NTR's EMK show: రాంచరణ్ రూ.కోటి ఎందుకు గెలువలేదంటే? చెర్రీని ఉపాసాన Mr.C పిలవడం వెనుక సీక్రెట్ ఇదే!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఎవరు మీలో కోటీశ్వరులు రియాలిటీ షో వైభవంగా ప్రారంభమైంది. మెగా పవర్ స్టార్ రాంచరణ్ కర్టన్ రైజర్‌లో హోస్ట్‌గా పాల్గొన్నారు. ఆగస్టు 22న ప్రారంభమైన కర్టెన్ రైజర్‌ కొనసాగింపుగా ఆగస్టు 23 రోజున ఎపిసోడ్ ప్రారంభమైంది. గత ఎపిసోడ్‌లో ఎనిమిది ప్రశ్నలకు సక్సెస్ ఫుల్‌గా సమాధానాలు చెప్పి 80 వేల రూపాయలు గెలుచుకొన్న రాంచరణ్ 9వ ప్రశ్నతో ఎపిసోడ్‌ను ప్రారంభించారు. తాజా ఎపిసోడ్‌లో ఎన్టీఆర్ అడిగిన ప్రశ్నలు.. వాటికి రాంచరణ్ సమాధానం చెప్పిన తీరు.. అలాగే చెర్రీకి మిస్టర్ సీ అని పేరు వచ్చిందనే విషయాలు మీ కోసం..

మీలో ఎవరు కర్టెన్ రైజర్ రెండో ఎపిసోడ్‌లో అడిగిన ప్రశ్నలు కింద పేర్కొనడం జరిగింది

మీలో ఎవరు కర్టెన్ రైజర్ రెండో ఎపిసోడ్‌లో అడిగిన ప్రశ్నలు కింద పేర్కొనడం జరిగింది

9. జూన్ 2020లో ఇండియా-చైనా మధ్య వివాదం తలెత్తిన గల్వాన్ లోయ ఏ ప్రాంతంలో ఉన్నది?

a) లద్దాఖ్
b) హిమాచల్ ప్రదేశ్
c) రాజస్థాన్
d) అరుణాచల్ ప్రదేశ్

Answer: లద్దాఖ్

అయితే ఈ ప్రశ్నకు ఆలోచిస్తూ సమయాన్ని మరిచిపోయిన రాంచరణ్.. చివరి రెండు సెకన్లలో సమాధానం చెప్పాడు. దాంతో ఎన్టీఆర్ కంగారు పడిపోయాడు. అయితే సరిగ్గా సమాధానం చెప్పడంతో రూ.1.60 లక్షలు గెలుచుకొన్నాడు. లడాఖ్‌ను కొనుగొన్న వ్యక్తి గులాం రసూల్ గల్వాన్ అని పేరు చెప్పారు. ఆ ప్రాంతాన్ని కనుగొన్నందుకు గాను.. గల్వాన్ అని ఆ ప్రదేశానికి పేరు పెట్టారు అంటూ ఎన్టీఆర్ చెప్పారు.

10. లండన్‌లోని రాయల్ అల్బర్ట్ హాల్‌లో లైవ్ ఆర్కెస్ట్రాతో ప్రదర్శించబడిన మొట్టమొదటి భారతీయ చిత్రం ఏది?

10. లండన్‌లోని రాయల్ అల్బర్ట్ హాల్‌లో లైవ్ ఆర్కెస్ట్రాతో ప్రదర్శించబడిన మొట్టమొదటి భారతీయ చిత్రం ఏది?

a) బాహుబలి: ది బిగినింగ్

b) దంగల్
c) 2.0
d) కేజీఎఫ్: చాప్టర్ 2

Answer: బాహుబలి: ది బిగినింగ్

రాంచరణ్ ఈ ప్రశ్నకు సమాధానం చెబుతూ.. ప్రపంచంలో తెలుగువారు ఈ ప్రశ్నకు సమాధానం తెలియకపోతే సిగ్గుపాడాలి. మీ జక్కన్న, మా రాజమౌళిగారు రూపొందించిన బాహుబలి చిత్రం కరెక్ట్ అన్సర్. ఏదైనా డౌట్ ఉందా అంటే.. ఇండియన్‌గా చెబుతున్నాను.. ఫిక్స్ చేయి అని అడగానే.. ఆ సమాధానం లాక్ చేశారు. దీంతో రాంచరణ్ 3.20 లక్షలు సంపాదించారు. బాహుబలి సినిమా చూసిన తర్వాత నీకు కలిగిన ఫీలింగ్ గురించి చెబుతూ.. భారీగా లేఖ రాశాను. బాహుబలి ట్రూ మల్టీస్టారర్ అని రాంచరణ్ అన్నారు. RRR సినిమా ప్రారంభమైన తర్వాత కొద్ది రోజులకు తన టీమ్‌తో కలిసి లండన్‌కు వెళ్లారు అని రాంచరణ్ చెప్పారు.

