‘ఈటీవీ’ పుణ్యమా అని ఆ చిన్న సినిమాలకు మోక్షం!

By Bojja Kumar

హైదరాబాద్: ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమ కొంత మంది బడా నిర్మాతలు, సినిమా పరిశ్రమపై ఆధిపత్యం చెలాయిస్తున్న కొందరు సినీ ప్రముఖుల కబంధ హస్తాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. వీరి మూలంగా చిన్న సినిమాలు, చిన్న నిర్మాతల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. వీడి ఆగడాల కారణంగా చిన్న సినిమాల విడుదలకు కనీసం థియేటర్లు కూడా దొరకని పరిస్థితి.

ఇప్పటి వరకు సినిమా షూటింగ్ పూర్తి చేసకుని, సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుని....థియేటర్లు దొకరని కారణంగా విడుదలకు నోచుకోని తెలుగు సినిమాలు 200 వరకు ఉన్నాయి. ప్రముఖ తెలుగు ఛానల్ 'ఈటీవీ' పుణ్యమా అని ఈ సినిమాలు బుల్లితెరపై విడుదలకు నోచుకుంటున్నాయి.

ETV Hand Picked Movie

సెన్సార్ పూర్తి చేసుకుని విడుదలకు నోచుకోకుండా ఆగిపోయిన నవ్యత గల చిన్న సినిమాలను షేరింగ్ పద్ధతిలో రిలీజ్ చేయడానికి ఈటీవీ సంస్థ శ్రీకారం చుట్టింది. ఈ విధానం ద్వారా వాణిజ్య ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయాన్ని ఈటీవీ, సదరు నిర్మాత షేరింగ్ చేసుకుంటారు.

ప్రతి ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు 'ఈటీవీ హ్యాండ్ పిక్డ్ మూవీస్' పేరిట వీటిని ప్రసారం చేస్తారు. ఇందులో భాగంగా ఈ నెల 8న ముందుగా 'బిల్లా రంగా' చిత్రాన్ని ప్రసారం చేస్తున్నారు. ఈటీవీ సీఈఓ బాపినీడు మాట్లాడుతూ ప్రయోగాత్మకంగా చేపడుతున్న ఈ విధానం సత్ఫలితాలు ఇస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X