ఉద్వేగంగా బిగ్‌బాస్ షో.. శ్యామల ఔట్ ఓ షాకింగ్.. బాత్రూమ్‌లో దూరిన ఆ ముగ్గురు!

Recommended Video

Bigg Boss Season 2 Telugu : Episode 27,28 Highlights | Emotional Elimination

బిగ్‌బాస్ నుంచి యాంకర్ శ్యామల ఎలిమినేట్ అయ్యారని రోజంతా మీడియాలో షికారు చేసిన వార్త నిజమయ్యింది. అయితే అందరూ ఊహించినట్టుగా కాకుండా వెండితెర మీద కంటే ఎమోషనల్‌గా, కన్నీరు పెట్టించినంత రేంజ్‌లో బుల్లితెర మీద భావోద్వేగాన్ని బిగ్‌బాస్ పండించారు. భావోద్వేగాల మధ్య శ్యామల ఇంటి నుంచి బయటకు వెళ్లింది. గత 28 రోజుల్లో ఎన్నడూ లేని విధంగా బిగ్‌బాస్ కార్యక్రమం ఆకట్టుకొన్నది. కాకపోతే ఎప్పటి మాదిరిగానే సభ్యుల మధ్య వాగ్వాదం, ఫన్నీ మూమెంట్ల మధ్య బిగ్‌బాస్‌ హౌస్‌లో ఆదివారం గడిచిపోయింది. ఇంతకు ఏమి జరిగిందంటే...

బాత్రూమ్‌లో దూరిన

బాత్రూమ్‌లో దూరిన

బిగ్‌‌బాస్ హౌస్‌లో గతవారం జరిగిన తమాషా సంఘటనతో సరదా సన్నివేశాలు చోటుచేసుకొన్నాయి. యాంకర్ శ్యామల, గీతా మాధురి, దీప్తి నల్లమోతు ముగ్గురు బిగ్‌బాస్ నిబంధనలను ఉల్లంఘించారు. మైక్ బెల్టులు తీసివేసి ముగ్గురు బాత్రూంలోకి వెళ్లి గుసగుసలాడటాన్ని బిగ్‌బాస్ బయటపెట్టారు. దాంతో సభ్యులు ఆ సన్నివేశాన్ని చూసి నవ్వుకున్నారు.

గీత, దీప, శ్యామలపై సీరియస్

గీత, దీప, శ్యామలపై సీరియస్

ఇంటి సభ్యులు మైక్‌లు తీసివేసి బాత్రూంలోకి వెళ్లడంపై హోస్ట్ సీరియస్ అయ్యారు. అత్యవసర సమయంలో గానీ, బాత్రూంలోకి రెగ్యులర్ పని కోసం వెళితే తప్ప మైక్ తీయరాదని విషయాన్ని మరిచి ముగ్గురు రూల్స్ ఉల్లంఘించారు. ఇకపై ఎవరైనా మైక్‌ బెల్టులు తీసి వెళితే బిగ్‌బాస్ కఠిన శిక్ష విధించడం జరుగుతుంది అని నాని హెచ్చరించారు.

హౌస్‌లో విలన్ ఎవరు?

హౌస్‌లో విలన్ ఎవరు?

బిగ్‌బాస్ హౌస్‌లో ఓ తమాషా గేమ్‌ను సభ్యులతో ఆడించారు. ఇంటిలో విలన్ ఎవరు అనే గేమ్‌ను ప్రతీ ఒక్కరితో ఆడించడం జరిగింది. ప్రతీ ఒక్కరు తమకు విలన్‌గా భావించిన వ్యక్తికి ప్రత్యేకంగా తెప్పించిన ముళ్ల కుర్చీ, కిరీటం పెట్టారు. కౌశల్, రోల్ రైడా, తనీష్‌ను ఎక్కువ మంది విలన్‌గా భావించారు.

ఎలిమినేషన్‌ ప్రక్రియలో కౌశల్, తేజస్వి

ఎలిమినేషన్‌ ప్రక్రియలో కౌశల్, తేజస్వి

ఎలిమినేషన్‌లో భాగంగా ఆదివారం కౌశల్, గీతా మాధురి, తేజును ముందు ప్రొటెక్టెడ్ జోన్‌లోకి పంపించారు. చివరికి యాంకర్ శ్యామల, దీప్తి, నందిని మిగిలారు. ఎవరు బయటకు వెళ్తారు అనే ఉత్కంఠ మధ్య ఆసక్తికరమైన అస్త్రాన్ని బిగ్‌బాస్ ఉపయోగించారు. అందులో కౌశల్, తేజస్వి ఎలిమినేషన్‌లో భాగం చేశారు.

యాక్టివిటీ రూమ్‌లో శ్యామల నిష్క్రమణ

యాక్టివిటీ రూమ్‌లో శ్యామల నిష్క్రమణ

ఎలిమినేషన్‌లో ఉన్న శ్యామల, దీప్తి, నందిని యాక్టివిటీ రూంలోకి పిలిచారు. చెరుకు రసం టాస్క్ విజేతలుగా నిలిచినందుకు లభించిన పవర్ ఓటును వినియోగించుకోవాలని కౌశల్‌, తేజస్వికి సూచించారు. దాంతో నందినిని కౌశల్ ఇంటి నుంచి వెళ్లకుండా కాపాడగా, దీప్తిని తేజస్వి రక్షించింది. దాంతో యాంకర్ శ్యామల ఇంటి నుంచి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.

దీప్తిపై బిగ్‌బాంబ్

దీప్తిపై బిగ్‌బాంబ్

ఇంటి నుంచి బయటకు వచ్చిన శ్యామల హోస్ట్ నానితో జతకలిసింది. 28 రోజుల ప్రయాణాన్ని చూసి కొంత ఎమోషనల్ అయింది. ఆటలో భాగంగా బిగ్‌ బాంబును దీప్తి నల్లమోతుపై విసిరింది. బిగ్‌ బాంబుపైన పడిన దీప్తి.. ఇక నుంచి ఇంటి సభ్యులందరి బట్టలను ఉతకాల్సి ఉంటుంది. ఈ నెల 29న తన కొడుకు తొలి బర్త్‌డేకు హాజరయ్యే అవకాశాన్ని కల్పించినందుకు శ్యామల సంతోషాన్ని వ్యక్తం చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X