For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Evaru Meelo Koteeswarulu ఫస్ట్ ఎపిసోడ్ లీక్.. అదిరే సర్ప్రైజ్ లు.. రామ్ చరణ్ ఎంత గెలిచాడంటే?

  |

  జూనియర్ ఎన్టీఆర్ దాదాపు నాలుగేళ్ల తర్వాత మళ్లీ బుల్లితెరలో కనిపించడానికి సిద్ధమయ్యారు. ఆయన హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఎవరు మీలో కోటీశ్వరులు అనే షో ఈరోజు కర్టెన్ రైజర్ ఈవెంట్ తో ప్రారంభం కాబోతోంది. ఈరోజు రాత్రి 8:30 గంటలకు మొదటి ఎపిసోడ్ టెలికాస్ట్ అవుతోంది. అయితే మొదటి ఎపిసోడ్ లో రామ్ చరణ్ గెస్ట్ గా అటెండ్ అయి ఉండడంతో ఈ షో మీద మరింత అంచనాలు పెరుగుతున్నాయి. అయితే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు లీకయ్యాయి అని ప్రచారం జరుగుతుంది. ఆ వివరాల్లోకి వెళితే

  ఇక లేదనుకున్నా

  ఇక లేదనుకున్నా

  గతంలో మీలో ఎవరు కోటీశ్వరుడు అనే షో మా టీవీ లో ప్రసారం అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ షో ఇప్పటికే నాలుగు సీజన్లలో పూర్తి చేసుకోగా కొన్ని సీజన్లకు చిరంజీవి హోస్ట్ గా వ్యవహరించారు. కొన్ని సీజన్లకు నాగార్జున హోస్ట్ గా వివరించారు. అయితే ఏమైందో ఏమో ఈ షో అనుకోకుండా ఆగిపోయింది. హిందీ లో విజయవంతంగా అనేక సీజన్లను పూర్తి చేసుకున్న కౌన్ బనేగా కరోడ్పతి కి తెలుగు వర్షన్ గా ప్రారంభించిన ఈ షో పెద్దగా ప్రేక్షకులకు దగ్గర అవ్వలేదని అందుకే ఈ షో మళ్లీ ప్లాన్ చేసే అవకాశం లేదని ప్రచారం జరిగింది.

  అంచనాలను పెంచేలా

  అంచనాలను పెంచేలా

  అయితే అనూహ్యంగా పేరు మార్చి ఎవరు మీలో కోటీశ్వరులు అనే పేరుతో దీనిని జెమినీ టీవీలో ప్రసారం చేయడానికి ప్లాన్ సిద్ధం చేశారు. జూనియర్ ఎన్టీఆర్ షో హౌస్ట్ వ్యవహరిస్తుండడంతో షో మీద విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి.. దానికి తగ్గట్టు రామ్ చరణ్ తో కలిసి మొదటి ఎపిసోడ్ చేస్తున్నట్లు కొన్ని ప్రోమోలు రిలీజ్ చేయడంతో ఈ కర్టెన్ రైజర్ ఎపిసోడ్ మీద బీభత్సమైన క్రేజ్ నెలకొంది. అయితే ఈ మొదటి ఎపిసోడ్ ద్వారా చాలా సర్ప్రైజ్ ప్యాకేజీలు అభిమానుల కోసం ఈ ఇద్దరు హీరోలు సిద్ధం చేశారని అంటున్నారు.

  స్పెషల్ సాంగ్

  స్పెషల్ సాంగ్

  ఈ ఎపిసోడ్ లో ఇద్దరూ కలిసి ఒక పాట పాడారు అని లీకేజీల ద్వారా వెలుగులోకి వచ్చింది. ఒకరకంగా ఎన్టీఆర్ ఇప్పటికే బిగ్ బాస్ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు బుల్లితెర ద్వారా పలకరించగా రామ్ చరణ్ మొట్టమొదటిసారిగా బుల్లితెర మీద ఒక షోలో కనిపిస్తున్నట్లు అయింది.. అలాగే మొట్టమొదటి సారిగా ఆయన పాట పాడుతున్నట్టు చెబుతున్నారు. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన అయితే ఇప్పటివరకు వెలువడలేదు. ఈ షోలో రామ్ చరణ్ పాటతో పాటు ఆట కూడా ఆకట్టుకునే విధంగా ఉందని అంటున్నారు.

  ఎంత గెలిచాడు అంటే

  ఎంత గెలిచాడు అంటే

  విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు రామ్ చరణ్ ఏకంగా పాతిక లక్షల రూపాయలను ఈ షో ద్వారా గెలిచారు. గెలిచిన వెంటనే ఆ అమౌంట్ ని స్వచ్ఛంద సంస్థలకు ఆయన విరాళంగా ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి ఇది ఒక రకంగా పుకారు అయినా నిజమే అయితే ఒక టాప్ సెలబ్రిటీ ఇంత భారీ మొత్తంలో గెలవటం ఇదే టెలివిజన్ చరిత్రలో మొదటిసారి అవ్వచ్చు అని అంటున్నారు. మొత్తం మీద ఈ మొదటి ఎపిసోడ్ కోసం అందరూ కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

  నాలుగేళ్ల తర్వాత

  నాలుగేళ్ల తర్వాత

  సుమారు నాలుగేళ్ల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ మళ్లీ బుల్లితెర మీద సందడి చేయనున్నారు. ఎవరు మీలో కోటీశ్వరులు గంట పాటు ప్రసారం కాబోతోంది.. సోమవారం నుండి శుక్రవారం వరకు 8:30 నుంచి 9:30 వరకు ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ కాబోతోంది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ రోజు చిరంజీవి పుట్టిన రోజు కూడా. ఈ సందర్భంగా చరణ్ తో చిరు కి సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు కూడా పంచుకునేలా ఎన్టీఆర్ మాట్లాడారని అంటున్నారు.

  Bigg Boss Telugu Season 5 Update : Jr NTR టీవి షో కూడా అప్పుడే ! || Filmibeat Telugu
  ఆర్ఆర్ఆర్ సినిమాలో

  ఆర్ఆర్ఆర్ సినిమాలో

  ఇక సినిమాల విషయానికి వస్తే ఈ ఇద్దరూ కలిసి రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకమైన మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా విడుదల కావాల్సి ఉన్నా కరోనా కారణంగా వాయిదా పడింది. ఈ ఏడాది దసరా సందర్భంగా 13 అక్టోబర్ 2021న సినిమా రిలీజ్ అవుతుందని ప్రచారం జరుగుతూ ఉండగా లేదు సినిమా వచ్చే ఏడాది వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని కొద్ది రోజులలో అధికారిక ప్రకటన వెలువడుతుందని ప్రచారం జరుగుతోంది.

  English summary
  Jr NTR-hosted Evaru Meelo Koteeswarulu is all set to launch with a grand curtain-raiser today on August 22.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X