నా వక్షోజాలతో తృప్తి పడేవాడు.. ఏకంగా సవతి తండ్రిపై టీవీ యాంకర్ సంచలన ఆరోపణలు

సినీ, టెలివిజన్ ఇండస్ట్రీలో లైంగిక వేధింపులను బయటపెట్టే మీటూ ఉద్యమం కొనసాగుతున్న నేపథ్యంలో తమకు జరిగిన అన్యాయాన్ని ఒక్కొక్కరు బయటపెడుతున్నారు. ఇప్పటికే మీటూ అంటూ పలువురు సెలబ్రిటీలు పెద్దల లైంగిక వేధింపులను బయటపెట్టారు. ఆ జాబితాలో అమెరికన్ టెలివిజన్, కామెడీ షో హోస్ట్ ఎలెన్ డీజెనెరెస్ కూడా చేరారు. ఈమె చేసిన ఆరోపణలు దర్శక, నిర్మాతలు, తోటి నటులపై కాకుండా తన సవతి తండ్రిపై లైంగిక ఆరోపణలు చేయడం యూఎస్ మీడియాలో సంచలనంగా మారాయి. తన సవతి తండ్రిపై ఎలెన్ చేసిన ఆరోపణలు ఈ విధంగా ఉన్నాయి.

నేను టీనేజ్‌లో ఉన్నప్పుడు

నేను టీనేజ్‌లో ఉన్నప్పుడు

నేను టీనేజ్‌లో ఉన్నప్పుడు నా తల్లి భర్త (తండ్రి కాదు) నాపై దారుణంగా ప్రవర్తించేవాడు. నాపై లైంగిక దాడులకు పాల్పడ్డాడు. నా తల్లి ఇంట్లో లేని సమయంలో ఏదో నెపంతో నా వక్షోజాలు తడుముతూ తృప్తి పొందేవాడు. తాను వారించినా బెదిరింపులకు పాల్పడుతూ తనపై పలుమార్లు అలా చేశాడు. నా తల్లికి చెబితానని అంటే బెదిరింపులకు పాల్పడే వాడు అని ఎలెన్ తాజాగా సీఎన్ఎన్ ఇంటర్వ్యూలో వెల్లడించింది.

 తండ్రి చేష్టలతో నాపై నాకే కోపం

తండ్రి చేష్టలతో నాపై నాకే కోపం

నాపై సవతి తండ్రి లైంగిక వేధింపులకు పాల్పడిన సమయంలో నా తల్లికి క్యాన్సర్ వ్యాధి సోకినట్టు తేలింది. దాంతో నేను ఆత్మ సంరక్షణలో పడ్డాను. నా తండ్రి వేధింపులను భరించడంపై నాపై నాకే కోపం ఉండేది. నా తండ్రి చేష్టలు దారుణంగా ఉండేవి. బయటకు చెప్పుకోలేని పరిస్థితి. ఇతర అమ్మాయిలు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవద్దనే ఈ విషయాన్ని ఇప్పుడు బయటపెడుతున్నాను అని ఎలెన్ తెలిపింది.

చాలాకాలం తర్వాత నా తల్లికి చెబితే

చాలాకాలం తర్వాత నా తల్లికి చెబితే

నా తండ్రి ప్రవర్తనను నా తల్లికి చాలా కాలం తర్వాత చెప్పాను. కానీ మా అమ్మ అసలు నమ్మలేదు. అతడిపైనే ఎక్కువగా నమ్మకం పెట్టుకొన్నది. ఆ తర్వాత కూడా అతడితోనే 18 ఏళ్లు కాపురం చేసింది. ఆ తర్వాత అతడి ప్రవర్తన తెలుసుకొని చివరకు నా సవతి తండ్రికి దూరమైంది అని ఎలెన్ వెల్లడించింది.

బాధితులు ఎప్పడూ మౌనంగా ఉండోద్దు

బాధితులు ఎప్పడూ మౌనంగా ఉండోద్దు

బాధితులు ఎప్పుడు మౌనంగా ఉండకూడదు. ఇలాంటి విషయాలు బయటకు చెబితే కొందరికి నాపై కోపం కూడా కలుగవచ్చు అని ఎలెన్ కోరింది. ఇక ఎలెన్ డీ జెనెరెస్ విషయానికి వస్తే.. డేవిడ్ లెటర్‌మ్యాన్ రూపొందించే నెట్‌ఫ్లిక్స్ షో మై నెక్ట్స్ గెస్ట నీడ్ నో ఇంట్రడక్షన్ అనే కార్యక్రమంలో పాల్గొంటున్నది. త్వరలోనే ఈ షో ప్రసారం కానున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X