EMK: ప్రాణం ఇచ్చి తీసేస్తా అంటూ తారక్ కౌంటర్.. దేవి శ్రీ ప్రసాద్ ముందు థమన్ ఓవర్ కాన్ఫిడెన్స్

జూనియర్ ఎన్టీఆర్ మొదటగా బిగ్ బాస్ కాంట్రవర్సీ షోతో హోస్ట్ గా బుల్లి తెరకు పరిచయమైన విషయం తెలిసిందే. అయితే ఆ షో ద్వారా కాస్త సహనం కోల్పోయిన జూనియర్ ఎన్టీఆర్ మళ్లీ అటు వైపు తిరిగి చూడలేదు. భారీగా రెమ్యునరేషన్ ఆఫర్ చేసినప్పటికీ కూడా జూనియర్ ఎన్టీఆర్ ఒప్పుకోలేదు. సింపుల్ గా ప్రశ్నలడుగుతూ సాఫీగా కొనసాగే ఎవరు వీళ్లు కోటీశ్వరులు అనే క్విజ్ షో ను మొదలు పెట్టాడు. మొత్తానికి ఈ షో ద్వారా జూనియర్ ఎన్టీఆర్ బుల్లితెర ప్రేక్షకులకు మరింత దగ్గర అవుతున్నాడు అయితే ఈ దీపావళికి ఇద్దరూ టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ షో లో సందడి చేయబోతున్నారు.

మళ్ళీ ఆఫర్ చేసినప్పటికీ..

మళ్ళీ ఆఫర్ చేసినప్పటికీ..

జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా సక్సెస్ అయినట్లు బిగ్ బాస్ షో ద్వారా అంటే చాలా ఈజీగా అర్థం అయిపోయింది. మొదటి సీజన్ లోనే తారక్ స్టార్ట్ చేసిన విధానం అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. మొదటి సీజన్ భారీస్థాయిలో రేటింగ్స్ అందుకోవడంతో ఆ తర్వాత సీజన్స్ కు కూడా భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. అయితే తారక్ చేసినంతగా మరొకరు చేయలేదు అనే కామెంట్స్ కూడా వచ్చాయి. తారక్ కు మూడవ సీజన్ కు కూడా భారీగా రెమ్యునరేషన్ ఆఫర్ చేసి మళ్ళీ రప్పించాలని నిర్వాహకులు అనుకున్నారు కానీ అలాంటి షో చేయకూడదని ఎన్టీఆర్ డిసైడ్ అయ్యాడు.

కన్ఫ్యూజన్ లేకుండా..

కన్ఫ్యూజన్ లేకుండా..

ఇక ఏలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఒత్తిడికి గురి కాకుండా ఉండేలా బుల్లితెర ప్రేక్షకులకు మరింత దగ్గర అవ్వాలని జూనియర్ ఎన్టీఆర్ మీలో ఎవరు కోటీశ్వరులు కాన్సెప్ట్ ను కాస్త అటూ ఇటుగా మార్చేసి ఎవరు మీలో కోటీశ్వరులు అనే షో తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ఈ షో మొదలైనప్పటి నుంచి కూడా మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. మధ్య మధ్యలో రేటింగ్స్ కాస్త తక్కువగానే ఉన్నప్పటికీ సెలబ్రిటీలు వచ్చినప్పుడు మాత్రం ఒక్కసారిగా నెంబర్లు పెరిగిపోతున్నాయి.

 టాప్ సెలబ్రెటీలతో

టాప్ సెలబ్రెటీలతో

జూనియర్ ఎన్టీఆర్ గతంలో ఎవరూ చేయని విధంగా ఒకేసారి ఇద్దరూ టాప్ సెలబ్రిటీలను తీసుకు వస్తుండటం విశేషం. మొదట రామ్ చరణ్ ను ప్రత్యేకంగా ఆహ్వానించి ఆ తర్వాత టాప్ స్టార్ డైరెక్టర్స్ కొరటాల శివ, ఎస్ఎస్.రాజమౌళిని షోలోకి రప్పించాడు. మొత్తంగా షో అయితే మంచి రెస్పాన్స్ అందుకుంది. జూనియర్ ఎన్టీఆర్ తన సరికొత్త టైమింగ్ తో ఎంతగానో ఆకట్టుకుంటున్నాడు. వచ్చిన సెలబ్రిటీలను కూడా ఆటపట్టిస్తూ మంచి ఫన్ క్రియేట్ చేస్తున్నాడు.

ఈ దీపావళికి థమన్, దేవి

ఈ దీపావళికి థమన్, దేవి

ఇక ఈ దీపావళికి జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు టాప్ సంగీత దర్శకులను ఎవరు మీలో కోటీశ్వరులు షోకి ప్రత్యేకంగా ఆహ్వానించాడు. వారు మరెవరో కాదు ప్రస్తుతం గ్యాప్ లేకుండా బిజీగా వాయిస్తున్న తమన్, దేవిశ్రీ ప్రసాద్. శిక్షణ తీసుకోవడంలో ఇద్దరు కూడా దాదాపు ఒకేసారి వారి కెరీర్ ను మొదలుపెట్టారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ వారిని ఆటపట్టించడమే కాకుండా ఎన్నో రకాల ప్రశ్నలు కూడా వేశాడు.

 కలిసి పాట పాడిన ఎన్టీఆర్

కలిసి పాట పాడిన ఎన్టీఆర్


మరి మీ ఇద్దరిలో తుంబురుడు ఎవరు నారథుడు ఎవరు అని ఎన్టీఆర్ అడగడంతో.. దేవిశ్రీప్రసాద్ గిటార్ వయించగా తమన్ చిన్నపాటి డప్పు మోతతో అలరించాడు. దేవి ప్రత్యేకంగా ఎవరు మీలో కోటీశ్వరుడు అంటూ పాట కూడా పాడాడు. ఇక ఆ స్వరనికి తారక్ కూడా తన గాత్రాన్ని కలుపుతూ ఇక్కడ కల మీది.. ఆట నాది, కోటి మీది అంటూ డైలాగ్స్ ను పాటలోకి మార్చేశారు.

Recommended Video

Samantha : NTR కోసం మొదటిసారి సమంత అలా Naga Chaitanya ఎక్కడా తగ్గట్లేదుగా | RRR || Filmibeat Telugu

పంచ్ కోసం ప్రాణం ఇచ్చి తీసేస్తాను

అంతే కాకుండా పంచ్ కు పంచ్.. పంచ్ కోసం ప్రాణం ఇచ్చి తీసేస్తాను నేను అంటూ.. కాన్ఫిడెంట్ గా ఉన్నారా అని తారక్ ప్రశ్నిచగా అందుకు థమన్ ఓవర్ కాన్ఫిడెన్స్ అంటూ సరదాగా కౌంటర్ వేశాడు. ఈ దీపావళి హంగామా బుల్లితెర ప్రేక్షకులకు చాలా స్పెషల్ గా జరగబోతున్నట్లు తెలుస్తోంది. ఈ గురువారం జెమిని టీవీలో ఈ ఎపిసోడ్ రాత్రి 8:30 గంటలకు ప్రసారం కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X