‘ఎవరు మీలో కోటీశ్వరులు’ నుంచి షాకింగ్ అప్‌డేట్: ఎన్టీఆర్ డేరింగ్.. కానీ వాళ్లే జంకుతున్నారు

తెలుగు బుల్లితెరపై ఎన్నో షోలు వస్తుంటాయి.. పోతుంటాయి. కానీ వాటిలో కొన్ని మాత్రమే ప్రేక్షకులను గెలుచుకుంటాయి. అయితే, కొన్ని షోలు మాత్రం ప్రేక్షకులనే గెలిపించడానికి వస్తుంటాయి. అందులో 'మీలో ఎవరు కోటీశ్వరుడు' ఒకటి. సామాన్యులను కోటీశ్వరులుగా మార్చేందుకు రూపొందిన ఈ కార్యక్రమం తెలుగులో సూపర్ సక్సెస్ అయింది. ఇప్పుడు దీన్నే జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేయబోతున్నాడు. కొద్ది రోజుల్లో ఈ షో షూటింగ్ ప్రారంభం కాబోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో దీని నుంచి ఓ షాకింగ్ అప్‌డేట్ బయటకు వచ్చింది. అసలేం జరిగింది? పూర్తి వివరాలు మీకోసం!

నాలుగు సీజన్లు.. ఇద్దరు స్టార్ హీరోలు

నాలుగు సీజన్లు.. ఇద్దరు స్టార్ హీరోలు

దాదాపు 120 దేశాల్లో ప్రసారం అవుతూ తెలుగులో కూడా వచ్చిన షో 'మీలో ఎవరు కోటీశ్వరుడు'. ఎన్నో అంచనాల నడుమ వచ్చిన ఇది.. ఇప్పటికే నాలుగు సీజన్లను పూర్తి చేసుకుంది. అన్ని భాషల్లో మాదిరిగానే మన దగ్గర కూడా ఈ షో సూపర్ సక్సెస్ అయింది. ఇందులో మొదటి మూడింటికీ అక్కినేని నాగార్జున.. నాలుగో దానికి మెగాస్టార్ చిరంజీవి హోస్టులుగా చేశారు.

ఐదో సీజన్... కొత్త టైటిల్.. కొత్త ఛానెల్

ఐదో సీజన్... కొత్త టైటిల్.. కొత్త ఛానెల్

'మీలో ఎవరు కోటీశ్వరుడు' గేమ్ షో నాలుగు సీజన్లు స్టార్ మా చానెల్‌లో ప్రసారం అయిన విషయం తెలిసిందే. దీని ద్వారా సదరు చానెల్‌కు భారీ స్థాయిలో రేటింగ్ వచ్చింది. అప్పట్లో ఇదే నెంబర్ వన్ గేమ్ షోగా ఉండేది. కానీ, అక్కడితోనే దీని ప్రస్థానం ఆగిపోయింది. ఇక, ఈ సారి ఈ గేమ్ షో జెమినీ టీవీలో ప్రసారం కాబోతుంది. దీనికి 'ఎవరు మీలో కోటీశ్వరులు' అని టైటిల్ మార్చారు.

మీ ఆశలను నిజం చేసే షో అని ప్రోమో

మీ ఆశలను నిజం చేసే షో అని ప్రోమో

జెమినీ టీవీలో ప్రసారం కాబోతున్న 'ఎవరు మీలో కోటీశ్వరులు' షో ప్రోమోను కొద్ది రోజుల క్రితం విడుదల చేశారు. అందులో దీని ప్రస్థానం గురించి వివరించారు నిర్వహకులు. అంతేకాదు, 'మీ జీవితాలని మార్చే గేమ్ షో.. మీ ఆశలని నిజం చేసే గేమ్ షో ''ఎవరు మీలో కోటీశ్వరులు'' త్వరలో మీ జెమినీ టీవీలో రాబోతుంది సిద్ధంగా ఉండండి' అంటూ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

ఈ షోతో జూనియర్ ఎన్టీఆర్ కమ్‌బ్యాక్

ఈ షోతో జూనియర్ ఎన్టీఆర్ కమ్‌బ్యాక్

సినిమాల పరంగా ఫుల్ ఫామ్‌లో ఉన్న సమయంలోనే జూనియర్ ఎన్టీఆర్.. బిగ్ బాస్ అనే షోకు హోస్టుగా చేసిన విషయం తెలిసిందే. యాంకర్‌గా మొదటి ప్రయత్నమే అయినా.. దీన్ని విజయవంతంగా నడిపించాడు. అంతేకాదు.. అద్భుతమైన హోస్టింగ్‌తో కొత్త వన్నెను తీసుకొచ్చాడు. ఇప్పుడు చాలా గ్యాప్ తర్వాత 'ఎవరు మీలో కోటీశ్వరులు' షోతో కమ్‌బ్యాక్ అవుతున్నాడు.

పనులు మొదలు.. ఈ నెల నుంచే అని

పనులు మొదలు.. ఈ నెల నుంచే అని

'ఎవరు మీలో కోటీశ్వరులు' షోకు సంబంధించిన పనులు ఎప్పుడో ప్రారంభం అయ్యాయి. ఇప్పటికే ఈ షోలో పాల్గొనబోయే కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియ కూడా మొదలైంది. జెమినీ టీవీలో ప్రశ్నలు కూడా అడిగేశారు. ఆ మధ్య తిరుపతిలో ఆడిషన్స్ కూడా నిర్వహించారు. దీంతో ఇది మే మొదటి వారంలోనో.. రెండో వారంలోనో ప్రారంభం అవుతుందని జోరుగా ప్రచారం జరుగుతోంది.

షాకింగ్ అప్‌డేట్: ఎన్టీఆర్ డేరింగ్.. కానీ

షాకింగ్ అప్‌డేట్: ఎన్టీఆర్ డేరింగ్.. కానీ

తాజా సమాచారం ప్రకారం.. 'ఎవరు మీలో కోటీశ్వరులు' షోను వాయిదా వేయబోతున్నారట. కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ షూటింగ్‌లో పాల్గొనేందుకు జూనియర్ ఎన్టీఆర్ డేర్ చేస్తున్నాడట. కానీ, యూనిట్ మాత్రం వాయిదా వేయాలని డిసైడ్ అయిందనే టాక్ వినిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X