For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Ram Charan in EMk : కాజల్ సీక్రెట్, పవన్ తో అనుబంధం.. కొత్త అవతారం రివీల్ చేసిన తారక్!

  |

  ఒకపక్క నందమూరి అభిమానులు మరోపక్క మెగా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న మీలో ఎవరు కోటీశ్వరులు కొద్ది సేపటి క్రితం ప్రసారమైంది.. రామ్ చరణ్ తేజ్ మొదటి ఎపిసోడ్ అయిన కర్టెన్ రైజర్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇక ఈ ఈవెంట్ మొదలైనప్పటి నుంచి సుమారు గంట సేపు కూడా ఆసక్తికరంగా ప్రేక్షకులను ఛానల్ మార్చకుండా చేయగలగడంలో ఈ షో విజయవంతం అయింది అని చెప్పవచ్చు.. ఇక ఈరోజు గంటపాటు సాగిన ఎపిసోడ్ లో జరిగిన హైలెట్స్ విషయంలోకి వెళితే..

  రూల్స్ అన్నీ చెప్పి

  రూల్స్ అన్నీ చెప్పి

  తాను మళ్లీ మూడేళ్ల తర్వాత ప్రేక్షకులను ఈ విధంగా కలుసుకోవడం తనకు ఆనందంగా ఉందని జూనియర్ ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు. ఈ షో ద్వారా చాలా మంది డబ్బుతో పాటు మనసుని కూడా గెలవచ్చు అని చెప్పుకొచ్చాడు. శ్రీశ్రీ చెప్పిన ఒక కవితతో షో ప్రారంభించిన తారక్ కరోనా వల్ల ఇబ్బందులు పడ్డామని ఆ ఇబ్బందులు అన్నింటినీ తట్టుకుని మళ్ళీ నిలబడాలని కోరాడు. ఇక మొదటి ఎపిసోడ్ మీ అందరికీ గుర్తుండిపోయేలాగా తన స్నేహితుడు బ్రదర్ అయిన రామ్ చరణ్ ని తీసుకు వచ్చాను అని ఆయనతో ఈ ఎపిసోడ్ లో ట్రయల్ లో చూపిస్తా అని కూడా అన్నాడు. అలా షో మొదలుపెట్టిన తారక్ షో మొదట్లోనే షో రూల్స్ మొత్తం రామ్ చరణ్ కి వివరించారు. మొదటి ప్రశ్న 1000 రూపాయలు కాగా చివరి ప్రశ్న కోటి రూపాయలు ఉంటుందని, ఐదు ప్రశ్నకు 10 వేల రూపాయలు 10 వ ప్రశ్నకు మూడు లక్షల 20 వేల రూపాయలు సేఫ్ పాయింట్స్ ఉంటాయి అని అన్నాడు..ఆ సేఫ్ పాయింట్స్ రీచ్ అయితే అక్కడ వరకు వచ్చిన మొత్తాన్ని కచ్చితంగా తీసుకెళ్లే అవకాశం ఉంటుందని అన్నాడు.

  పవన్ తో అనుబంధం

  పవన్ తో అనుబంధం

  ఇక ఆ తర్వాత రామ్ చరణ్ తో ఆట ఆడిస్తూనే అనేక ఆసక్తికరమైన విషయాలు ప్రేక్షకులకు తెలిసేలా చేశాడు రాంచరణ్ అన్ని వివరాలు మీకు అందిస్తున్నాం. షోలో పవన్ కళ్యాణ్ తో తనకున్న అనుబంధాన్ని రామ్ చరణ్ పంచుకున్నారు. పవన్ ని బాబాయ్ అనాలో అన్నా అనాలో తండ్రి లాంటివారు అనాలో తనకు అర్థం కాదని.. తమ రిలేషన్ బయట పెడితే దానికి దిష్టి తగులుతుంది అని అనిపిస్తూ ఉంటుంది అని చరణ్ చెప్పుకొచ్చారు. అందుకే పవన్ రిలేషన్ గురించి ఎవరు అడిగినా తాను సైలెంట్ గా ఉండి పోతానని కానీ అడిగింది నువ్వు కాబట్టి చెబుతున్నానని ఈ విషయం చెప్పుకొచ్చాడు. ఇక రామ్ చరణ్ ఒక వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ గా మారారు అని ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు. రామ్ చరణ్ తీసిన కొన్ని ఫోటోలు తాను చూశానని ఇంత టాలెంట్ ఉంటుందని తాను ఊహించలేదని ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు.

  వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్

  వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్

  ఆఫ్రికా వెళ్లి రామ్ చరణ్ కొన్ని ఫోటోలు తీసాడు అని ఎన్టీఆర్ అన్నారు. ఈ టాలెంటు ఉంది అని ఎలా గుర్తించావు అని అడిగితే నీతో కలిసి షూటింగ్ చేస్తున్నప్పుడే గుర్తించాను అని చరణ్ చెప్పాడు. అలాగే చిరంజీవితో ఆచార్య సినిమా షూటింగ్ అనుభవాలు చెప్పమని జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ ని అడిగాడు. అయితే తనకు మామూలుగానే షూటింగ్ కి వెళ్లడం అంటే కొంచెం టెన్షన్ గా ఉంటుందని అలాంటిది నాన్నగారితో షూటింగ్ కి వెళ్లడం అంటే ప్రిన్సిపాల్ తో కూర్చుని పరీక్షలు రాస్తున్నట్లు అనిపించింది అని అన్నాడు. అయితే తాను పడ్డ కష్టమంతా తెరమీద కచ్చితంగా కనిపిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు చరణ్. ఇక అలాగే రామ్ చరణ్ ఒక పెట్ లవర్ ని అని చెప్పుకొచ్చారు. ఆయన దగ్గర ప్రస్తుతం ఆరు కుక్కలు ఉన్నాయట..

