లైఫ్‌ను మారుస్తానంటూ ఎన్టీఆర్ స్పెషల్ వీడియో: ఆరోజే సర్‌ప్రైజ్.. మరి దాన్ని వెతకాలి కదా సార్ అంటూ!
నందమూరి తారక రామారావు మనవడిగా సినిమాల్లోకి ప్రవేశించినా.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును అందుకుని చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ఎదిగిపోయాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. యాక్టింగ్, డ్యాన్స్, డైలాగ్స్, ఫైట్స్, సింగింగ్ ఇలా అన్ని రంగాల్లోనూ రాణిస్తూ టాలీవుడ్ ఆల్‌రౌండర్‌గా పేరు సంపాదించుకున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో కొన్నేళ్లుగా వరుస విజయాలు అందుకుంటూ దూసుకెళ్తున్నాడు. ఈ నేపథ్యంలోనే తారక్ కొత్త ప్రయాణాన్ని మొదలెట్టాడు. తాజాగా గురించి ఓ వీడియో వచ్చింది. ఆలస్యమెందుకు దానిపై మీరూ ఓ లుక్కేయండి!

టాలీవుడ్ చరిత్రలోనే భారీ సినిమాలో భాగం
వరుస విజయాలతో ఫుల్ జోష్ మీదున్నాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. ఈ క్రమంలోనే ప్రస్తుతం అతడు దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తోన్న RRRలో రామ్ చరణ్‌తో కలిసి నటిస్తున్నాడు. డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో తారక్.. కొమరం భీంగా, చరణ్.. అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

ఇప్పటికే నాలుగు సీజన్లు... సీనియర్ స్టార్లు
దాదాపు 120 దేశాల్లో ప్రసారం అవుతూ తెలుగులో కూడా వచ్చిన షో 'మీలో ఎవరు కోటీశ్వరుడు'. ఎన్నో అంచనాల నడుమ వచ్చిన ఇది.. ఇప్పటికే నాలుగు సీజన్లను పూర్తి చేసుకుంది. అన్ని భాషల్లో మాదిరిగానే మన దగ్గర కూడా ఈ షో సూపర్ సక్సెస్ అయింది. ఇందులో మొదటి మూడింటికీ అక్కినేని నాగార్జున.. నాలుగో దానికి మెగాస్టార్ చిరంజీవి హోస్టులుగా చేశారు.

ఐదో సీజన్‌తో మార్పులు... అన్నీ కొత్తగానే
'మీలో ఎవరు కోటీశ్వరుడు' గేమ్ షో నాలుగు సీజన్లు స్టార్ మా చానెల్‌లో ప్రసారం అయిన విషయం తెలిసిందే. దీని ద్వారా సదరు చానెల్‌కు భారీ స్థాయిలో రేటింగ్ వచ్చింది. అప్పట్లో ఇదే నెంబర్ వన్ గేమ్ షోగా ఉండేది. కానీ, అక్కడితోనే దీని ప్రస్థానం ఆగిపోయింది. ఇక, ఈ సారి ఈ గేమ్ షో జెమినీ టీవీలో ప్రసారం కాబోతుంది. దీనికి 'ఎవరు మీలో కోటీశ్వరులు' అని టైటిల్ మార్చారు.

మీ ఆశలని నిజం చేసే గేమ్ షో అంటూ అలా
తాజాగా జెమినీ టీవీలో ప్రసారం కాబోతున్న 'ఎవరు మీలో కోటీశ్వరులు' షో ప్రోమోను విడుదల చేశారు. అందులో దీని ప్రస్థానం గురించి వివరించారు నిర్వహకులు. అంతేకాదు, 'మీ జీవితాలని మార్చే గేమ్ షో.. మీ ఆశలని నిజం చేసే గేమ్ షో ''ఎవరు మీలో కోటీశ్వరులు'' త్వరలో మీ జెమినీ టీవీలో రాబోతుంది సిద్ధంగా ఉండండి' అంటూ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

అన్నీ తెలిసే ఇక్కడ.. బతకాలి కదా సార్ అని
'ఎవరు మీలో కోటీశ్వరులు' నుంచి తాజాగా మరో కొత్త ప్రోమో విడుదలైంది. ఇందులో ఓ ఫ్యామిలీ చార్మినార్ చూడ్డానికి వస్తే.. టూరిస్టు గైడ్ దాని గురించి తప్పుగా చెబుతాడు. అప్పుడు పక్కనే ఉన్న ఆటో డ్రైవర్ ఆ కట్టడం చరిత్రను వెల్లడిస్తాడు. దీంతో వాళ్లంతా ఆశ్చర్యపోయి.. అన్నీ తెలిసి ఇక్కడున్నారేంటి? అని ప్రశ్నిస్తారు. దీనికి బతకాలి కదా సార్ అంటూ ఆటోవాలా బదులిస్తాడు.

దాన్ని వెతకాలి కదా సార్ అంటూ మరొకటి
వాళ్ల మధ్య సంభాషణ పూర్తయిన వెంటనే 'ఎవరు మీలో కోటీశ్వరులు' హోస్టుగా జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ ఇస్తాడు. రావడం రావడమే ఆటో డ్రైవర్‌ను ఉద్దేశిస్తూ.. 'మరి గెలుపును వెతకాలి కదా సార్. ఇక్కడ కథ మీది.. కల మీది. ఆట నాది.. కోటి మీది. రండి గెలుద్దాం.. ఎవరు మీలో కోటీశ్వరులు' అంటూ మరోసారి గంభీరమైన గొంతుతో డైలాగ్ చెప్పాడు. ఈ ప్రోమో బాగా ఆకట్టుకుంటోంది.
లైఫ్‌ను మారుస్తానంటూ యంగ్ టైగర్ ప్రకటన
ఇక, ఇదే ప్రోమోలో అదిరిపోయే సర్‌ప్రైజ్‌ను వెల్లడించాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. 'మార్చి 29.. రాత్రి 8.15 గంటలకు మీ లైఫ్‌ను మార్చే మొదటి ప్రశ్న. రెడీగా ఉండండి' అంటూ ప్రకటించాడతను. అంటే ఆరోజు చెప్పే జవాబును బట్టి 'ఎవరు మీలో కోటీశ్వరులు' షోకు ఎంపిక అయ్యే అవకాశాలు ఉంటాయని తెలుస్తోంది. దీంతో ఆరోజు కోసం ప్రేక్షకులంతా వేయి కళ్లతో వేచి చూస్తున్నారు.


Click it and Unblock the Notifications











