 13వ వారం నామినేషన్స్ విషయానికి వస్తే .. ఈ వారం నబీల్, నిఖిల్, ప్రేరణ, విష్ణుప్రియ, పృథ్వీ, అవినాష్, టేస్టీతేజ, గౌతమ్‌లు నామినేషన్స్‌లో ఉన్న సంగతి తెలిసిందే. మెగా చీఫ్ కావడంతో ఒక్క రోహిణి మాత్రమే నామినేషన్స్‌లో లేరు. ఈ నేపథ్యంలో 13వ వారానికి సంబంధించి సోషల్ మీడియాలో అనధికారికంగా జరుగుతున్న ఓటింగ్‌ని ఒకసారి పరిశీలిస్తే . గౌతమ్ కృష్ణ దాదాపు 26.15 శాతం ఓటింగ్‌తో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

మిగిలిన కంటెస్టెంట్ల ఓటింగ్ కూడా స్వల్పంగా మారింది. నిఖిల్ 14.62 శాతం ఓటింగ్‌తో సెకండ్ ప్లేస్‌కి దూసుకొచ్చాడు. తర్వాత ప్రేరణ (14.34 శాతం), అవినాష్ (9.53 శాతం), టేస్టీ తేజా (9.35 శాతం), నబీల్ (8.73 శాతం), పృథ్వీ (8.65 శాతం), విష్ణుప్రియ (8.65 శాతం) ఓటింగ్‌తో నిలిచారు. ప్రేమ పక్షులిద్దరూ డేంజర్ జోన్‌లో ఉండగా.. వీరిద్దరిలో ఒకరిని ఎలిమినేట్ చేస్తారా? లేక లాస్ట్ మినిట్‌లో బిగ్‌బాస్ ట్విస్ట్ ఇస్తాడా అనేది వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











