ఇమాన్యుయేల్ ఓ రేంజ్‌లో మాస్ స్టెప్పులు.. బిగ్‌బాస్ కంటెస్టెంట్‌తో రొమాన్స్ ఓ ఊపు!
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేని కమెడియన్ ఇమ్మాన్యుయేల్. జబర్దస్త్ షో ద్వారా తనదైన కామెడీ టైమింగ్, సహజ నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఆ ఫేమ్ తో సినిమాల్లోనూ అవకాశాలు దక్కించుకుంటున్నాడు. ఇలా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ఇమ్మూ. కామెడీతో పాటు ఎమోషన్ తో ఏడిపించే ఈ నటుడు.. ఇటీవల బిగ్ బాస్ సీజన్ 9లో అడుగుపెట్టి మరోసారి ప్రేక్షకులకు అలరించారు. ఈ షోలో తన నిజాయితీ, సింప్లిసిటీతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. కానీ, చివరికి టాప్ 4 ఫైనలిస్ట్‌గా నిలిచారు. ఇటీవల ఓ షోలో ఇమాన్యుయేల్ ఓ రేంజ్‌లో మాస్ స్టెప్పులు వైరల్ గా మారాయి.
బిగ్ బాస్ సీజన్ 9 ఎంతో ఇంట్రెస్టింగ్ గా సాగింది. లేటెస్ట్ సీజన్ విన్నర్ గా కళ్యాణ్ పడాల బిగ్ బాస్ ట్రోఫిని అందుకున్నారు. ఇక కళ్యాణ్‌కి గట్టి పోటీ ఇచ్చి, చివరికి రన్నర్‌గా నిలిచింది సీరియల్ నటి తనూజ గౌడ. అయితే ఎవరూ ఊహించని విధంగా డిమాన్ పవన్ మూడో స్థానంలో నిలిచి, ప్రైజ్ మనీలో కొంత భాగం కూడా తీసుకొని సూట్‌కేస్‌తో బయటికొచ్చాడు. కానీ, సీజన్ మొత్తం తన కామెడీ టైమింగ్ లో హౌస్ లో పువ్వులు పూయించిన ఇమ్మానుయేల్ మాత్రం నాలుగో స్థానానికి పరిమితం కావాల్సి వచ్చింది. ఈ విషయంలో చాలా మంది బిగ్ బాస్ ఆడియన్స్ ఫీల్ అయ్యారు.

ఇదిలా ఉంటే.. బిగ్‌బాస్ సీజన్ పూర్తి అయిన తరువాత కంటెస్టెంట్స్ అందరూ 'బీబీ ఉత్సవం' అనే పేరిట రీయూనియన్ అవడం అనవాయితీగా వస్తున్న విషయం తెలిసిందే. అలా తాజా బిగ్ బాస్ సీజన్ కంటెస్టెంట్స్ అందరూ తాజాగా బిగ్‌బాస్ సీజన్-9 రీయూనియన్ 'బీబీ ఉత్సవం'లో కలిశారు. ఈ క్రమంలో కంటెస్టెంట్స్ అందరూ.. తమ బిగ్ బాస్ జర్నీని చెప్పుకుంటూ.. ఎమోషనల్ అయ్యారు. అలాగే.. మరికొందరూ తమ ప్యూచర్ ప్లాన్స్, ప్రాజెక్ట్ గురించి కూడా పంచుకున్నారు. అలాగే.. తమ ఆటపాటతో మెప్పించారు.
ఈ క్రమంలో ఇమ్మానుయోల్ తన బిగ్ జర్నీ గుర్తు చేసుకుంటూఎమోషనల్ అయ్యాడు. తన గెలుపు కోసం తన తల్లి పడిన కష్టాన్ని చెప్పుకొచ్చారు. 'ఎంటర్‌టైనర్‌ని ఎక్కడో విన్నర్‌గా చూడరనే విషయం నాకు తెలుసు.. ఎందుకు చూడరు మన గేమ్ ఆడితే చూస్తారు కదా అనుకున్నా కానీ.. నేను ఓడిపోయినందుకు ఇంత కూడా బాధపడలేదు.. తన గెలుపు కోసం తల్లిదండ్రులు క్యారేజ్ కట్టుకొని దాదాపు 90 ఊర్లు తిరిగారంట. కొడుక్కి ఓటేయండని పాంప్లెట్ పట్టుకొని తిరిగారని ఇమ్మానుయేల్ ఏడ్చేశాడు. ఇమ్మానుయేల్ ఆడిన తీరుని మెచ్చుకుంటూ బిగ్‌బాస్ 9 ఆల్ రౌండర్ అనే అవార్డుని హీరో నిఖిల్ చేతుల మీదుగా ఇప్పించారు.
దీని తరువాత.. ఇమ్మానుయోల్ తనలో డాన్సర్ ను బయటకు తీసి, స్టేజ్‌పై అదరగొట్టాడు. తనతో పాటు బిగ్‌బాస్‌లో పాల్గొన్న దివ్య నిఖితతో కలిసి 'గిచ్చి గిచ్చి చంపమాకు' అనే పాటకు ఎనర్జిటిక్ డ్యాన్స్ చేశారు. స్టేజ్ మీద వీరిద్దరి ఎనర్జీ, స్టెప్పులు, ఎక్స్‌ప్రెషన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఇమ్మానుయేల్ ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్, మాస్ స్టెప్పులు, ఫన్ మోమెంట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఇప్పటి వరకూ అతనిలో కామెడీ టైమింగ్,హ్యూమర్ నే చూసిన ప్రేక్షకులు.. ఇమ్మూలో ఇంత మంచి డ్యాన్స్ యాంగిల్ ఉందని అభిమానులు షాక్ అవుతున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కామెంట్ల సెక్షన్‌లో ప్రశంసల వర్షం కురుస్తోంది. 'ఇమ్మానుయేల్ బిగ్‌బాస్ విన్నర్ కావాల్సింది', 'ఇమ్మూలో ఈ యాంగిల్ కూడా ఉందా?', 'ఇమ్మూ మామూలోడు కాదు', 'డ్యాన్స్‌తో అదరగొట్టేశాడు' అంటూ అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.


Click it and Unblock the Notifications











