Don't Miss!
- Finance
Pakistan Crisis: ఓడరేవుల్లో సరుకులు.. పాకిస్థానీలకు మాత్రం ఆకలి కేకలు.. ఎందుకిలా..?
- Technology
హైదరాబాద్ లో Airtel 5G ప్లస్ అత్యధిక వేగం! స్పీడ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
- News
YS Jagan, Chandrababu : జగన్, చంద్రబాబుకూ సంక్షేమ సవాల్ ! లబ్దిదారుల డిమాండ్లు ఇవే..!
- Sports
INDvsNZ : ఇదేం ఆట? అంటూ.. హార్దిక్ పాండ్యాపై మండిపడుతున్న ఫ్యాన్స్..
- Automobiles
కుర్రకారుని ఉర్రూతలూగించే 'అల్ట్రావయోలెట్ F77 రీకాన్' రివ్యూ.. ఫుల్ డీటైల్స్
- Lifestyle
హాట్ అరోమా ఆయిల్ మేనిక్యూర్ గురించి మీకు తెలుసా? రఫ్ హ్యాండ్స్ ని చేతిని మృదువుగా చేస్తుంది!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
స్కిట్ల మధ్యలో చేసే పని అదేనంటా.. మొత్తానికి రోజా మీదే పంచ్ వేశారుగా!!
జబర్దస్త్ షోలో ఈ మధ్య పక్కవారి మీద సెటైర్లు తగ్గాయి. ఎవరి మీద వారే వేసుకుంటూ.. జడ్జ్‌లు, యాంకర్‌లు, తమ టీం మేట్స్ మీదే పంచ్‌లు వేస్తూ స్కిట్లు కానిచ్చేస్తున్నారు. మరీ ముఖ్యంగా హైపర్ ఆది అయితే తన టీం సభ్యులను ఎంతలా రోస్ట్ చేస్తాడో అందరికీ తెలిసిందే. మధ్య మధ్యలో మల్లెమాల, ఈటీవీ, రోజా, యాంకర్లు ఇలా అందరి మీద వేస్తుంటాడు. అయితే జడ్జ్‌లపై ఓ కామెంట్ మాత్రం ఎప్పుడూ వినిపిస్తూ ఉంటుంది.

షూటింగ్‌లో అలా..
జబర్దస్త్ షూటింగ్ జరుగుతుంటే జడ్జ్‌లు ఒక్కోసారి ఏదో మూడ్‌లోఉన్నట్టు ఫోన్‌లు చూసుకుంటున్నట్టు కనిపిస్తుంది. అయితే కొన్ని సార్లు మాత్రమే నవ్విన షాట్స్‌ను పదే పదే చూపిస్తుంటారు. షూటింగ్ జరిగే సమయం, ఎడిటింగ్ వల్ల మనకు షోలో కొన్ని ఘటనలు మనకు తెలియవు.

రాకేష్ మాస్టర్ అలా..
ఆ మధ్య ఓ సారి రాకేశ్ మాస్టర్ ఇలాంటి షోలు, జడ్జ్‌ల వ్యవహార శైలి గురించి కామెంట్లు చేశాడు. వారు అసలు షోలను చూడరు.. అవతలి వారు ఏం పర్ఫామెన్స్ చేశారో కూడా చూడరు.. ఫోన్‌లను పట్టుకుని బిజీగా ఉంటారు.. డైరెక్టర్ నవ్వమని చెప్పినప్పుడు మాత్రమే నవ్వుతారంటూ అసలు గుట్టు విప్పాడు.

జబర్దస్త్ స్కిట్‌లు..
జబర్దస్త్ షోలో ఒక్కోసారి కొంత మంది ఆర్టిస్ట్‌లు వేసిన స్కిట్లు కనిపించవు. ఎందుకంటే అవి ఎడిటింగ్ స్థాయిలో వెళ్లిపోతాయి. అలా కొంత మంది స్కిట్లు వేసే సమయంలోనూ జడ్జ్‌లు ఉండరని, వారు లేకపోయినా కూడా ఎడిటింగ్‌తో మ్యానేజ్ చేస్తారనే కామెంట్లు కూడా వినిపిస్తుంటాయి.

కొందరి స్కిట్లు చూడలేక..
ఇక కొందరి స్కిట్లు చూడలేకనో మరేదైనా కారణంతోనూ గానీ ఒక్కోసారి జడ్జ్‌లు తమ ఫోన్లతో బిజీగా ఉన్నట్టు షోలో కనిపిస్తుంది. అంటే వారు స్కిట్‌ను అంతగా పట్టించుకోకుండా తమ పర్సనల్ పనుల్లోనే బిజీగా ఉంటారన్న మాట. తాజాగా దీనిపై ఓ సెటైర్ వేశారు.

చార్జర్ కొట్టేశా..
తాజాగా రిలీజ్ చేసిన జబర్దస్త్ ప్రోమోలో ఇమాన్యుయేల్ టీం రోజా మీద పంచ్ వేశారు. ఆమె చార్జర్‌ను కొట్టేశాను అని ఒకరు అంటాడు. ఎందుకని ఇమాన్యుయేల్ అడిగితే.. ఫోన్‌లో చార్జింగ్ అయిపోతుంది.. చార్జింగ్ పెట్టుకోవడానికి చార్జర్ ఉండదు.. అప్పుడైనా మన స్కిట్ చూస్తుంది కదా అని బదులిస్తాడు. ఆ వెంటనే రోజా అందుకొని మరో సెటైర్ వేస్తుంది. నా చార్జర్ కొట్టేస్తారు.. కానీ మంచి స్కిట్ మాత్రం వేయరా? అంటూ కౌంటర్ వేస్తుంది.అంటే స్కిట్లు బాగా చేయకపోతే మధ్యలో ఫోన్‌లతో బిజీ అవుతారన్న మాట.