Samantha in Jr NTR's EMK Show: సమంత ఎంత గెలుచుకొన్నదో తెలుసా?

గత కొద్ది రోజులుగా మ్యారేజ్ బ్రేకప్ వార్తల కారణంగా సమంత రుత్ ప్రభు వార్తల్లో కీలకంగా మారారు. నాగచైతన్య అక్కినేని తో వైవాహిక జీవితానికి సంబంధించిన బంధాలను తెగతెంపులు చేసుకొన్న తర్వాత అంతకు ముందు కూడా మీడియాకు దూరంగా ఉంటూ వచ్చారు. అయితే సమంత మరోసారి మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. అయితే ఎన్టీఆర్ హోస్ట్‌గా నిర్వహిస్తున్న ఎవరు మీలో కోటీశ్వరుడు షోలో పాల్గొన్నారనే వార్త సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

సమంతపై మ్యారేజ్ బ్రేకప్ ప్రభావం

సమంతపై మ్యారేజ్ బ్రేకప్ ప్రభావం

సమంత, నాగచైతన్య విడిపోతున్నారనే వార్తలు కొద్దికాలంగా మీడియాలో విస్తృతంగా ప్రచారమయ్యాయి. అలాంటి వార్తలు నిజమే అనే విధంగా సమంత, నాగచైతన్య మేమిద్దరం వైవాహిక జీవితానికి ముగింపు పలకాలని నిర్ణయం తీసుకొన్నాం అని అధికారికంగా ప్రకటించారు. అయితే మ్యారేజ్ బ్రేకప్ అంశం సమంతపై భారీ ప్రభావం చూపిస్తుందని అంతా ఊహించారు. కానీ తాజాగా సోషల్ మీడియాలో వెలుగు చూసిన ఫోటోను బట్టి అలాంటి బాధ తనలో లేదనే విషయం స్పష్టంగా కనిపించింది.

కెరీర్‌పై దృష్టిపెట్టిన సమంత

కెరీర్‌పై దృష్టిపెట్టిన సమంత

తన మ్యారేజ్ బ్రేకప్ విషయాన్ని పట్టించుకోకుండా సమంత తన కెరీర్‌పై పూర్తిస్థాయిలో దృష్టిపెట్టినట్టు తెలున్నది. నయనతారతో కలిసి ఇప్పటికే ఓ చిత్రంలో నటిస్తుండగా.. ప్రముఖ బ్యానర్ శ్రీదేవి మూవీస్‌లో నిర్మాత కృష్ణప్రసాద్ శివలెంక నిర్మించే ఓ చిత్రంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తాజాగా ఓ ఛారిటీ కోసం ఎన్టీఆర్‌తో కలిసి ఎవరు మీలో కోటీశ్వరులు షోలో పాలు పంచుకొన్నారు.

 ఎన్టీఆర్‌తో కలిసి ఎవరు మీలో కోటీశ్వరులు షోలో

ఎన్టీఆర్‌తో కలిసి ఎవరు మీలో కోటీశ్వరులు షోలో

ఎవరు మీలో కోటీశ్వరులు షోలో ప్రముఖులను అతిథిగా ఆహ్వానిస్తూ గేమ్ ఆడుతున్నారు. ఆరంభ ఎపిసోడ్‌లో మెగాపవర్ స్టార్ రాంచరణ్, అలాగే దర్శక ధీరుడు రాజమౌళి, సెన్సేషనల్ దర్శకుడు కొరటాల శివను ఈ షోలోకి ఆహ్వానించిన సంగతి తెలిసిందే. అయితే ఈ షోలో పాల్గొనే సెలబ్రిటీలు ఏదైనా స్వచ్ఛంద సంస్థకు గానీ, ఫౌండేషన్‌కు గానీ ఈ గేమ్‌లో గెలిచే మొత్తాన్ని ఇవ్వాల్సి ఉంటుందనే నిబంధనను చెప్పారు. అయితే తాజాగా సమంత తాను నిర్వహించే ప్రత్యూష ఫౌండేషన్ కోసం ఎవరు మీలో కోటీశ్వరులు షోలో పాల్గొన్నట్టు తెలిసింది.

 ఎన్టీఆర్ ఇచ్చిన చెక్‌తో సమంత

ఎన్టీఆర్ ఇచ్చిన చెక్‌తో సమంత

ఇటీవల ఎన్టీఆర్‌తో కలిసి సమంత మీలో ఎవరు కోటీశ్వరులు షోలో పాల్గొనగా.. ఆ షోను చిత్రీకరించినట్టు తెలిసింది. ఈ సందర్భంగా గెలుచుకొన్న మొత్తానికి ఎన్టీఆర్ చెక్ ఇవ్వగా.. దానిని పట్టుకొని తన మేనేజర్ మహేంద్రతో కలిసి ఫోటో దిగారు. సమంత, మహేంద్ర దిగిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. తన అభిమానులు షేర్ చేస్తూ, లైక్స్ కొడుతుండటంతో Samantha ట్విట్టర్‌లో ట్రెండింగ్‌గా మారింది.

సమంత ఎంత గెలుచుకొన్నారంటే..

సమంత ఎంత గెలుచుకొన్నారంటే..

ఇదిలా ఉంటే.. ఎన్టీఆర్‌ హోస్ట్‌గా ఉన్న షోలో సమంత చాలా హుషారుగా, సంతోషంగా ఆడుతూ కనిపించింది. ఎన్టీఆర్‌తో ఉన్న పరిచయం కారణంగా ఆమె చిలిపిగా ఆయనను ఆటపట్టించే ప్రయత్నం చేసింది. అలా సరదా సరదాగా గేమ్‌ను ఆసక్తికరంగా మార్చారు. ఈ షోలో సమంత రూ.25 లక్షలు గెలుచుకొన్నట్టు సమాచారం. త్వరలోనే ఈ షో జెమినీ టెలివిజన్‌లో ప్రసారం కానున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X