For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Evaru Meelo Koteeswarulu షోకు షాకింగ్ రేటింగ్: చరిత్ర సృష్టించిన ఎన్టీఆర్.. దానితో పోలిస్తే మాత్రం!

  |

  బుల్లితెరపై ప్రసారం అయ్యే షోలు అన్నింటికీ ప్రేక్షకుల నుంచి ఆదరణ లభిస్తుందన్న గ్యారెంటీ లేదు. కంటెంట్ మంచిగా ఉన్నా జనాల్లోకి వెళ్లడంలో విఫలమైన షోలు చాలా ఉన్నాయి. అందుకే ఈ మధ్య కాలంలో ఎలాంటి కార్యక్రమం ప్రారంభం అయినా.. దానికి అనుగుణంగానే ప్రచారం చేస్తున్నారు. అయితే, ఓ షో మాత్రం ఆది నుంచే భారీ అంచనాలను ఏర్పరచుకుంది. అదే 'ఎవరు మీలో కోటీశ్వరులు'. దీనికి కారణం ఈ షోను స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తుండడమే.

  గతంలోనే తన హోస్టింగ్‌తో బిగ్ బాస్‌ను సక్సెస్‌ఫుల్‌గా నడిపించిన యంగ్ టైగర్.. ఇప్పుడు దీన్ని కూడా అదే మాదిరిగా హోస్ట్ చేస్తాడన్న నమ్మకం అందరిలో ఉంది. అందుకే ఈ షోపై ఆసక్తి పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో 'ఎవరు మీలో కోటీశ్వరులు' ఫస్ట్ ఎపిసోడ్ రేటింగ్ వచ్చేసింది. వివరాల్లోకి వెళ్తే...

  ఇద్దరు హీరోలతో నాలుగు సీజన్లు

  ఇద్దరు హీరోలతో నాలుగు సీజన్లు

  హిందీలో చాలా కాలంగా ప్రసారం అవుతోన్న ‘కౌన్ బనేగా కరోడ్‌పతీ' ఆధారంగా తెలుగులోకి వచ్చిన షోనే ‘మీలో ఎవరు కోటీశ్వరుడు'. జనరల్ నాలెడ్జ్‌ ఆధారంగా.. సామాన్యులను కోటీశ్వరులు చేయాలన్న లక్ష్యంతో దీన్ని మొదలు పెట్టారు. అన్ని భాషల మాదిరిగానే తెలుగులోనూ ఇది విజయవంతం అయింది. ఫలితంగా ఇప్పటికే నాలుగు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది.

  ఇందులో మొదటి మూడింటినీ అక్కినేని నాగార్జున.. నాలుగో దాన్ని మాత్రం చిరంజీవి హోస్ట్ చేశారు. షో జరిగే తీరుకు వీళ్ల హోస్టింగ్ తోడవడం వల్లే సూపర్ సక్సెస్ అయిందన్న విషయం తెలిసిందే.

  అనసూయకు నెలలు అంటూ అభి సంచలన వ్యాఖ్యలు: ప్రెగ్నెన్సీపై అందరి ముందే ఊహించని ఆన్సర్

  ఐదో సీజన్ అలా... రామారావుతో

  ఐదో సీజన్ అలా... రామారావుతో

  తెలుగు బుల్లితెర చరిత్రలోనే సూపర్ హిట్ షోగా పేరొందిన వాటిలో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు' ఒకటి. నాలుగు సీజన్లు పూర్తైనా తర్వాత ఎందుకనే దీన్ని ఐదోది మొదలెట్టలేదు. దీంతో ఈ షో ఇకపై ఉండదన్న టాక్ వినిపించింది. ఈ నేపథ్యంలో చాలా గ్యాప్ తర్వాత దీన్ని మరోసారి ప్రసారం చేస్తున్నారు. అయితే, ఈ సారి దీనికి ‘ఎవరు మీలో కోటీశ్వరులు' అని టైటిల్ మార్చారు.

  అంతేకాదు, ఈ సీజన్‌ను స్టార్ మాలో కాకుండా జెమినీ టీవీలో ప్రసారం చేస్తున్నారు. ఈ సీజన్‌ను టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్నాడు. దీంతో దీనిపై అంచనాలు పెరిగాయి.

   చరణ్‌తో మొదలైన షో ప్రయాణం

  చరణ్‌తో మొదలైన షో ప్రయాణం

  ఎన్నో అంచనాల నడుమ ‘ఎవరు మీలో కోటీశ్వరులు' షోను ఆగస్టు 22న అంగరంగ వైభవంగా ప్రారంభించారు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సారథ్యంలో మొదలైన ఈ సీజన్‌ కర్టన్ రైజర్ ఎపిసోడ్‌కు టాలీవుడ్ స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథిగా విచ్చేశాడు.

  RRR సినిమాలో కలిసి నటిస్తున్న ఈ ఇద్దరు హీరోలు.. ఈ షోలోనూ ఎంతో సందడి చేశారు. ఇందులో గేమ్‌ను గేమ్‌లా ఆడుతూనే ప్రేక్షకులకు మజాను పంచేలా పర్సనల్ విషయాలను సైతం ప్రస్తావించుకున్నారు. తద్వారా ఎవరికీ తెలియని ఎన్నో అంశాలను బయట పెట్టుకున్నారు.

