For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నీ రేటు ఎంత? టీవీ నటికి షాకింగ్ అనుభవం... ఆమె ఫోటో, ఫోన్ నెంబర్‌తో ఎస్కార్ట్ పోస్టర్లు!

  |

  బెంగాలీ టీవీ నటి బ్రిష్టి రాయ్‌కు షాకింగ్ అనుభవం ఎదురైంది. కొన్ని రోజులుగా ఆమె పీడకల లాంటి అనుభవాలను ఫేస్ చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి ఆమెకు వరుసగా ఫోన్లు వస్తున్నాయి. ఫోన్ చేసిన వారు నీ రేటు ఎంత? ఎస్కార్ట్ సర్వీస్ వివరాలు చెప్పండి అంటూ వాకబుచేస్తున్నారట. గడిచిన పది రోజులుగా కోల్‌కతా లోకల్ ట్రైన్స్, రైల్వే స్టేషన్లలో ఎస్కార్ట్ సర్వీస్ ఆఫర్ చేస్తూ బ్రిష్టి రాయ్ ఫోటో, ఫోన్ నెంబర్‌తో కూడిన పోస్టర్లు దర్శనమివ్వడమే ఇందుకు కారణం.

  ''మీరు అసంతృప్తిగా ఉన్నారా? రాత్రి మీకు నిద్ర పట్టడం లేదా? మీ భార్య మీతో లేదా? డోంట్ వర్రీ... నాకు కాల్ చేయండి, నేను మీకు కోసం వస్తాను. నా పేరు బ్రిష్టి రాయ్. మీరు రూ. 10,000 నుంచి రూ. 20,000 వరకు సంపాదించవచ్చు'' అని ఆ పోస్టర్లపై రాసి ఉంది. దీనిపై పెద్ద అక్షరాలతో ఆమె ఫోన్ నెంబర్ కూడా రాసి ఉంది.

  ఫ్రెండ్ ద్వారా పోస్టర్ల విషయం తెలుసుకున్నాను

  ఫ్రెండ్ ద్వారా పోస్టర్ల విషయం తెలుసుకున్నాను

  ఈ విషయం గురించి ఐఎఎన్ఎస్ మీడియా సంస్థతో బ్రిష్టి రాయ్ మాట్లాడుతూ... ‘‘ఆగస్టు 24 నుంచి నాకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఆ రోజు శనివారం, కొన్ని నిమిషాలు మాట్లాడిన తర్వాత అవి స్పామ్ కాల్స్ అనుకుని బ్లాక్ చేశాను. మూడు రోజుల తర్వాత లోకల్ ట్రైన్‌లో పోస్టర్ల చూసి నా ఫ్రెండ్ సమాచారం అందించారు. నా పేరు, ఫోటో, ఫోన్ నెంబర్‌తో ఎస్కార్ట్ సర్వీస్ ఆఫర్ చేస్తున్నట్లు ఉంది. వెంటనే దాన్ని ఫోటో తీసి నాకు పంపారు. అది చూసి షాకయ్యాను, ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు.'' అన్నారు.

  రేటు ఎంత? అని అడుగుతున్నారు

  రేటు ఎంత? అని అడుగుతున్నారు

  ఆ తర్వాత నాకు వరుసగా కాల్స్ వస్తూనే ఉన్నాయి. వివిధ నెంబర్లు, వివిధ ప్రాంతాల నుంచి కాల్స్ వస్తున్నాయి. ఎస్కార్ట్ సర్వీస్ గురించి ఎంక్వయిరీ చేస్తూ నా రేటు ఎంత? అని అడుగుతున్నారు. చాలా మంది నా నెంబర్ ఎస్కార్ట్ సర్వీస్ పోస్టర్ యాడ్ ద్వారా తెలుసుకున్నట్లు తెలిపారు. ఆ పోస్టర్లో ఉన్నది నిజంగానే బ్రిష్టి రాయా? అని మరికొందరు అడుగుతున్నారు.'' అని బాధ పడుతూ తెలిపారు.

  చాలా నీచంగా మాట్లాడుతున్నారు

  చాలా నీచంగా మాట్లాడుతున్నారు

  సోనాపూర్ సమీపంలోని మలంచ ఏరియా నివాసి అయిన బ్రిష్టి రాయ్ ఈ అంశం గురించి ఇంకా వివరిస్తూ... ‘‘ఈ రోజు ఉదయం కూడా రోతపుట్టించే కొన్ని కాల్స్ వచ్చాయి. కొందరు చాలా నీచమైన భాష వాడుతూ నన్ను మరింత విసిగించారు. వారు మాట్లాడే తీరు చూస్తుంటే చాలా అసహ్యం వేసింది. బారుపూర్ కోర్టుకు చెందిన ఒక న్యాయవాది నిన్న నాకు ఫోన్ చేసి నా 'రేటు' గురించి, సర్వీస్ ఎక్కడ పొందాలి అని అడిగారు. '' అని చెప్పుకొచ్చారు.

  ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కాడం లేదు

  ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కాడం లేదు

  ‘‘చాలా భయం వేసింది, నిస్సహాయస్థితిలోకి వెళ్లిపోయాను. అసలు ఏం జరుగుతుందో? ఎందుకు నా గురించి ఇలా చేస్తున్నారు? ఎవరు చేశారు? అనేది అర్థం కావడం లేదు. గడిచిన కొన్ని రోజులు నాకు పీడకల లాంటి అనుభవమే. అపరిచితుల నుంచి వస్తున్న ఈ కాల్స్ వల్ల చాలా అలసి పోయాను. ఈ కాల్స్ రావడం ఆగిపోతేనే నేను మామూలు స్థితికి వస్తాయి.'' అన్నారు.

  ఎవరీ బ్రిష్టి రాయ్

  ఎవరీ బ్రిష్టి రాయ్

  బ్రిష్టి రాయ్ పలు బెంగాలీ టీవీ సీరియల్స్‌లో నటించారు. "బౌ కోతా కావో," "తోమే అమే మైల్," "సుబర్ణలత," "భూమికన్య," "మహాపీత్ తారాపీత్" తదితర వాటిల్లో నటించారు. కొన్ని బంగ్లా చిత్రాలలో కూడా నటించారు.

  అందుకే ఫోన్ నెంబర్ మార్చలేదు

  అందుకే ఫోన్ నెంబర్ మార్చలేదు

  "నా ఫోన్ నంబర్ మార్చాలని అనుకున్నాను, కాని పోలీసులు దర్యాప్తు చేస్తున్నందున అలా చేయలేదు. వారికి ఈ నంబర్ అవసరం ఎందుకంటే ఇది పోస్టర్లో ముద్రించబడింది. అలాగే, నేను నటిని, చాలా మంది (సినిమా, టీవీ) పరిశ్రమకు చెందిన వారు ఈ నంబర్‌ను కలిగి ఉన్నారు. అందుకే ఇప్పటికిప్పుడే ఈ నెంబర్ మార్చలేను. కానీ నా భద్రత కోసం ఈ నంబర్‌ మార్చాల్సి ఉంటుంది. నేను పరిస్థితిని ఎదుర్కోవడానికి ప్రయత్నిస్తున్నాను. ఎందుకంటే నేను నిర్దోషిని నాకు తెలుసు. ఎవరో ఉద్దేశపూర్వకంగా నన్ను వేధించడానికి ప్రయత్నిస్తున్నారు. అంత ఈజీగా ఈ విషయాన్ని వదిలిపెట్టను. నేరస్థులు త్వరగా పట్టుబడతారని ఆశిస్తున్నాను, "ఆమె చెప్పారు.

  నాకు తెలిసినవారే ఈ పని చేసి ఉంటారు

  నాకు తెలిసినవారే ఈ పని చేసి ఉంటారు

  "వారు (నిందితులు) నా ఫోటోను సోషల్ మీడియా ద్వారా సంపాదించారు. ఇది నా ఫేస్బుక్, వాట్సాప్ ఫోటో. నాకు ఎవరు ఇలా చేసారో, ఎందుకు చేశారో నాకు తెలియదు, కాని నాకు బాగా తెలిసిన వ్యక్తి ప్రమేయం ఉందని భావిస్తున్నాను. లేకపోతే, వారు నా నంబర్‌ను ఎలా పొందుతారు? నేను టెలివిజన్‌లో ఒక సాధారణ నటిని, చాలా తక్కువ జనాదరణ పొందిన టీవీ సీరియల్స్‌లో పనిచేశాను. ఇటీవల విడుదలైన ఓ చిత్రంలో కూడా నటించాను. వారు బహుశా నటిగా నా ఇమేజ్‌ దెబ్బతీయడానికే ఇలా చేశారని అనుకుంటున్నాను. ఈ రోజు ఇది నాకు జరుగుతోంది, రేపు అది మీకు లేదా మరే అమ్మాయికి అయినా జరగవచ్చు. ఈ రోజుల్లో ఒక అమ్మాయిని దుర్భాషలాడటం చాలా ఈజీ అయ్యింది. అందుకే నిందితులను పట్టుకునే వరకు నేను పోరాడతాను. " అని బ్రిష్టి రాయ్ చెప్పుకొచ్చారు.

  పోలీసులకు ఫిర్యాదు

  పోలీసులకు ఫిర్యాదు

  తాను ఇప్పటికే సోనాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు బ్రిష్టి రాయ్ తెలిపారు. దీనిపై పశ్చిమ బెంగాల్‌లోని బారుపూర్ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ రషీద్ ఖాన్ స్పందించారు. "మేము ఈ కేసుపై దర్యాప్తు ప్రారంభించాము. ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదు." అని వ్యాఖ్యానించారు.

  Read more about: brishti roy tv bengali టీవీ
  English summary
  Bengali television actress Brishti Roy getting calls from all over Bengal, enquiring her "rate", and escort service details. Over the past 10 days or so, posters offering escort service had mushroomed all over Kolkata local trains and railway stations, with the actress's name, Photo and mobile number.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X