Evaru Meelo Koteeswarulu లో పవన్ కల్యాణ్.. ఎన్టీఆర్ ముందు మహేష్ బాబు చేసిన మ్యాజిక్ అదే!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా కొనసాగుతున్న ఎవరు మీలో కోటీశ్వరులు రియాలిటీ షో జనరంజకంగా మారి బుల్లితెర ప్రేక్షకులకు కొత్త అనుభూతులను పంచుతున్నది. సాధారణ ప్రేక్షకులే కాకుండా స్టార్ హీరో, హీరోయిన్లు ఈ షోలో సందడి చేశారు. తాజాగా సూపర్‌స్టార్ మహేష్ బాబు ఎవరు మీలో కోటీశ్వరులు స్పెషల్ గెస్ట్‌గా రాబోతున్నారు. ఇప్పటికే ఈ షోలో మహేష్ బాబు వస్తున్నారనే విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ షోలో పవన్ కల్యాణ్ కూడా భాగమయ్యారనే వార్త మరింత క్రేజీగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

హాట్ సీటుపై మహేష్.. హోస్ట్ సీటుపై ఎన్టీఆర్

హాట్ సీటుపై మహేష్.. హోస్ట్ సీటుపై ఎన్టీఆర్

ఎవరు మీలో కోటీశ్వరులు షోలో హాట్ సీట్‌లో ఎన్టీఆర్ ఉంటేనే.. అదోక మ్యాజిక్. ఇక ఆయన ముందు సూపర్ స్టార్ మహేష్‌బాబు ఉంటే హోస్ట్ సీటు మ్యాజిక్ చెప్పనక్కర్లేదు. ఈ ఇద్దరు కలిసి బుల్లితెర మీద గేమ్ ఆడితో ఎలా ఉంటుందో మాటల్లో చెప్పలేం. అయితే ఈ షోలో మహేష్ బాబు తన స్నేహితుడు పవన్ కల్యాణ్‌ను భాగం చేయడంతో ఎవరు మీలో కోటీశ్వరులు ప్రత్యేక ఆకర్షణగా మారింది.

పవన్ కల్యాణ్‌తో మహేష్ అనుబంధం

పవన్ కల్యాణ్‌తో మహేష్ అనుబంధం

టాలీవుడ్‌ ప్రేక్షకులకు ఆరాధ్యదైవంగా భావించే నటుల్లో పవన్ కల్యాణ్, మహేష్ ఒకరంటే ఎలాంటి సందేహం అక్కర్లేదు. వారిద్దరి మధ్య విడదీయలేని అనుబంధం ఉంది. వీలు చిక్కినప్పుడల్లా మహేష్, పవన్ కల్యాణ్ ఇద్దరూ తమ అభిప్రాయాలను, ఆలోచనలు పంచుకొంటారనే విషయం పలు సందర్భాల్లో వ్యక్తమైంది. అలాంటి తన మిత్రుడు పవన్ కల్యాణ్‌ను మహేష్ బాబు ఎవరు మీలో కోటీశ్వరులులో భాగం చేయడం చర్చనీయాంశమైంది.

థ్రిల్లింగ్‌గా మహేష్ బాబు ఎపిసోడ్

థ్రిల్లింగ్‌గా మహేష్ బాబు ఎపిసోడ్

ఎవరు మీలో కోటీశ్వరులు షోలో ఎన్టీఆర్‌తో కలిసి మహేష్ బాబు ఆడుతూ గేమ్‌ను ఆసక్తికరంగా మార్చినట్టు సమాచారం. ఎన్నో విషయాలు, అనుభూతులను గేమ్ ఆడుతూ పంచుకొన్నారు. ఆ విషయాలు ప్రేక్షకులకు మరింత థ్రిల్లింగ్‌గా మారుతాయి. ఇద్దరు నటుల అభిమానులు ఆనందంలో మునిగిపోవడం ఖాయం అని తెలిసింది. అయితే మహేష్ బాబు ఓ ప్రశ్నకు తడబడటంతో వీడియో కాల్ ఆప్షన్‌ను ఉపయోగించుకోవడం ద్వారా పవన్ కల్యాణ్ గేమ్‌లోకి వచ్చారు అని చెబుతున్నారు.

