Evaru Meelo Koteeswarulu: రాజా రవీంద్ర ప్రైజ్‌మనీలో భారీ కోత.. పేరుకు కోటి.. ఇచ్చేది మాత్రం ఇంతే!

తెలుగు బుల్లితెరపై కొంత కాలంగా ఎన్నో వినోదాత్మక కార్యక్రమాలు వస్తున్నాయి. అయితే, వాటిలో ఒక్కటి మాత్రమే ప్రేక్షకులకు ఎంటర్‌టైన్‌మెంట్‌ను ఇవ్వడంతో పాటు కోటీశ్వరులను చేయాలన్న ఉద్దేశంతో ప్రసారం అవుతోంది. అదే 'కౌన్ బనేగా కరోడ్‌పతీ'కి ఆధారంగా మొదలైన 'మీలో ఎవరు కోటీశ్వరుడు'. తెలుగులో ఏకంగా నాలుగు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో.. కొద్ది రోజుల క్రితమే ఐదో సీజన్‌తో వచ్చేసింది. జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న ఈ షోకు ప్రేక్షకుల నుంచి మోస్తరు స్పందనే వస్తుందని చెప్పాలి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ షోలో రాజా రవీంద్ర అనే కంటెస్టెంట్ ఏకంగా కోటి రూపాయలు గెలుచుకున్నాడు. కానీ ట్యాక్సులు పోను ఆయనకు అసలు దక్కింది మాత్ర చాలా తక్కువేనట. ఆ వివరాలు మీకోసం!

Recommended Video

Evaru Meelo Koteeswarulu : Raja Ravindra 1Cr Prize Money లో కోత || Oneindia Telugu
రామారావు సారథ్యంలో ఐదో సీజన్

రామారావు సారథ్యంలో ఐదో సీజన్

సుదీర్ఘ విరామం తర్వాత 'మీలో ఎవరు కోటీశ్వరుడు' ఐదో సీజన్‌ను 'ఎవరు మీలో కోటీశ్వరులు' అని టైటిల్‌తో మొదలెట్టారు. దీన్ని గతంలో మాదిరిగా స్టార్ మాలో కాకుండా జెమినీ టీవీలో ప్రసారం చేస్తున్నారు. ఈ సీజన్‌ను టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అలియాస్ రామారావు హోస్ట్ చేస్తున్నాడు. దీంతో దీనిపై ఆరంభం నుంచే అంచనాలు ఏర్పడ్డాయి.

ఈ సీజన్‌కు భారీగా వచ్చిన రేటింగ్

ఈ సీజన్‌కు భారీగా వచ్చిన రేటింగ్

'ఎవరు మీలో కోటీశ్వరులు' కర్టన్ రైజర్ ఎపిసోడ్‌కు రామ్ చరణ్ గెస్టుగా వచ్చాడు. దీంతో దీనికి 11 పైచిలుకు రేటింగ్ దక్కింది. ఇది షో చరిత్రలోనే అత్యధిక రేటింగ్ కావడంతో రికార్డు నమోదైంది. ఆ తర్వాత కూడా దీనికి ప్రేక్షకుల స్పందన క్రమక్రమంగా పెరుగుతూ వచ్చింది. ఎన్టీఆర్ అద్భుతమైన హోస్టింగ్‌తో ఇది ప్రేక్షకులను మరింత ఆకర్షిస్తూ సక్సెస్‌ఫుల్‌గా సాగుతోంది.

కోటి గెలుచుకున్న రాజా రవీంద్ర

కోటి గెలుచుకున్న రాజా రవీంద్ర

'ఎవరు మీలో కోటీశ్వరులు' షో ప్రస్తుతం ఐదో సీజన్‌ను నడుపుకుంటోంది. అయినప్పటికీ ఇప్పటి వరకూ ఇందులో యాభై లక్షల రూపాయలు కూడా గెలుచుకోలేకపోయారు. ఈ నేపథ్యంలో తాజా సీజన్‌లో ఎస్సైగా పని చేస్తున్న రాజా రవీంద్రం అనే కంటెస్టెంట్ ఏకంగా కోటి రూపాయలు గెలుచుకున్నారు. దీనికి సంబంధించిన ఎపిసోడ్ మంగళవారమే పూర్తైన విషయం తెలిసిందే.

బుల్లితెరపై అదిరిపోయే రికార్డులు

బుల్లితెరపై అదిరిపోయే రికార్డులు

'ఎవరు మీలో కోటీశ్వరులు' షోలో రాజా రవీంద్ర పాల్గొన్న ఎపిసోడ్స్‌కు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వచ్చినట్లు తెలుస్తోంది. ఇక, ఇందులో రాజా రవీంద్ర కోటి రూపాయలు గెలవడం ద్వారా తెలుగు బుల్లితెరపై అత్యధిక ప్రైజ్‌మనీ గెలిచిన కంటెస్టెంట్‌గా నిలిచారు. అలాగే, ఎన్టీఆర్ కూడా కోటి రూపాయల చెక్ మీద సంతకం చేసి, అందించిన హోస్టుగా రికార్డును క్రియేట్ చేశాడు.

రాజా రవీంద్ర ప్రైజ్‌మనీలో కోత

రాజా రవీంద్ర ప్రైజ్‌మనీలో కోత

'ఎవరు మీలో కోటీశ్వరులు' షోలో రాజా రవీంద్ర కోటి రూపాయలు గెలుచుకుని తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా గుర్తింపును అందుకున్న విషయం తెలిసిందే. అయితే, ఇప్పుడు అతడు గెలుచుకున్న ప్రైజ్‌మనీ విషయంలోనూ ఎన్నో రకాల చర్చలు జరుగుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. రాజా రవీంద్ర గెలుచుకున్న మొత్తంలో భారీ కోత పడినట్లు తెలిసింది.

పేరుకు కోటి.. ఇచ్చేది ఇంతేనట

పేరుకు కోటి.. ఇచ్చేది ఇంతేనట


ఎన్టీఆర్ 'ఎవరు మీలో కోటీశ్వరులు' షోలో రాజా రవీంద్ర కోటి రూపాయలు గెలుచుకున్నప్పటికీ అతడికి రూ. 68.80 లక్షలు మాత్రమే చేతికి వచ్చినట్లు తెలిసింది. ఆదాయపు పన్న చట్టం ప్రకారం.. ఏదైనా షోలో 10 వేల కంటే ఎక్కువ గెలిస్తే 31.2% పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అందుకే ఇప్పుడు రాజా రవీంద్ర ప్రైజ్‌మనీలో రూ. 31.20 లక్షలు కట్ అయ్యాయట.

 రాజా రవీంద్ర కుటుంబ నేపథ్యం

రాజా రవీంద్ర కుటుంబ నేపథ్యం

'ఎవరు మీలో కోటీశ్వరులు' షోలో కోటి గెలుచుకున్న కంటెస్టెంట్ బీ రాజా రవీంద్ర. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన సుజాతనగర్ గ్రామ వాస్తవ్యుడు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోని సైబర్ సెల్‌లో సబ్ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. రిటైర్డ్‌ బ్యాంకు ఉద్యోగి బీవీఎస్‌ఎస్‌ రాజు-శేషుకుమారి కుమారుడే రాజా రవీంద్ర. ఆయనకు భార్య ఇద్దరు పిల్లులున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X