పల్లవి ప్రశాంత్‌కు అన్యాయం.. శ్రీముఖిని ఎదిరించిన అనసూయ..

బుల్లి తెర ప్రపంచంలో ఈటీవీ (ETV) ఛానెల్ నిత్యం కొత్త కాన్సెప్ట్‌లు, వినూత్న కార్యక్రమాలతో అలరిస్తూ ముందంజలో నిలుస్తోంది. కుటుంబ ప్రేక్షకుల నుంచి యువత వరకు అందరినీ ఆకట్టుకుంటుంది. ప్రత్యేక ఈవెంట్‌లు, సెలబ్రిటీ షోలు, కామెడీ ప్రోగ్రామ్‌లను రూపొందించి తనదైన ముద్ర వేస్తుంది. తాజాగా మరోసారి అదే తరహాలో స్టార్ యాంకర్లు, జబర్దస్త్ కమెడియన్స్, రియాలిటీ షో ఫేమ్ సెలబ్రిటీలతో ఓ స్పెషల్ ఈవెంట్ రూపొందించి ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. ప్రస్తుతం ఈ ప్రోగ్రామ్‌కు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ETV Special Event Promo Goes Viral Anasuya Sreemukhi Pallavi Prashanth Hyper Aadi Fun Clash

ఇక ఓ గేమ్ సెగ్మెంట్‌లో ఆసక్తికర ఘటన జరిగింది. టాస్క్‌లో భాగంగా పల్లవి ప్రశాంత్ ఓడిపోయాడని, గేమ్ నుంచి ఎలిమినేట్ అవకాశం శ్రీముఖి చెప్పింది. దీంతో పల్లవి ప్రశాంత్ ఒక్కసారిగా షాక్‌కు గురై తనపై అన్యాయం జరిగిందంటూ వాదనకు దిగాడు. 'నువ్వు గేమ్ సరిగా చూడలేదు.. నేను ఓడిపోలేదు.. ఎలా తీస్తావు?'అంటూ సరదాగా ప్రశ్నించాడు. దీంతో వెంటనే హైపర్ ఆది (Hyper Aadi)రంగంలోకి దిగి, పల్లవి ప్రశాంత్ టీం తరపున వాదిస్తూ 'ఇది సరైన నిర్ణయం కాదు' అని శ్రీముఖితో సరదాగా గొడవపడ్డాడు.

అయితే శ్రీముఖి మాత్రం 'సంచాలక్ నిర్ణయం ఫైనల్' అంటూ గట్టిగా చెప్పి నవ్వులు పూయించింది. ఈ మాటల యుద్ధం షోలో ప్రధాన హైలైట్‌గా మారింది. ఈ సమయంలో మంచు లక్ష్మి కూడా మధ్యలోకి వచ్చి 'ప్రశాంత్ ఓడిపోయాడు.. గేమ్ రూల్స్ ప్రకారం తీసేశారు' అంటూ చెప్పింది. కానీ ప్రశాంత్ మాత్రం వెనక్కి తగ్గకుండా 'నాకు రివ్యూ కావాలి.. నేను ఓడిపోలేదు' అంటూ ఫన్నీగా స్పందించాడు.

ఇక హైపర్ ఆది తన స్టైల్‌లో సెటైర్లు పేల్చాడు. 'మీరు టీమ్ లీడర్ కాబట్టి మీ సాక్ష్యం చెల్లదు' అంటూ మంచు లక్ష్మిని ఉద్దేశించి పంచ్ వేశాడు. ఆ తర్వాత ప్రశాంత్‌పై మాట్లాడుతూ 'జీవితంలో ఓడిపోయినా పట్టించుకోడు.. కానీ, గేమ్‌లో ఓడిపోతే మాత్రం తట్టుకోలేడు' అంటూ కామెడీ డైలాగ్ చెప్పి అందరినీ నవ్వించాడు. అక్కడితో ఆగని శ్రీముఖి, 'ఆల్రెడీ పక్క ప్రకటనలో గెలిచారులే.. ఇక్కడ గెలవకపోయినా పర్వాలేదు.. సైలెంట్‌గా కూర్చోబెట్టు' అంటూ మరో సెటైర్ వేసింది. ఇది విన్నవెంటనే అక్కడున్నవాళ్లంతా నవ్వుల్లో మునిగిపోయారు.

ఈ సమయంలో అనసూయ భరద్వాజ్ పల్లవి ప్రశాంత్‌కు మద్దతుగా నిలిచిపోయింది. 'ప్రశాంత్‌ను అన్యాయంగా తీసేశారు.. నిజానికి ఇతనే గెలిచాడు' అంటూ సరదాగా వ్యాఖ్యానించింది. 'మా టీవీ గెలుస్తుంది' అంటూ డైలాగ్ వేసిన మరింత వినోదాన్ని తెచ్చింది. అదనంగా మరో సెగ్మెంట్‌లో జబర్దస్త్ కళాకారులు కళ్లకు గంతలు కట్టి దాగుడుమూతలు ఆడారు.

ఇందులో ముఖ్యంగా నరేష్‌ను ఆటపట్టించిన తీరు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. ఒక్కోసారి అతను పడిన ఇబ్బందులు, ఇతరులు చేసిన ప్రాంక్స్ షోకు మరింత ఆకర్షణీయంగా నిలిచాయి. మొదటి సెలబ్రిటీల మధ్య సరదా మాటల, హైపర్ ఆది పంచులు, శ్రీముఖి తీర్పులు, పల్లవి ప్రశాంత్ డ్రామా, అనసూయ మద్దతు.. ఇలా అన్ని అంశాలతో ఈటీవీ స్పెషల్ ఈవెంట్ ఫుల్ ఎంటర్టైన్ ప్యాకేజ్‌గా మారింది. ప్రస్తుతం ఈ ప్రోమో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X