బుల్లితెరపై కాంతార, వసంత కోకిల.. ఎప్పుడు? ఎక్కడ చూడొచ్చంటే?

తెలుగు బుల్లితెరపైన ఎన్ని సీరియల్స్ వచ్చినా ప్రేక్షకుల ఆదరణ విశేషంగా ఉంటుంది. ఇప్పటికే పలు ఛానెల్స్‌లో టాప్ ర్యాంకింగ్‌తో సీరియల్స్ ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. ఎన్ని సినిమాలు, వెబ్ సిరీస్‌లు వచ్చినా సీరియల్స్‌కు మాత్రం ఆదరణ చెక్కు చెదరడం లేదు. ప్రేక్షకుల అభిరుచిని దృష్టిలో పెట్టుకొన్న ప్రముఖ టెలివిజన్ ఛానెల్ ఈటీవీ మరో రెండు సీరియల్స్‌ను లైన్‌లో పెట్టింది. ఆ సీరియల్స్ విషయానికి వస్తే..

తెలుగు టెలివిజన్ ఇండస్ట్రీలో ఈటీవీ ప్రేక్షకులను ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నది. జూలై 2వ తేదీ నుంచి ఏకంగా రెండు సీరియల్స్‌ను ప్రారంభిస్తున్నది. వసంత కోకిల, కాంతర అనే రెండు సీరియల్స్‌ను ప్రారంభిస్తున్నది. అయితే అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకొనేందుకు ఈ సీరియల్స్ నిర్వాహకులు ప్రయత్నిన్నారు.

ETV Channel grandly started Kantara Vasanta Kokila Serial from July 2nd

వసంత కోకిల సీరియల్ విషయానికి వస్తే.. ఎన్నో ఆశలతో కొత్తగా వైవాహిక జీవితాన్ని ప్రారంభించిన సంధ్య అమ్మాయికి ఊహించని విధంగా భర్త సూర్యం కన్నుమూస్తాడు. తెలివితేటలు కలిగిన అమ్మాయి తన జీవితాన్ని ఎలా నెట్టుకొచ్చింది? భర్తకు ఇచ్చిన మాటకు కట్టుబడి అత్తమామలను ఎలా చూసుకొన్నది? తన జీవితంలోకి ప్రవేశించిన ఆకాశ్‌తో రిలేషన్ ఎలా సాగింది? సంధ్య రెండో పెళ్లి చేసుకొన్నదా? అనే పాయింట్‌తో ఈ సిరియల్ రూపొందిందని నిర్వాహకులు తెలిపారు.

ఇక వసంత కోకిల సీరియల్ మధ్యాహ్నం 1.30 గంటల నుంచి 2 గంటల వరకు టెలికాస్ట్ అవుతుంది. సోమవారం నుంచి శనివారం వరకు ఈ సీరియల్‌ను వీక్షించవచ్చు. సంధ్యగా వద్మా లక్ష్మీ, ఆకాశ్‌గా రవి రాథోడ్, సూర్యంగా మధు నటించారు. అనిల్ కుమార్ దర్శకత్వం, అరుణ్ కుమార్ స్క్రీన్ ప్లే అందించారు.

ETV Channel grandly started Kantara Vasanta Kokila Serial from July 2nd

కాంతార సీరియల్ విషయానికి వస్తే.. ఓ గ్రామానికి చెందిన కాంతార, గోపి ప్రాణం కంటే మిన్నగా ప్రేమించుకొంటారు. అయితే ఊహించని విధంగా యువరాజుతో కాంతార వివాహం జరిపిస్తారు. అయితే గోపిని కాదని యువరాజును ఎందుకు పెళ్లి చేసుకొన్నది? మనసుకు మాంగల్యానికి మధ్య ఎలా నలిగిపోయింది అనే ప్రశ్ననే ఈ సీరియల్‌కు మూలకథ. ఈ సీరియల్‌కు శరత్ దర్శకత్వం వహిస్తున్నారు. గౌరవ్, అక్షయ్, పవన్ రవీంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు. సోమవారం నుంచి శనివారం వరకు ప్రసారమయ్యే ఈ సీరియల్‌ను మధ్యాహ్నం 2 గంటల నుంచి 2.30 గంటల వరకు చూడొచ్చు.

More from Filmibeat

Read more about: etv kantara vasanta kokila
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X