11. 1971 బంగ్లాదేశ్ యుద్ధం సమయంలో మునిగిపోయిన జలాంతర్గామీ PNS ఘాజీ అసలు పేరు ఏమిటి?

11. 1971 బంగ్లాదేశ్ యుద్ధం సమయంలో మునిగిపోయిన జలాంతర్గామీ PNS ఘాజీ అసలు పేరు ఏమిటి?

a) చెరోకి

b) హెర్కులీస్
c) ఫోర్డ్
d) డియాబ్లో

Answer: డియాబ్లో

11వ ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయిన రాంచరణ్ వీడియో కాల్ ఏ ఫ్రెండ్ లైఫ్ లైన్‌ను ఉపయోగించుకొన్నారు. రానా దగ్గుబాటి కాల్ చేయగా.. డియాబ్లో అని సమాధానం చెప్పారు. దాంతో రాంచరణ్ రూ.6.40 లక్షలు గెలుచుకొన్నారు.

12. నాలుగు సార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన సెబాస్టియన్ వెట్టెల్ 2021 సీజన్లో ఏ ఫార్మూలా 1 టీమ్‌కు డ్రైవ్ చేస్తున్నారు?

12. నాలుగు సార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన సెబాస్టియన్ వెట్టెల్ 2021 సీజన్లో ఏ ఫార్మూలా 1 టీమ్‌కు డ్రైవ్ చేస్తున్నారు?

a) రెడ్ బుల్

b) విలియమ్స్
c) ఆస్టన్ మార్టిన్
d) మెక్ లారెన్

Answer: ఆస్టన్ మార్టిన్

రాంచరణ్ చెప్పిన సమాధానం కరెక్ట్ కావడంతో రూ.12.5 లక్షలు గెలుచుకొన్నాడు. సీ ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకొన్న రాంచరణ్‌ను మిస్టర్ C అంటూ పిలిచి.. ఉపాసన నిన్ను ఎందుకు మిస్టర్ C అని పిలుస్తుందని అడిగితే.. రాంచరణ్ సమాధానం ఇస్తూ.. లాస్ ఏంజెలెస్‌కు వెకేషన్‌కు వెళ్లాం. ఆ ప్రాంతంలో ఓ హోటల్‌ పేరు మిస్టర్ సీ. ప్రపంచ ప్రసిద్ది గాంచిన చెఫ్‌ పేరు మిస్టర్ చిప్రియాన్. ఆ హోటల్‌లో ఉన్నప్పటి నుంచి నన్ను మిస్టర్ సీ అని పిలుస్తుంటారు. అలా నాకు ఆ పేరు వచ్చింది అని రాంచరణ్ చెప్పారు.

Recommended Video

Bigg Boss Telugu Season 5 Update : Jr NTR టీవి షో కూడా అప్పుడే ! || Filmibeat Telugu
13. ఏ పాలకుడి వద్ద బ్యూసీ పాలెస్ అనే యుద్దాశ్వం ఉండేది?

13. ఏ పాలకుడి వద్ద బ్యూసీ పాలెస్ అనే యుద్దాశ్వం ఉండేది?

a) అశోక ది గ్రేట్

b) అక్బర్ ది గ్రేట్
c) అలెగ్జాండర్ ది గ్రేట్
d) ఆల్ఫ్రెడ్ ది గ్రేట్

Answer: అలెగ్జాండర్ ది గ్రేట్

రూ.25 లక్షల కోసం అడిగిన ప్రశ్నకు సమాధానం రాంచరణ్‌కు కష్టతరంగా మారింది. గురువు గారు కష్టమైన ప్రశ్న అడిగారు. సమాధానం చెప్పలేకపోతే.. లైఫ్ లైన్ ఉపయోగించుకొ అంటూ ఎన్టీఆర్ సలహా ఇచ్చారు. దాంతో 50:50 లైఫ్ లైన్ ఉపయోగించుకొన్నారు. లైఫ్ లైన్ ఆప్షన్ యూజ్ చేసుకోగా.. అశోక ది గ్రేట్.. అలెగ్జాండర్ ది గ్రేట్ అనే ఆప్షన్లు మిగిలాయి. చివరకు రాంచరణ్ అలెగ్జాండర్ ది గ్రేట్ అని సమాధానం చెప్పడంతో రూ.25 లక్షలు గెలుచుకొన్నాడు. ఎవరు మీలో కోటీశ్వరులు షోలో రూ.50 లక్షల ప్రశ్నకు వెళ్లే ముందు.. సమయం ముగిసిందని సంకేతం హూటర్ రూపంలో అందడంతో కర్టెన్ రైజర్ రెండో ఎపిసోడ్ ముగిసింది. ఇంకా లైఫ్‌లైన్స్ ఉండి.. చక్కగా ఆడుతున్నప్పటికీ.. సమయం మించిపోవడంతో రాంచరణ్ కోటి రూపాయలు గెలుచుకోలేకపోయాడు. దాంతో రామ్ చరణ్, రామారావు ఆడిన గేమ్ ఫన్నీగా, ఎమోషనల్‌గా ముగిసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X