ETV ప్రభాకర్‌ది దొంగ పెళ్లి... సాక్ష్యం మేమే అంటూ.. సీక్రెట్ లీక్ చేసిన యాంకర్ సుమ!

టాప్ యాంకర్ సుమ హోస్ట్‌గా స్టార్ట్ మ్యూజిక్ షో బుల్లితెరపై వినోదభరితంగా సాగుతున్నది. మ్యూజిక్‌లో సెలబ్రిటీలకు ఉన్న నాలెడ్జ్‌ను పరీక్షించే ఈ కార్యక్రమం ఆద్యంతం ఫన్‌గా సాగుతున్నది. ఇటీవల కాలంలో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటున్న వదినమ్మ సీరియల్ టీమ్ ఈ షోలో సందడి చేసింది. ఈ సందర్భంగా ఈటీవీ ప్రభాకర్‌ పెళ్లికి సంబంధించిన విషయాలను వెల్లడించి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ విషయంలోకి వెళితే...

560 ఎపిసోడ్స్‌తో వదినమ్మ...

560 ఎపిసోడ్స్‌తో వదినమ్మ...

ఈటీవీ ప్రభాకర్ ప్రధాన పాత్రలో ప్రసారం అవుతున్న వదినమ్మ సీరియల్ విశేషంగా ప్రేక్షకులను ఆకట్టుకొంటున్నది. ఇప్పటికే ఈ సీరియల్ 559 ఎపిసోడ్స్ ప్రసారమైంది. అనేక మలుపులు, భావోద్వేగాలతో ఈ సీరియల్ ముందుకు సాగుతున్నది. ఈ క్రమంలో ఈ సీరియల్ నటించే ప్రధాన నటీనటులు స్టార్ట్ మ్యూజిక్‌లో సందడి చేశారు.

అన్నయ్య, వదినమ్మ జట్లుగా

అన్నయ్య, వదినమ్మ జట్లుగా

స్టార్ట్ మ్యూజిక్ షోలో వదినమ్మ టీమ్ నుంచి అన్నయ్య టీమ్ ప్రభాకర్, వదినమ్మ టీమ్‌కు సుజిత కెప్టెన్‌గా వ్యవహరించారు. ఈ టీమ్‌లోని ఇతర సభ్యులు వినోదాన్ని అందిస్తూ షోను క్రేజీగా మార్చారు. ఈ షో మధ్యలో కొన్ని ఫోటోలు ప్రదర్శించి ఈటీవీ ప్రభాకర్‌కు షాకిచ్చింది.

ఈటీవీ ప్రభాకర్ ప్రేమ వివాహం గురించి

ఈటీవీ ప్రభాకర్ ప్రేమ వివాహం గురించి

ఈటీవీ ప్రభాకర్‌ది ప్రేమ వివాహం. అయితే ఇరు కుటుంబాల్లో ఎవరికి తెలియకుండా వివాహం చేసుకొన్నారు. ఈ వివాహానికి సుమ, రాజీవ్ కనకాల సాక్షులుగా వ్యవహరించారు. ఆ ఫోటోను చూపిస్తూ.. ప్రభాకర్‌ది దొంగ పెళ్లి అంటూ కామెంట్ చేశారు. దాంతో మీది దొంగపెళ్లినా అంటూ సుమను సుజిత ప్రశ్నించింది. అయితే మాది దొంగ ప్రేమ కానీ.. దొంగ పెళ్లి కాదు అంటూ సుమ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు.

దొంగ ప్రేమ కాదు.. అంటూ ప్రభాకర్

దొంగ ప్రేమ కాదు.. అంటూ ప్రభాకర్

అయితే తన పెళ్లిపై ఈటీవీ ప్రభాకర్ స్పందిస్తూ.. మా ప్రేమ గురించి ఇరు కుటుంబాలకు తెలుసు. కానీ పెళ్లి గురించి ఎవరికి చెప్పకుండా చేసుకొన్నాం. సుమ, రాజీవ్ కనకాల మా పెళ్లికి పెద్దలుగా వ్యవహరించారు అంటూ ఈటీవీ ప్రభాకర్ తెలిపారు. దాంతో వదినమ్మ టీమ్ మెంబర్స్ సుమను అభినందించారు.

లాక్‌డౌన్‌లో ప్రభాకర్ భార్యకు సాయంగా

లాక్‌డౌన్‌లో ప్రభాకర్ భార్యకు సాయంగా

ఇక పెళ్లి ఫోటో తర్వాత ఓ వీడియోను డిస్ ప్లే చేసి ఈటీవీ ప్రభాకర్‌కు మరో షాక్ ఇచ్చారు. ఇంట్లో గిన్నెలు తోముతు ఉన్న వీడియోను చూపించారు. అది లాక్‌డౌన్‌లో నేను నా భార్యకు సహాయం చేస్తూ గిన్నెలు తోమాను. ఆ పని చేసినందుకు గొప్పగా, గర్వంగా నేను ఫీల్ అవుతాను అని ప్రభాకర్ తెలిపారు. అందుకు ప్రభాకర్‌ను సుమ అభినందించారు.

వదినమ్మ టీమ్ విజేతగా

వదినమ్మ టీమ్ విజేతగా


ఇక స్టార్ట్ మ్యాజిక్ కార్యక్రమంలో వదినమ్మ టీమ్ రచ్చ చేశారు. వినోదంతోపాటు మ్యూజిక్‌లో వారికి ఉన్న ప్రతిభను చాటుకొన్నారు. అన్నయ్య టీమ్‌పై వదినమ్మ అధిపత్యం చెలాయించారు. ఈ ఎపిసోడ్‌లో వదినమ్మ టీమ్‌ విజయం సాధించింది. వదినమ్మ ఫేమ్ మహి రూ.1 లక్ష సూట్‌కేస్ పట్టుకు రావడంతో బంపర్ ప్రైజ్‌ను సొంతం చేసుకొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X