  షర్ట్ మొత్తం విప్పేసి ‘ఎవడు' హీరోయిన్ హాట్ షో: తల్లైన తర్వాత కూడా ఇంత ఘాటుగానా!

  25 లక్షలు గెలుచుకున్న చరణ్

  25 లక్షలు గెలుచుకున్న చరణ్

  ఇద్దరు స్టార్ హీరోలతో కలిసి ప్రారంభమైన ‘ఎవరు మీలో కోటీశ్వరులు' షో ఆరంభంలోనే అలరించిందనే చెప్పాలి. రెండు రోజుల పాటు సాగిన ఈ ఎపిసోడ్‌ ఆద్యంతం ఎంతో ఉల్లాసంగా సాగింది. ఇందులో పర్సనల్ విషయాలతో పాటు గేమ్‌ను ఎలా ఆడాలో కూడా ఈ స్టార్లు ఇద్దరూ కంటెస్టెంట్లకు వివరించారు. తద్వారా వారిలో ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించారు. ఇక, తారక్ అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పిన రామ్ చరణ్.. ఏకంగా రూ. 25 లక్షలు గెలుచుకున్నాడు. ఆ మొత్తాన్ని చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు అందించి తన గొప్పతనాన్ని చాటుకున్నాడు.

  మొదటి ఎపిసోడ్‌కు భారీ రేటింగ్

  మొదటి ఎపిసోడ్‌కు భారీ రేటింగ్

  అంగరంగ వైభవంగా ప్రారంభం అయిన ‘ఎవరు మీలో కోటీశ్వరులు' షోకు తెలుగు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే స్పందన లభిస్తోంది. మరీ ముఖ్యంగా టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌తో సాగిన కర్టెన్ రైజర్ ఎపిసోడ్‌కు మరింత ఎక్కువగా రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా దీనికి భారీ స్థాయిలో రేటింగ్ లభించింది.

  ఆగస్టు 22, 23న ప్రసారం అయిన ‘ఎవరు మీలో కోటీశ్వరులు' ప్రారంభ ఎపిసోడ్‌కు సంబంధించిన రేటింగ్ తాజాగా వెలువడింది. దీనికి రికార్డు స్థాయిలో 11.40 టీఆర్పీ రేటింగ్ దక్కింది. ఇది ఈ షో చరిత్రలోనే అత్యధిక రేటింగ్ కావడం విశేషం.

  టాప్‌ తీసేసి హీరోయిన్ హాట్ సెల్ఫీ: పెళ్లైన తర్వాత కూడా అందాలు మొత్తం చూపించిందిగా!

  చరిత్రలో సరికొత్త రికార్డ్ నమోదు

  చరిత్రలో సరికొత్త రికార్డ్ నమోదు

  ‘ఎవరు మీలో కోటీశ్వరులు' షోను జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్నాడన్న న్యూస్ వచ్చినప్పటి నుంచే దీనిపై అంచనాలు పెరిగిపోయాయి. అందుకు అనుగుణంగానే ఈ షో ప్రారంభ ఎపిసోడ్‌కు 11.40 రేటింగ్ దక్కింది. ఇక, గతంలో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు' షో నాలుగు సీజన్లకు సంబంధించిన ప్రారంభ ఎపిసోడ్ రేటింగ్‌ను పరిశీలిస్తే.. అక్కినేని నాగార్జున హోస్ట్ చేసిన మొదటి సీజన్‌కు 9.70, రెండో సీజన్‌లో 8.20, మూడో సీజన్‌లో 6.72, మెగాస్టార్ చిరంజీవి నడిపించిన నాలుగో సీజన్‌లో 3.62 రేటింగ్ మాత్రమే దక్కింది. దీంతో తారక్ పేరిట ఇప్పుడు సరికొత్త రికార్డు నమోదైంది.

  RRR కోసం Radhe Shyam Thaggede Ley | Prabhas Vs RRR || Filmibeat Telugu
  దానితో పోలిస్తే మాత్రం తక్కువే

  దానితో పోలిస్తే మాత్రం తక్కువే

  జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేసిన ‘ఎవరు మీలో కోటీశ్వరులు' ఫస్ట్ ఎపిసోడ్‌కు 11.40 రేటింగ్ రావడంతో బిగ్ బాస్ తర్వాత అత్యధిక రేటింగ్ సాధించిన షోగా ఇది రికార్డు క్రియేట్ చేసింది. అయితే, RRR హీరోలిద్దరూ పాల్గొన్న ఎపిసోడ్‌కు సుమారు 15 వరకూ రేటింగ్ వస్తుందని అంతా భావించారు.

  కానీ, ఇందులో నిరాశే ఎదురైంది. మరీ ముఖ్యంగా తెలుగు బిగ్ బాస్ రేటింగ్ 18 పైచిలుకున నమోదైంది. దానితో పోల్చుకుంటే ‘ఎవరు మీలో కోటీశ్వరులు'కు వచ్చింది చాలా తక్కువన్న టాక్ వినిపిస్తోంది. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో తారక్ ఇంత రాబట్టాడంటే గ్రేట్ అనే చెప్పాలి.

  English summary
  Evaru Meelo Koteeswarulu Show Ram Charan And Jr NTR 1st Episode TRP Rating is Out Now. This Episode Got 11.4 TRP Rating. This is Highest Ever in EMK History.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X