రెచ్చిపోయిన పునర్నవి, అషు రెడ్డి.. సరికొత్త గెటప్‌తో మెప్పించిన రవి కృష్ణ

గత సీజన్ల లాగే 'బిగ్ బాస్' మూడో సీజన్ కూడా మంచి ప్రేక్షకాదరణ పొందుతోంది. దీనికి కారణం కంటెస్టెంట్ల మధ్య జరిగే గొడవలే అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో కంటెస్టెంట్ల మధ్య సమన్వయం కుదరడం లేదు. దీంతో తరచూ గొడవలు జరుగుతున్నాయి. మొదటి ఎపిసోడ్ నుంచే ఎన్నో కొత్త కొత్త సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు. అయితే, తాజాగా హౌస్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ షో ప్లాన్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది.

మంగళవారం జరిగిన ఎపిసోడ్‌లో అలీ - మహేశ్ మధ్య జరిగిన గొడవ షోలో వేడి పుట్టించింది. ఆ తర్వాత వరుణ్ సందేశ్ - వితిక షేరు పెళ్లి రోజు వేడుకతో అందరూ చల్లబడ్డారు. ఇక, కెప్టెన్సీ టాస్క్ వాతావరణాన్ని సీరియస్‌గా మార్చింది. దీంతో మంగళవారం ఎపిసోడ్‌లో అన్ని రకాల ఎమోషన్స్ క్యారీ అయ్యాయి. ఈ ఎపిసోడ్ బుల్లితెర ప్రేక్షకులకు మజాను పంచిందనే చెప్పాలి.

 Entertainment Program in Bigg Boss House.. Punarnavi, Ashu Reddy Rock

ఇక, బుధవారం జరగబోయే ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను స్టార్ మా విడుదల చేసింది. ఈ సారి హౌస్‌లో బిగ్ బాస్ ఎంటర్‌టైన్‌మెంట్ షో ప్లాన్ చేశాడు. ఇందులో భాగంగా కొందరు కంటెస్టెంట్లు ఆట పాటలతో అలరించారు. ముఖ్యంగా పునర్నవి, అషు రెడ్డి డ్యాన్స్ చేసినట్లు చూపించారు.

అలాగే, రాహుల్ పాటతో అలరించాడు. అలాగే, రవి కృష్ణ సరికొత్త గెటప్‌తో ఆకట్టుకున్నాడు. ఒకవైపు అమ్మాయిగా, మరోవైపు అబ్బాయిగా కనిపిస్తూ డ్యాన్స్ చేస్తున్నాడు. ఈ కార్యక్రమానికి బాబా భాస్కర్, శ్రీముఖి న్యా నిర్ణేతలుగా వ్యవహరించారు. మొత్తానికి ఈ ప్రోమో చూస్తుంటే బుధవారం ఎపిసోడ్ సరదాగా సాగిపోవడం ఖాయం అనిపిస్తుంది.

ఈ వారం నామినేషన్ విషయానికి వస్తే.. ఈ సారి జాబితాలో ఏడుగురు ఉన్నారు. పునర్నవి, శివజ్యోతి, హిమజ, అషు రెడ్డి, రాహుల్‌, బాబా భాస్కర్, మహేశ్ విట్టాలు ఎలిమినేట్ అవడానికి నామినేట్ అయిన విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X