బిగ్ బాస్2 : కౌశల్‌కి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న నాని.. దీనికి కూడా గొడవ చేస్తారా!
Recommended Video

నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరిస్తున బిగ్ బాస్ 2 తెలుగు సీజన్ ఫైనల్ వీక్ కు దగ్గర పడింది. ప్రస్తుతం హౌస్ లో ప్రతి రోజు గొడవలే కనిపిస్తున్నాయి. కౌశల్ తో అందరికి బేధాభిప్రాయాలు ఏర్పడుతుండడంతో మాటల యుద్ధం జరుగుతోంది. కౌశల్ ని ఇరికించడానికి మిగిలిన ఇతి సభ్యులు చిన్న అవకాశాన్ని కూడా వదిలిపెట్టడం లేదు. వీకెండ్ దగ్గర పడుతుండడంతో ఈ వారం చివరి ఎలిమినేషన్ ఎవరనే ఉత్కంఠ అందరిలో నెలకొని ఉంది. నేడు ప్రసారం కాబోయే ఎపిసోడ్ కి సంబందించిన ఎమోషనల్ ప్రోమోని తాజాగా విడుదల చేశారు.

రిక్వస్ట్ చేసిన కౌశల్
గత ఆదివారం రోజు నానిని కౌశల్ రిక్వస్ట్ చేశాడు. ఈ సెప్టెంబర్ 20న తన కుమార్తె పుట్టినరోజు అని ఓ పదినిమిషాలు తన కుమార్తెని హౌస్ లోకి పంపిస్తే కేక్ కట్ చేసి పంపిస్తానని కౌశల్ కోరాడు. దీనికి నాని సమాధానం ఇస్తూ నేను హామీ ఇవ్వలేను కానీ ఎదో ఒకటి చేస్తానని నాని తెలిపాడు.

మాట నిలబెట్టుకున్నాడు
తాజగా నాని కౌశల్ కు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు. కౌశల్ కుమార్తె పుట్టినరోజు సందర్భంగా హౌస్ లోకి ఒక గిఫ్ట్ వచ్చింది. తన కుమర్తెని తలుచుకుంటూ కౌశల్ ఎమోషనల్ అవుతున్నాడు. బిగ్ బాస్ హౌస్ నుంచే జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశాడు. ప్రతిరోజు గొడవలతో రణరంగంగా మారుతున్న బిగ్ బాస్ హౌస్ లో ఈ ఎమోషనల్ మూమెంట్ నెటిజన్లని ఆకట్టుకుంటోంది.

దీనిని కూడా గొడవ
హౌస్ లో ఏ ఇంటి సభ్యుడికి ఫేవర్ జరిగినా వారు గేమ్ ఇంకా బాగా ఆడదానికి అది ఉపయోగపడుతుందని గతంలో హౌస్ లో కౌశల్, ఇంటి సభ్యుల మధ్య ఓ చర్చ జరిగింది. ఇప్పుడు కౌశల్ కు ఫేవర్ జరిగింది కాబట్టి దీనిని కూడా ఎవరైనా వివాదం చేస్తారా అనే చర్చ కూడా జరుగుతోంది. ఎందుకంటే ప్రస్తుతం ఇంటిలో ఉన్న సభ్యులు విజేతగా నిలిచేందుకు చిన్న అవకాశాన్ని కూడా విడిచిపెట్టడం లేదు.

నామినేషన్‌లో అందరూ
ఇక హౌస్ లో గేమ్ విషయానికి వస్తే.. వీకెండ్ దగ్గర పడుతోంది. ఆదివారం రోజు ఒకరు ఎలిమినేట్ అవుతారు. మిగిలిన ఐదుగురు ఫైనల్స్ కు చేరుకుంటారు. ప్రస్తుతం అందరూ నామినేషన్ లో ఉన్నారు. దీనితో ఎలిమినేట్ కాబోయే వ్యక్తి ఎవరనేది అత్యంత ఉత్కంఠగా మారింది.

జాక్ పాట్ కొట్టిన సామ్రాట్
ఫైనల్ రేసు కోసం కోడి గుడ్లు జాగ్రత్త పరుచుకునే టాస్క్ జరిగింది. ఈ టాస్క్ లో అందరూ సామ్రాట్ కి సపోర్ట్ చేశారు. కౌశల్ మాత్రం రోల్ కి సపోర్ట్ చేశాడు. దీనితో ఈ టాస్క్ లో సామ్రాట్ విజయం సాధించి నేరుగా ఫైనల్స్ కు చేరుకున్నాడు. అంటే ఈ వారం నామినేషన్ అతడికి వర్తించదు. కౌశల్, తనీష్, గీత, దీప్తి, రోల్ రైడలో ఎవరో ఒకరే ఎలిమినేట్ కాబోతున్నారు.


Click it and Unblock the Notifications











