బుల్లితెర అభిమానులకు షాక్... రీ ఎంట్రీపై ఇమ్మాన్యుయేల్ షాకింగ్ కామెంట్స్
జబర్దస్త్‌తో తెలుగు రాష్ట్రాల్లో ఫేమ్ సంపాదించి, స్టాండప్ కమెడియన్‌గా, నటుడిగా దూసుకెళ్తున్నారు ఇమ్మాన్యుయేల్. ఇలాంటి దశలో ఆయన జీవితాన్ని బిగ్‌బాస్ కార్యక్రమం పూర్తిగా మార్చేసింది. బిగ్‌బాస్ తెలుగు 9లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన గేమ్స్, టాస్క్‌లు, డిస్కషన్స్ ఇలా అన్నింటిలోనూ తనదైన ముద్ర వేశారు. తన కామెడీతో స్టార్ ఎంటర్‌టైనర్ అనిపించుకున్నారు. 15 వారాల పాటు హౌస్‌లో ఉన్న ఆయన అందరికీ సన్నిహితుడు అనిపించుకున్నారు. దాదాపు 10 వారాలు ఆయన అసలు నామినేషన్స్‌లోకి రాలేదంటే హౌస్‌మేట్స్‌తో ఆయన ఎలా కలిసిపోయారో అర్ధం చేసుకోవచ్చు.
ఇమ్మాన్యుయేల్ బిగ్‌బాస్ తెలుగు 9 ట్రోఫీ ఖచ్చితంగా గెలుస్తారని అంతా భావించారు. ఇప్పటి వరకు బిగ్‌బాస్ విన్నర్‌గా కమెడియన్లు నిలవలేదు. దాంతో ఈ సారి ఇమ్మాన్యుయేల్ చరిత్ర సృష్టిస్తారని అనుకున్నారు. టాప్ 5లో నిలిచిన ఇమ్మాన్యుయేల్.. థర్డ్ రన్నరప్‌తో సరిపెట్టుకున్నారు. కానీ అందరి హృదయాలలో నిలిచిపోయారు. బిగ్‌బాస్ నుంచి బయటికొచ్చాక తన మిత్రులు, కుటుంబ సభ్యులు, సన్నిహితులను కలుస్తూ, పార్టీలు, ప్రెస్‌మీట్స్‌లో పాల్గొంటూ ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా ఓ మీడియా సమావేశంలో తన ఫ్యూచర్ ప్లాన్స్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..

హౌస్‌లో ఉన్న మాకు ఎవరు గెలుస్తారో? ఎవరు సేవ్ అవుతారో? ఎవరు ఎలిమినేట్ అవుతారో ఎవ్వరికీ తెలియదు. నాగార్జున గారు ప్రతి వీకెండ్‌లో వచ్చి ప్రతి ఒక్కరినీ తిడతారు? ప్రతి ఒక్కరినీ పొగుడుతారు. అలాంటప్పుడు విజేత ఎవరు అనేది అంచనా వేయడం కష్టం. నేను బాగానే చేసినా ఊళ్లలో నన్ను ఇష్టపడే చాలామందికి హాట్‌స్టార్‌లోకి వెళ్లి ఓట్లు వేయడం తెలియదు. నేను నామినేషన్స్‌లోకి రాకపోవడం, వాళ్లకి అలవాటు చేయకపోవడం మిస్టేక్ అయ్యుండొచ్చు. నేను నామినేషన్స్‌లో లేకపోవడంతో నాకున్న కొద్దిమంది ఫ్యాన్స్ అయినా సంజన గారికే ఓట్లు వేయాలని కోరుకున్నాను. మా అమ్మగారు కూడా సంజనగారికు ఓటు వేసేవారు. ఆమె కూడా టాప్ 5లో నా పక్కనే ఉండాలని ఈ జర్నీ చేశాం. ఎక్కడా చిన్న మిస్ అండర్ స్టాండింగ్ కూడా రాకుండా.. ఒకవేళ వచ్చినా నైట్‌కి నైట్ పరిష్కరించుకునేవాళ్లం. ఒక సొంత కొడుకులా నన్ను చూసుకున్నారు అని ఇమ్మాన్యుయేల్ తెలిపారు.
