దాన్ని మార్చేద్దాం రా అమ్మా అంటూ మీసం తిప్పిన ఎన్టీఆర్: ఆ అమ్మాయి లాంటి వాళ్లకు అండగా నిలుస్తూ!
తెలుగు సినీ ఇండస్ట్రీలోని స్టార్ హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ ఒకడు. బడా ఫ్యామిలీ నుంచి సినిమాల్లోకి ప్రవేశించిన అతడు.. యాక్టింగ్, డ్యాన్స్, డైలాగ్స్, ఫైట్స్, సింగింగ్ ఇలా అన్ని రంగాల్లోనూ రాణిస్తూ టాలీవుడ్ ఆల్‌రౌండర్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఇక, ఇటీవలి కాలంలో వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ఈ నేపథ్యంలోనే 'ఎవరు మీలో కోటీశ్వరులు' అనే షోతో మరోసారి బుల్లితెరపై సందడి చేయబోతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా జూనియర్ ఎన్టీఆర్‌కు సంబంధించిన వీడియో ఒకటి విడుదలైంది. ఇంకెందుకు ఆలస్యం దానిపై మీరూ ఓ లుక్కేయండి!
పొట్టి బట్టలతో టాలీవుడ్ పాపులర్ యాంకర్ ఫోటోషూట్ (ఫొటోలు)

టాలీవుడ్ చరిత్రలోనే భారీ సినిమాలో భాగం
కొన్నేళ్లుగా విజయాల పరంపరతో దూసుకుపోతున్నాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. ఈ క్రమంలోనే ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తోన్న RRRలో రామ్ చరణ్‌తో కలిసి నటిస్తున్నాడు. డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో తారక్.. కొమరం భీంగా, చరణ్.. అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

ఇప్పటికే నాలుగు సీజన్లు... సీనియర్ స్టార్లు
దాదాపు 120 దేశాల్లో ప్రసారం అవుతూ తెలుగులో కూడా వచ్చిన షో 'మీలో ఎవరు కోటీశ్వరుడు'. ఎన్నో అంచనాల నడుమ వచ్చిన ఇది.. ఇప్పటికే నాలుగు సీజన్లను పూర్తి చేసుకుంది. అన్ని భాషల్లో మాదిరిగానే మన దగ్గర కూడా ఈ షో సూపర్ సక్సెస్ అయింది. ఇందులో మొదటి మూడింటికీ అక్కినేని నాగార్జున.. నాలుగో దానికి మెగాస్టార్ చిరంజీవి హోస్టులుగా చేశారు.

ఐదో సీజన్‌తో మార్పులు... అన్నీ కొత్తగానే
'మీలో ఎవరు కోటీశ్వరుడు' గేమ్ షో నాలుగు సీజన్లు స్టార్ మా చానెల్‌లో ప్రసారం అయిన విషయం తెలిసిందే. దీని ద్వారా సదరు చానెల్‌కు భారీ స్థాయిలో రేటింగ్ వచ్చింది. అప్పట్లో ఇదే నెంబర్ వన్ గేమ్ షోగా ఉండేది. కానీ, అక్కడితోనే దీని ప్రస్థానం ఆగిపోయింది. ఇక, ఈ సారి ఈ గేమ్ షో జెమినీ టీవీలో ప్రసారం కాబోతుంది. దీనికి 'ఎవరు మీలో కోటీశ్వరులు' అని టైటిల్ మార్చారు.

మీ ఆశలని నిజం చేసే గేమ్ షో అంటూ అలా
తాజాగా జెమినీ టీవీలో ప్రసారం కాబోతున్న 'ఎవరు మీలో కోటీశ్వరులు' షో ప్రోమోను విడుదల చేశారు. అందులో దీని ప్రస్థానం గురించి వివరించారు నిర్వహకులు. అంతేకాదు, 'మీ జీవితాలని మార్చే గేమ్ షో.. మీ ఆశలని నిజం చేసే గేమ్ షో ''ఎవరు మీలో కోటీశ్వరులు'' త్వరలో మీ జెమినీ టీవీలో రాబోతుంది సిద్ధంగా ఉండండి' అంటూ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

మార్చేద్దాం రా అమ్మా అంటూ మీసం తిప్పి
ఇటీవల 'ఎవరు మీలో కోటీశ్వరులు' షో హోస్టుకు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ కోరమీసంతో స్టైలిష్‌గా దర్శనమిస్తున్నాడు. అంతేకాదు, గంభీరమైన గొంతుతో, కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఇక, తాజాగా షో నిర్వహకులు మరో ప్రోమోను విడుదల చేశారు. ఇందులో యంగ్ టైగర్ తనదైన మార్క్ డైలాగులతో అలరించాడు.
ఆకట్టుకుంటోన్న కొత్త ప్రోమో.. అమ్మాయిని
ప్రాజెక్టు వర్కులో భాగంగా స్టూడెంట్లను తీసుకుని ఓ టీచర్ గార్డెన్‌కు వెళ్తాడు. అక్కడ మామిడి శాస్త్రియ నామం అడగగా.. వాళ్లకు తెలీదు. దీంతో అక్కడే పని చేసే అమ్మాయి అది చెబుతుంది. ఆ వెంటనే మందారం గురించి కూడా చెబుతుంది. దీంతో 'ఏంటమ్మా ఇన్ని తెలిసి ఇక్కడ పని చేస్తున్నావ్' అని ఆ టీచర్ అమ్మాయిని అడుగుతాడు. అప్పుడు జీతం కోసం సార్ అని బదులిస్తుందామె.

ఆ అమ్మాయి లాంటి వాళ్లకు అండగా నిలుస్తూ
వాళ్ల డైలాగులు అయిపోగానే జూనియర్ ఎన్టీఆర్ 'ఎవరు మీలో కోటీశ్వరులు' హోస్టుగా ఎంట్రీ ఇస్తాడు. 'జీవితాన్ని మారుద్దాం రా అమ్మా. ఇక్కడ కథ మీది.. కల మీది. ఆట నాది.. కోటి మీది. రండి గెలుద్దాం.. ఎవరు మీలో కోటీశ్వరులు' అంటూ మీసం తిప్పుతూ డైలాగ్ చెబుతాడు. తద్వారా సామాన్యులకు అండగా నిలిచే షో ఇది అని చెప్పాడు. దీంతో ఈ ప్రోమో విపరీతంగా వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