   కుక్కల ప్రేమ

  కుక్కల ప్రేమ

  అలాగే ఎన్టీఆర్ గురించి చెబుతూ మీ అందరికీ తెలియదుగానీ ఎన్టీఆర్ దగ్గర ఒకప్పుడు రెండు కుక్కలు ఉండేవి అని అందులో ఒక కుక్క అయితే ఎంత పెద్దగా ఉంటుంది అంటే అలాంటిది హైదరాబాద్ మొత్తంలో ఒక్కటే ఉంటుందేమో అని రామ్ చరణ్ చెప్పుకొచ్చాడు.. అయితే అనారోగ్యంతో ఆ కుక్క చనిపోయిందని అప్పటి నుంచి తన కుక్కల విషయంలో హార్ట్ బ్రేక్ అయిందని అన్నారు. అయితే బీ చేత మళ్ళీ కుక్క పెంచేలా చేస్తానని రామ్ చరణ్ చెప్పుకొచ్చాడు. అలాగే నేను నీకు మంచి కుక్కపిల్లలు గిఫ్ట్ ఇస్తాను అని కూడా అన్నాడు. అలాగే షూటింగ్ గ్యాప్లో కూడా మనం ఈ కుక్కల గురించి కుక్కల బ్రీద్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం కదా అని ఎన్టీఆర్ గుర్తు చేసుకున్నాడు. మొత్తం మీద ఇద్దరు పెట్ లవర్స్ అని తేలింది.

  కాజల్ తో ఇబ్బందులు

  కాజల్ తో ఇబ్బందులు

  రామ్ చరణ్ పెంచుతున్న రెండు గుర్రాల గురించి కూడా ప్రస్తావించారు. మగధీర సినిమాలో రెండు గుర్రాలు వాడామని అందులో మగ గుర్రం పేరు బాద్షా అయితే ఆడ గుఱ్ఱము పేరు కాజల్ అని చెప్పుకొచ్చాడు.. విషయం ఏమిటంటే ఆడ గుర్రాన్ని తనకు ఇచ్చి తన స్నేహితుడు కన్నుమూసాడు అని ఆడగుర్రం కళ్ళు చాలా నల్లగా ఉంటాయి అని అన్నాడు. అందుకే దానికి కాజల్ అని పేరు పెట్టమని కానీ దురదృష్టవశాత్తు ఆ తర్వాత హీరోయిన్ కూడా కాజల్ అగర్వాల్ అయింది అని అన్నాడు.. దాని వల్ల తాను తరువాత కొంచెం ఇబ్బంది పడ్డా అని చెప్పుకొచ్చాడు. ఇక షో లో రామ్ చరణ్ ఆరెంజ్ సినిమా నుంచి సిడ్నీ నగరం సాంగ్ ని పాడి వినిపించారు. అద్భుతంగా పాడారు అని ప్రశంసలు కురిపించిన ఎన్టీఆర్ త్వరలోనే ఒక సినిమాలో కూడా పాడాలని కోరారు. కచ్చితంగా అవకాశం వస్తే పాడతానని రామ్ చరణ్ చెప్పుకొచ్చాడు.

  RRR First Single Dosti Song Review | Filmibeat Telugu
  భలే ప్లాన్ వేశారుగా

  భలే ప్లాన్ వేశారుగా

  అలాగే ఆర్ ఆర్ ఆర్ సినిమా గురించి కూడా షోలో ఎక్కువగా ప్రస్తావించారు. చరణ్ ఇంట్రడక్షన్ ముందు అల్లూరి సీతారామరాజు ప్రోమో వేసి ఆయనని లోపలికి ఆహ్వానించారు. అంతేకాక కొమురం భీం పాత్ర గురించి కూడా రామ్ చరణ్ ముందు కొన్ని హింట్స్ ఇచ్చే ప్రయత్నం చేసి చెబితే మళ్ళీ రాజమౌళి ఊరుకోడు నేనేమీ మాట్లాడను కానీ దాని నుంచి వచ్చే సర్ప్రైజ్ ల గురించి ఎంత చెప్పినా తక్కువే.. కచ్చితంగా మనం ఎంత చెప్పినా దానికి మిన్కిహ్ రాజమౌళి విజువల్ ట్రీట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది అని చెప్పుకొచ్చాడు. అలాగే ఈ రెండు పాత్రలు చేయడం తమ పూర్వజన్మ సుకృతం రామ్ చరణ్ ఎన్టీఆర్ ఇద్దరూ అన్నారు. ఈ సినిమాల్ విషయంలో రాజమౌళి ధన్యవాదాలు కూడా చెప్పారు. షో మొత్తం ఒక ఎపిసోడ్ లోనే ఉంటుంది అనుకుంటే రెండు ఎపిసోడ్లు వచ్చేలా ప్లాన్ చేశారు. సో రామ్ చరణ్ కోసం రెండో ఎపిసోడ్ కూడా కచ్చితంగా జనం అందరూ చూస్తారు అనే ఉద్దేశ్యం అయి ఉండవచ్చు. షో లో 3 లైఫ్ లైన్స్ ఉంటాయి.. అందులో ఒకటి వీడియో కాల్ మై ఫ్రెండ్.. ఈ లైఫ్ లైన్ వాడిన చరణ్ బల్లాల రానాకి కాల్ చేశాడు. రానాతో ఎన్టీఆర్ కాస్త సరదాగా మాట్లాడుతున్నట్టు కమింగ్ అప్ లో చూపారు.

  English summary
  Jr NTR-hosted Evaru Meelo Koteeswarulu aired its grand curtain-raiser a while back. Ram Charan appeared as celebrity guest of the episode. here are the highlights.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X