త్వరలోనే నా పెళ్లి గురించి బయటపెట్టాలని అనుకుంటున్నాం. నేను ఫిజికల్ గేమ్స్ అంత బాగా ఆడతానని, తను ఎక్స్‌పెక్ట్ చేయలేదట. మీరు అక్కడే నెగ్గేశారని తను చెప్పింది. నామినేషన్స్‌లోకి వస్తేనే ఓటు బ్యాంకింగ్ అనేది క్రియేట్ అవుతుంది, అప్పుడే మనకి జనాలు అలవాటు పడి ఓట్లు వేస్తారని తెలిసింది. కానీ నేను ఎప్పుడూ నామినేషన్స్ విషయంలో భయపడేవాడిని కాదు. వేరే వాళ్లని నామినేట్ చేయాలంటే చిన్న బాధ వేసేది.. వాళ్లతో కలిసే ఫన్ క్రియేట్ చేసేవాడిని, అలాంటిది వీకెండ్ రాగానే మీరు ఇది చేశారు, అది చేశారని వాళ్లని వేలేత్తి చూపించలేకపోయానని ఇమ్మాన్యుయేల్ అన్నారు.
తనూజ చాలా మంచి అమ్మాయి.. చాలా బాగా గేమ్ ఆడింది. కళ్యాణ్, డిమోన్ వాళ్లిద్దరూ చివరి 5 వారాల నుంచి బాగా కనెక్ట్ అయ్యారు. డిమోన్ లాస్ట్‌లో ఫన్ క్రియేట్ చేసేవాడు.. సెకండ్ వీక్ నుంచే నువ్వు ఇలా ఉంటావని తెలిసుంటే, ఇంకొంచెం టైమ్ స్పెండ్ చేసేవాడిని. జనాలను ఇంచెం ఎంటర్‌టైన్ చేసేవాళ్లం. టాప్ 5లో ఉన్న ప్రతి ఒక్కరూ విన్నర్ అవ్వాలనే అనుకుంటారు. జబర్దస్త్‌లో బోల్డెన్నీ స్కిట్లు చేశాను.. సినిమాలు చేశాను.. కానీ ఎప్పుడూ నాకింత ఆదరణ రాలేదు. బయటికొచ్చిన తర్వాత నా కోసం మీరు నిల్చొన్న విధానం, తీరు చాలా ఆనందం అనిపించింది. కప్పు గెలవకపోయినా వీళ్ల అభిమానాన్ని గెలుచుకున్నాను. ఎంటర్‌టైనర్ అనేవాడు గెలవాలని అనుకోవడం తప్పు కాదు.. ఎంటర్‌టైనర్ కూడా గేమ్స్ ఆడాలి అని ఇమ్మాన్యుయేల్ తెలిపారు.
నేను 4వ స్థానంలో నుంచి బయటకు రాగానే మా అమ్మగారు ఏడ్చేశారు. కానీ తర్వాత నేను మొత్తం ప్రాసెస్ వివరించా. దివ్వెల మాధురిగారు చాలా మంచి వ్యక్తి. అక్కా అక్కా అని పిలిచేవాడిని, కనిపించే విధానం ఓకే గానీ పర్సన్స్‌గా మనమంతా మంచోళ్లమే. ఇక జబర్దస్త్‌లో రీ ఎంట్రీ ఎప్పుడు ఇస్తారు అని మీడియా ప్రతినిధులు అడగ్గా.. ప్రస్తుతానికి తాను స్టార్ మాలో చేస్తున్నాను అని ఇమ్యాన్యుయేల్ తేల్చేశారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. జబర్దస్త్‌లో ఇమ్మాన్యుయేల్ రీ ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్న అభిమానులు మాత్రం షాక్ అయ్యారు.


Click it and Unblock the Notifications











