నేను కాదు ఆమెనే హీరో.. నిర్మాతగా సక్సెస్ కాలేదు.. వదినమ్మ గురించి ఈటీవీ ప్రభాకర్
తెలుగు బుల్లితెర మీద సుదీర్ఘంగా కొనసాగుతున్న సీరియల్స్‌లో వదినమ్మ సీరియల్ ఒకటి. నటుడు, దర్శకుడు, నిర్మాత ఈటీవీ ప్రభాకర్, సుజిత జంటగా నటించిన ఈ సీరియల్ అత్యంత ప్రేక్షకాదరణ పొందాయి. ఈ క్రమంలో నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా తన ప్రస్థానం గురించి ప్రభాకర్ మాట్లాడుతూ..

నేను హీరోను అంటే ఒప్పుకోను..
వదినమ్మ సీరియల్‌లో నేను హీరో అంటే ఒప్పుకోను. మా సీరియల్‌లో హీరో వదినమ్మ. మేమంత సపోర్టింగ్ క్యారెక్టర్స్. అన్నయ, తమ్మళ్లందరి పాత్రలు సీరియల్‌లో కీలకంగానే కాకుండా ఇంపార్టెంట్ క్యారెక్టర్. సీరియల్ ప్రారంభమైనప్పటి నుంచి మంచి రెస్పాన్స్ వస్తున్నది. 500 ఎపిసోడ్స్ పూర్తికావడం అందుకు సాక్ష్యం అంటూ నటుడు ఈటీవీ ప్రభాకర్ తెలిపారు.

ప్రొడ్యూసర్‌గా నాకు ఉండే కష్టాలు..
ఇతర సీరియల్స్‌కు భిన్నంగా ఫ్యామిలీ రిలేషన్స్‌పై ముందుకెళ్తున్నాం. ప్రొడ్యూసర్‌గా నాకు ఉండే కష్టాలు నాకు ఉంటాయి. ప్రాజెక్టుకు కావాల్సిన ప్రతీది అరెంజ్ చేయడమే. ప్రాజెక్టును నిలబెట్టాలన్నా.. సీరియల్ సక్సెస్ కావాలన్నా క్రియేటివ్ టీమ్‌దే ప్రధాన పాత్ర అని ఈటీవీ ప్రభాకర్ తెలిపారు.

కంటెంట్ లేకపోతే కష్టమే..
స్టార్ మా టెలివిజన్‌లో ప్రసారమయ్యే అన్నీ సీరియల్స్‌కు వాళ్లే ప్రొడ్యూసర్స్. కంటెంట్ బాగా లేకపోతే ఎక్కువ కాలం సాగదు. కానీ చేసిన అన్ని ఎపిసోడ్స్‌కు డబ్బులు ఇస్తారు. ఇలాంటి సమయంలో సీరియల్స్ నిర్మించడమనేది కత్తి మీద సాముగా మారింది అని ఈటీవ ప్రభాకర్ పేర్కొన్నారు.

పరిమిత బడ్జెట్‌తో కష్టం
ఇంతకు ముందులా కాకుండా ప్రేక్షకులు అంతకుమించి అన్నట్టు క్వాలిటీని అడుగుతున్నారు. ఫ్రేములో ఒకరిద్దరు ఉంటే ప్రేక్షకులు ఒప్పుకోవడం లేదు. ప్రతీ ఫ్రేమ్‌లో ఫులుగా ఆర్టిస్టులను కోరుకొంటున్నారు. ఒకరిద్దరు ఉంటే సీరియల్ చూడటం లేదు. పరిమిత ఫండింగ్‌తో క్లాలిటీ సీరియల్ చేయడం మహాకష్టం అని ఈటీవీ ప్రభాకర్ అన్నారు.
Recommended Video

నిర్మాతగా నేను సక్సెస్ కాలేదు
నేను నిర్మించిన సీరియల్స్ సూపర్ సక్సెస్ అయ్యాయి. కానీ నిర్మాతగా, ఫైనాన్స్ పరంగా నేను సక్సెస్ కాలేదు. మిగితా నిర్మాతలు ఆర్థికంగా ఎలా సక్సెస్ అవుతున్నారో అడిగి తెలుసుకోవాలి. నాకు సినిమా, టీవీ అనేది పక్కన పెడితే నాకు యాక్టింగ్ అంటే ఇష్టం అని ఈటీవీ ప్రభాకర్ తెలిపారు.


Click it and Unblock the Notifications











