'ఏవండోయ్ ఓనర్ గారు' అంటూ హీరోని లైన్లో పెట్టిన హారిక.. మూడు రోజులైనా ట్రెండింగ్ లోనే !

బిగ్ బాస్ హారిక అదేనండీ దేత్తడి హారిక, బిగ్ బాస్ లో ఫైనల్ దాకా వెళ్లి టాప్ 5 కంటెస్టెంట్ గా నిలిచి అదరగొట్టేసింది. బిగ్ బాస్ హారిక ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉంది. ఎందుకంటే ఆమె చేసిన తాజా వెబ్ సిరీస్ 'ఏవండోయ్ ఓనర్ గారు' ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది. ఆమె బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు బిగ్ బాస్ హౌస్ లోని కంటెస్టెంట్లకే కాక బయట ఉన్న ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరయింది ఈ భామ.

ఆ క్రేజ్ కూడా వాడుకుంటూ ఇప్పుడు తన వెబ్ సిరీస్ ను మూడు రోజులు అయినా ట్రెండింగ్ లో ఉండేలా చేస్తోంది. అయితే ఇక్కడే ఒక ఆసక్తికరమైన కిటుకు కూడా ఉంది. ఈ సిరీస్ లో హీరోగా నటించిన అఖిల్ రాజ్, నిజంగానే హీరో, ఆయన హీరోగా ఒక సినిమా కూడా రిలీజ్ కావాల్సి ఉంది. ఆ వివరాల్లోకి వెళితే

ప్రేమికులు అంటే అన్నా చెల్లెళ్ళుగా

ప్రేమికులు అంటే అన్నా చెల్లెళ్ళుగా

బిగ్ బాస్ హౌస్‌ లో అభిజీత్‌తో దేత్తడి హారికకు మంచి స్నేహం కుదిరింది. ఇది ప్రేమ అనే ఫీలింగ్ కూడా జనానికి కలిగింది. అయితే అసలు అలాంటిది ఏమీ లేదని తామిద్దరం అన్నా చెల్లెళ్ళు అని చెప్పి షాకిచ్చారు. అప్పట్లో వీరిని కలిపి 'అభిక' అంటూ ట్రెండ్ కూడా చేశారు అభిమానులు. అయిన సరే బయటకి వచ్చాక వీరిద్దరూ పెద్దగా కలిసింది లేదు. ఎవరి గోలలో వాళ్ళు ఉన్నారు.

ఓసీడీ గల ఇంటి ఓనర్ గా

ఓసీడీ గల ఇంటి ఓనర్ గా

బిగ్ బాస్ షో పూర్తి అయి బయటికి వచ్చాక... అప్పుడప్పుడు కొన్ని టీవీ షోలలో కనిపించింది కానీ ఆమె ఎలాంటి పెద్ద సినిమాలు చేయలేదు. శ్రీకారం సినిమాలో ఒక పాత్రలో నటించిన ఆమె తన యూట్యూబ్ ఛానల్ దేత్తడి కూడా పెద్దగా యాక్టివ్ గా లేదు. కానీ ఇప్పుడు లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వస్తా అన్నట్టు ప్రస్తుతం సాలిడ్ గా యూట్యూబ్ లో ట్రేండింగ్ లో ఉంది. ఏవండోయ్ ఓనర్ గారు... అంటూ రిలీజ్ అయిన ఈ సిరీస్ మొదటి ఎపిసోడ్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ వెబ్ సిరీస్ లో ఓసీడీ గల ఇంటి ఓనర్ గా హారిక నటిస్తోంది.

అఖిల్ రాజ్ హీరోగా విందు భోజనం

అఖిల్ రాజ్ హీరోగా విందు భోజనం

'ఏవండోయ్ ఓనర్ గారు' సిరీస్ ని హరీశ్ నాగరాజు తెరకెక్కించాడు. ఇందులో అఖిల్ రాజ్ హీరోగా చేస్తున్నారు. అయితే ఈ అఖిల్ రాజ్ ఇప్పటికే ఒక సినిమాలో హీరోగా నటిస్తున్నారు. విందుభోజనం పేరుతో ఈ సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది. హీరో షెఫ్ గా ఎదగాలి అనుకుని అలా ఎదిగిన సినిమాలు చాలా వచ్చాయి. అలాంటి థీమ్ నే తీసుకొని కార్తీక్ అనే దర్శకుడు విందుభోజనం పేరుతో సినిమా తీస్తున్నారు.

Recommended Video

Actor Prakash Raj's Green India Challenge | Praised CM KCR
ఇద్దరి క్రేజ్ కలవడంతో

ఇద్దరి క్రేజ్ కలవడంతో

అమృతం సీరియల్ తో ఫేమస్ అయిన హర్షవర్ధన్, నటి అనిత చౌదరి కీలక పాత్రలలో నటిస్తున్న ఈ విందు భోజనం సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ కొద్ది రోజుల క్రితం రిలీజ్ చేశారు. యారోస్ ప్రొడక్షన్ లో బూసమ్ జగన్మోహన్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అఖిల్ రాజ్, ఐశ్వర్య హోలక్కల్, అభిషేక్, సిద్దార్ద్ గొల్లపూడి తదితరులు నటిస్తున్నారు. దేత్తడి హారిక ఛానల్ కి అఖిల్ క్రేజ్ కూడా కలిసొచ్చింది. ఫ్రెష్ ఫేస్ కావడం, అందగాడు కావడంతో ఈ సిరీస్ మీద ఆసక్తి పెరుగుతోంది. అందుకే రిలీజ్ చేసి మూడు రోజులు దాటినా ఈ సిరీస్ దగ్గర దగ్గర రెండు మిలియన్ వ్యూస్ సాధించి ట్రేండింగ్ లో ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X