twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Evaru Meelo Koteeswarulu: ప్రశ్నల మీద దారుణమైన ట్రోల్స్..మరీ ఇలానా అడిగేది.. అసలు కధ ఏంటంటే?

    |

    జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా రూపొందుతున్న మీలో ఎవరు కోటీశ్వరులు షో ఇప్పుడు జెమినీ టీవీలో ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే. గతంలో కౌన్ బనేగా కరోడ్ పతి అనే హిందీ సోనీ ఆధారంగా చేసుకుని తెలుగులో మీలో ఎవరు కోటీశ్వరుడు అనే షో నాలుగు సీజన్లు సక్సెస్ ఫుల్ గా పూర్తి చేయగా దాని పేరు మార్చి ఇప్పుడు ఎవరు మీలో కోటీశ్వరులు అనే షోగా టెలికాస్ట్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ షోలో అడుగుతున్న ప్రశ్నల మీద పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతుంది. ఆ వివరాల్లోకి వెళితే

    కౌన్ బనేగా కరోడ్ పతి

    కౌన్ బనేగా కరోడ్ పతి

    హిందీలో కౌన్ బనేగా కరోడ్ పతి అనే షో అమితాబ్ బచ్చన్ హోస్ట్ గా టెలికాస్ట్ అవుతున్న సంగతి తెలిసిందే. విపరీతమైన ప్రేక్షక ఆదరణ పొందడంతో ఈ షోను తెలుగులో మీలో ఎవరు కోటీశ్వరుడు అనే పేరుతో రూపొందించారు.. నాగార్జున హోస్ట్గా 2014 జూన్ నెలలో మొదటి సీజన్ మొదలైంది, అదే ఏడాది డిసెంబర్ నెలలో రెండో సీజన్, 2015 నవంబర్ నెలలో మూడవ సీజన్ టెలికాస్ట్ అయ్యాయి. అయితే అనూహ్యంగా నాగార్జున తప్పుకోవడంతో ఈ షోను చిరంజీవి 2017 ఫిబ్రవరి నుంచి నాలుగో సీజన్ నడిపారు.

    ఎన్టీఆర్ అడుగుతున్న ప్రశ్నలలో

    ఎన్టీఆర్ అడుగుతున్న ప్రశ్నలలో

    ఆ తర్వాత అనూహ్యంగా తెలుగులోకి బిగ్ బాస్ ఎంటర్ కావడంతో ఈ షోకి బ్రేకులు పడ్డాయి. అలా ఈ షో స్లాట్ లన్నీ బిగ్ బాస్ కు షిఫ్ట్ కాగా ఇక ఈ షో ఉండకపోవచ్చని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా జెమినీ టీవీ వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా ఈ ప్రోగ్రాంని ఎవరు మీలో కోటీశ్వలు అనే పేరుతో మార్చి ఆగస్టు 22 వ తేదీ నుంచి ప్రసారం చేస్తున్నారు. ఈ షోకి పేరు మార్చడం వెనుక కారణాలు కూడా ఎన్టీఆర్ ఒకానొక ఎపిసోడ్ లు పంచుకున్నారు. అయితే ఇదంతా బాగానే ఉన్నా ఇప్పుడు అసలు చిక్కు మాత్రం ఎన్టీఆర్ అడుగుతున్న ప్రశ్నలలోనే వచ్చి పడుతోంది

    ప్రశ్నలు వింటుంటే నవ్వొస్తోంది

    ప్రశ్నలు వింటుంటే నవ్వొస్తోంది

    నిజానికి ఈ షోను బుల్లితెర ప్రేక్షకులను బాగానే ఆదరిస్తున్నారు. వాళ్లకు ప్రశ్నలు ఎలా ఉన్నాయి అనే విషయం మీద ఆసక్తి ఉండదు కానీ ఎన్టీఆర్ ఏం చెబుతాడు? ఎవరు ఎంత గెలుచుకున్నారు ? అనే వాటి మీద ఆసక్తి కనబరుస్తూ ఉంటారు. కానీ ఇందులో అడుగుతున్న ప్రశ్నలు విషయానికి వచ్చేసరికి నెటిజన్లు మాత్రం పెద్ద ఎత్తున ట్రోలింగ్ కు దిగుతున్నారు.. స్కూల్ పిల్లల ని అడిగే ప్రశ్నలు తీసుకొచ్చి ఇక్కడ అడుగుతుంటే చాలా కామెడీగా అనిపిస్తోందని, ఇలాంటి సిల్లీ ప్రశ్నలు వింటుంటే నవ్వొస్తోంది అని తమ తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేస్తున్నారు.