మహేష్ బాబుకు పవన్ కల్యాన్ సాయం

మహేష్ బాబుకు పవన్ కల్యాన్ సాయం

అయితే ఎన్టీఆర్ వేసిన ప్రశ్నకు సమాధానం తెలియకపోవడంతో తాను వీడియో కాల్ ఆప్షన్ ఉపయోగించుకోవాలని చెప్పడంతో ఎన్టీఆర్ స్క్రీన్ పై కొన్ని పేర్లు డిస్ ప్లే చేశారు. అందులో పవన్ కల్యాణ్ పేరు ఉండటంతో ఎన్టీఆర్ ఆయనకు కాల్ చేసి మహేష్ బాబుకు సహాయం చేయమని అడిగారు. అలా మహేష్ ప్రశ్నకు పవన్ కల్యాణ్ సమాధానం ఇచ్చారు అనే విషయం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.

ఏ ప్రశ్నకు పవన్ కల్యాణ్‌ సమాధానం

ఏ ప్రశ్నకు పవన్ కల్యాణ్‌ సమాధానం

అయితే మహేష్ బాబు తడబడిన ప్రశ్న ఏమిటి? పవన్ కల్యాణ్ ఆ ప్రశ్నకు ఎలాంటి సమాధానం చెప్పారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్, పవన్ కల్యాణ్ మధ్య జరిగిన సంభాషణ ఏమిటి? మహేష్ బాబు, పవన్ కల్యాణ్ ఏం మాట్లాడుకొన్నారు ప్రశ్నలు అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. పవర్ ప్యాక్ట్ ఎపిసోడ్ ఎప్పుడెప్పుడు బుల్లితెరపైన ప్రసారం అవుతుందనే విషయం కోసం అభిమానులు వేచి చూస్తున్నారు.

ముగ్గురు సూపర్ స్టార్స్ ఒకే ఫ్రేములో

ముగ్గురు సూపర్ స్టార్స్ ఒకే ఫ్రేములో

ఇక ఒకే ఫ్రేమ్‌లో పవన్ కల్యాణ్, ఎన్టీఆర్, మహేష్ బాబు కలిసి కనిపించిన క్షణాలు అరుదు. కోట్లాది మంది అభిమానులు ఉన్న ఈ ముగ్గురు హీరోలు ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే ఇక ఫ్యాన్స్‌కు ఆనందానికి అవధులు ఉండవనేది సత్యం. ఇంతకు పవన్ కల్యాణ్ ఈ షోలో కనిపించనున్నారనే విషయం నిజమేనా? లేక రూమర్ అనేది కొద్ది రోజులు ఆగితే తేలిపోతుంది.

మహేష్ ఎపిసోడ్ ప్రసారం ఎప్పుడంటే..

మహేష్ ఎపిసోడ్ ప్రసారం ఎప్పుడంటే..

ఇదిలా ఉంటే.. ఎన్టీఆర్, మహేష్ బాబు పాల్గొన్న ఎవరు మీలో కోటీశ్వరులు షో ప్రసారం గురించిన వివరాలు నవంబర్ 23వ తేదీన వెల్లడించనున్నారు. ఈ షో గురించిన వార్తలు ట్విట్టర్‌లో ట్రెండింగ్‌గా మారాయి. మహేష్ బాబు, ఎన్టీఆర్ దేశవ్యాప్తంగా ట్రెండ్ అవుతున్నారు. అయితే ఈ వారాంతంలో గానీ లేదా వచ్చే సోమవారం (29వ తేదీ) గానీ ప్రసారమయ్యే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X