    అందుకే అలంటి ప్రశ్నలు

    అందుకే అలంటి ప్రశ్నలు

    సాధారణంగా ఈ ఎవరు మీలో కోటీశ్వరులు అనే షోకు ఎంపిక కావడం అనేది చాలా కఠినమైన ప్రక్రియ. రకరకాల రాతపరీక్షలు, విజ్ఞాన ప్రదర్శనల అనంతరమే ఆ షోలో అడుగుపెట్టే అవకాశం లభిస్తుంది. అంత జరిగాక ఎన్టీఆర్ లాంటి పెద్ద నటుడు ముందు కూర్చుని ఈ గేమ్ ఆడటం అనేది ఆషామాషీ వ్యవహారం కాదని అంటున్నారు. కేవలం షో ఆడడానికి వచ్చిన కంటెస్టెంట్ లు అక్కడ ఉన్న వాతావరణానికి అలవాటు పడడం కోసమే మొదటి ఐదారు ప్రశ్నలు చాలా సులభమైన ప్రశ్నలు అడుగుతున్నారు అనేది ఒక వాదన.

    ఇవేం ప్రశ్నలురా బాబు

    ఇవేం ప్రశ్నలురా బాబు

    అయితే ఈ వాదన ఎవరు పట్టించుకుంటారు చెప్పండి నెటిజన్లకు మాత్రం అడుగుతున్న సిల్లీ ప్రశ్నలు మాత్రమే కనిపిస్తున్నాయి. అందుకే మీలో ఎవరు కోటీశ్వరులు షోలో అడిగిన కొన్ని సిల్లీ ప్రశ్నలను స్క్రీన్ షాట్ తీసి మరి సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి దిగుతున్నారు. తాజా ఎపిసోడ్ లో నాలుగు జంతువుల పేర్లు ఇచ్చి దానికి ముళ్ళు అని పెడితే మరో ప్రాణి పేరు వస్తుందనే సిల్లీ క్వశ్చన్ అడిగారు, అక్కడ ఆప్షన్స్ చూసిన ఎవరికైనా ముళ్లపంది అనే విషయం తడుతోంది. మరో ప్రశ్నలో టీవీలో ఛానల్ మార్చడానికి ఏం ఉపయోగిస్తారు అనేది మరో ప్రశ్న, అప్పుడే ఊహ తెలిసిన వాడికి కూడా దాన్ని రిమోట్ కంట్రోల్ తో మారుస్తారు అనే విషయం తెలుసు కదా అది ఒక ప్రశ్న? నా అని విమర్శిస్తున్నారు.

    Recommended Video

    Bigg Boss Telugu Season 5 Update : Jr NTR టీవి షో కూడా అప్పుడే ! || Filmibeat Telugu
    ఇదే అసలు రీజన్

    ఇదే అసలు రీజన్

    ఇక అలాగే సాధారణంగా గోరింటాకు ఎక్కడ పెట్టుకోము అని అడుగుతూ మరో ప్రశ్న ఉంది, ఇవి కేవలం ఉదాహరణలు మాత్రమే ఇలాంటి ప్రశ్నలు మొదటి ఐదారు ప్రశ్నలలో కోకొల్లలు. షో నిర్వాహకులు వైపు నుంచి చూస్తే ఈ ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ అనే ఒక తతంగం ముగిసిన వెంటనే హాట్ సీట్ లోకి వెళ్ళిన కంటెస్టెంట్ మానసిక సంఘర్షణకు గురి కాకుండా ఇలాంటి చాలా సాధారణమైన అడుగుతున్నారు అనేది వారి వాదన.

    అదీకాక మొదట్లోనే కఠినమైన ప్రశ్నలు అడిగితే కనీసం పది వేల రూపాయల వరకు కూడా చేరుకొని పరిస్థితులుంటాయి. వివిధ ప్రదేశాల నుంచి హైదరాబాద్ వరకు షూటింగ్ కోసం వస్తే పదివేల రూపాయలు కూడా గెలుచుకోకుండా వెళ్ళిపోయాము అనే బాధ పడకుండా సిల్లీ ప్రశ్నలు అడిగి కనీసం పది వేల రూపాయలు అయినా వాళ్ళ చేతిలో పెట్టి పంపించాలి అనేది షో నిర్వాహకుల భావనగా తెలుస్తోంది. అయితే ఈ ట్రోలింగ్ వ్యవహారం మాత్రం ఆసక్తికరంగా మారింది అని చెప్పక తప్పదు.

    English summary
    Jr NTR’s Evaru Meelo Koteeswarulu is getting trolled for asking some silly questions.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X